దుల్కర్,రానా  ‘కాంత’ రివ్యూ
x

దుల్కర్,రానా ‘కాంత’ రివ్యూ

టెక్నికల్‌ అద్భుతం, కానీ …

1950ల మద్రాస్ సినిమా ప్రపంచం—

కెమెరా శబ్దం, ఫిల్మ్ రీల్ వాసన, సృజనకు ప్రాణం పెట్టే ఉన్న కళాకారుల రాజ్యం. అక్కడే మొదలవుతుంది దర్శకదిగ్గజం అయ్య (సముద్రఖని), ఆయన శిష్యుడు, ఇండస్ట్రీ ఐకాన్‌గా వెలిగుతున్న టీకే మహదేవన్‌ (దుల్కర్) మధ్య నిశ్శబ్దంగా యుద్దం.

ఇక అయ్యకు జీవిత కాల స్వప్నం— తన తల్లి జీవతాన్ని బేస్ చేసుకునే ఒక సినిమా తీయాలి. టైటిల్ ‘శాంత’ . ఆలోచన, బాధ, త్యాగం అనే సూక్ష్మభావాలను వెండి తెరపై బొమ్మలుగా మార్చే ప్రయత్నం.

కానీ… తానే తీర్చిదిద్దిన శిష్యుడు, ఇప్పుడు స్టార్‌డమ్‌లో మునిగిపోయి, గురువు ప్రతీ మాటను కొట్టిపారేస్తాడు. ఎనిమిదేళ్ల క్రితం విరిగిన గురువు–శిష్య బంధం, ఒక ప్రొడ్యూసర్ ఒత్తిడితో మళ్ళీ కలిసినా… ఆ పాత గాయాలు తాజాగా మెరుస్తూనే ఉంటాయి.

సెట్‌పై రాజు గా చెలరేగిపోతూంటాడు మహదేవన్… స్క్రిప్ట్‌పై నియంత్రణ తనదే! “టైటిల్ ‘శాంత’ కాదు. నా మార్కెట్‌కి సూటయ్యేలా ‘కాంత’ అని మార్చాలి.” “క్లైమాక్స్? అది నా ఇమేజ్ తిరగరాసేలా ఉండాలి.” మహదేవన్ డిమాండ్‌లు సైలెంట్‌గా భరించే అయ్య… కెమెరా ముందు నవ్వుతాడు, కానీ హృదయంలో మాత్రం ఓదార్పు లేని అగ్నిపర్వతం.

ఇక కొత్త హీరోయిన్ — కథలో నిశ్శబ్ద భూకంపం సినిమాకు ఎంపికైన కుమారి (భాగ్యశ్రీ బోర్సే)— కళ్ళలో అమాయకం, ఆర్టులో అగ్ని, గురువు అయ్య పట్ల భక్తి. ఆయన చెప్పినది చెయ్యడమే ఆమె విధి. అదే మహదేవన్‌కు మొదట అసహ్యం. కానీ… కాలం గడిచేకొద్దీ కెమెరా లెన్స్‌లో ఆమె కనిపించే ప్రతి భావం అతనిని తనవైపు లాగిపడేస్తుంది. ఇద్దరి మధ్య మెల్లగా పెరుగుతున్న ఆ ప్రేమ… వారిద్దరూ ఏకమై గర్భం కూడా వస్తుంది. తర్వాత పరిస్థితులలో మహదేవన్ ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతాడు, కానీ ఓ అడ్డం అతను ఇప్పటికే ఓ మీడియా దిగ్గజం కూతురికి భర్త.

సెట్‌ చుట్టూ నిశ్శబ్ద ఉచ్చు

ఓ ప్రక్క గురు–శిష్యుల ఇగో వార్‌ , మరో ప్రక్క అక్రమ ప్రేమ వ్యవహారం ఎలాంటి ముగింపుకు వస్తుందనే టెన్షన్. యూనిట్‌ పరిస్దితి క్షణ క్షణం మంచు, మంటల మధ్య ఫ్రీజ్ చేసినట్టే ఉంటుంది. ఇక సినిమా పూర్తి కావొస్తోంది.. ఒకే ఒక్క సీన్ మిగిలి ఉండగానే… సెట్‌పై కనిపించని ఉద్రిక్తత తన అసలు రూపం చూపుతుంది.

అదే రాత్రి — స్టూడియోను చీల్చిన దెబ్బ. లైట్లు ఆరిపోయిన తర్వాత స్టూడియో గేట్లు మూసుకున్నాయి. అక్కడే… ఎవరో ఒకరు నేలపై నిశ్చలంగా పడి ఉన్నారు. ఒక హత్య. ఆ హత్య గావింపడింది మరెవరో కాదు కుమారి.

అప్పుడు ఎంటర్ అవుతాడు ఫీనిక్స్ (రానా) — కుమారిని చంపింది ఎవరు? ఎందుకు ఆమెను చంపాల్సి వచ్చింది? చివరికి ఏమైంది? అసలు మొదట గురువు–శిష్యుల మధ్య విభేధం ఎందుకు మొదలైంది?

ఎనాలసిస్ :

ఒకే కథ రెండు విభిన్నమైన టోన్స్‌లో ప్రయాణించినప్పుడు స్క్రీన్‌ప్లే ఎలా సాఫీగా సాగదో, చూసేవారిని ఎలా ఇబ్బంది పెడుతుందో చెప్పేందుకు ఉదాహరణగా ఈ సినిమా నిలుస్తుంది. ఫస్టాఫ్ గురు–శిష్యుల మధ్య ఇగో వార్ ని డీల్ చేస్తే, సెకండాఫ్ కు వచ్చేసరికి సినిమా సెట్లో జరిగే హత్య,ఇన్విస్టిగేషన్ ని డీల్ చేయటం సమస్యగా మారింది.

ఫస్ట్ హాఫ్ — అద్భుతమైన సెటప్, బలమైన ఎమోషన్స్, క్లూలతో నిండిన కథనంతో సాగింది. ఇంటర్వల్ ట్విస్ట్ సూపర్‌గా ల్యాండ్ అవుతుంది. ప్రేక్షకుడు “ఇప్పుడు ఏం జరుగుతుందో?” అనుకునే స్థితికి వస్తాడు. సెకండ్ హాఫ్ — సినిమా అకస్మాత్తుగా మర్డర్ మిస్టరీగా మారడం జరిగింది. ఇంటర్వల్ తర్వాత… టోన్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత రానా పోలీస్ ఆఫీసర్‌గా ఎంటరయ్యే వరకు బాగానే ఉంటుంది. కానీ వెంటనే విషయాలు బ్రేక్ డౌన్ అవ్వటం అవుతాయి. పీరియడ్ సెట్టింగ్‌లో సాగుతున్న కథ ఒక్కసారిగా మోడ్రన్ స్టైల్ ఇన్విస్టిగేషన్ గా అనిపిస్తూంటుంది. మళ్లీ మళ్లీ హత్య చుట్టూ తిరిగే సీన్స్ బోర్ కొడుతూ ఇబ్బంది పెడతాయి.

క్లియర్ గా చెప్పాలంటే మొదటి భాగం మహానటిలా ఉంటే, రెండో భాగం కిల్లర్ వీరప్పన్ వెబ్ సీరిస్ ఇన్విస్టిగేషన్ లా మారిపోతుంది. ఇక్కడే మనం గందరగోళానికి గురవుతాము.

అలాగే సినిమాలో మెయిన్ కాంప్లిక్ట్ — అద్భుతమైంది… కానీ ఆ కాంప్లిక్ట్స్ కు తగిన మూల కారణం బలంగా చూపించలేదు.

సాధారణంగా మర్డర్ మిస్టరీ లలో — ఎవరు చంపాడన్నది కంటే ఎందుకు చంపాడన్నదే స్ట్రాంగ్ గా ఉండాలి. హత్య చేసిన వ్యక్తి ఎవరో చాలా మంది ఆడియన్స్ ముందే ఊహించేలా ఉంది. కానీ “ఎందుకు చేశాడు?” అనే ఎమోషనల్ రివీల్ మాత్రం కొంతమందికే నచ్చేలా ఉంది.

టెక్నికల్ గా..

టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ – “కాంత”కి అసలు బలం సినిమాటోగ్రఫీ. డానీ సాంచేజ్ లోపేజ్ ప్రతీ ఫ్రేమ్‌ను పెయింటింగ్‌లా తీర్చిదిద్దాడు. పీరియడ్ లుక్, లైటింగ్, కంపోజిషన్ — అన్నీ అత్యుత్తమం. ఎడిటింగ్ విషయానికి వస్తే.. లీవెలీన్ ఆంథోనీ, గోన్సాల్వేజ్ ఇద్దరూ క్లిష్టమైన కథను నీట్ గా కుట్టారు. కథ రెండు టోన్స్ అయినా సీన్స్‌ని స్మూత్‌గా జత చేశారు.

మ్యూజిక్... జేక్ బిజోయ్ BGM సినిమా ఫీల్ ను పూర్తిగా పెంచింది. పాటలు జస్ట్ ఓకే. డ్రామాలో ఎమోషన్, మిస్టరీలో టెన్షన్ — రెండూ బాగా వచ్చాయి. కాస్ట్యూమ్స్ & ఆర్ట్ విషయానికి వస్తే... 1950ల స్టైల్‌కి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్, సెట్స్ డిజైన్ అద్భుతం. కాలానికి అచ్చుగా తగ్గట్లు కనిపించాయి. సౌండ్ డిజైన్ సూపర్బ్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు. అందరూ అద్బుతంగా నటించారు. ఓ రకంగా దుల్కర్, సముద్ర ఖని, రానా పోటీ పడ్డారు.

ఫైనల్ థాట్

చూడటానికి అందంగా, నటన అద్భుతంగా, టెక్నికల్‌గా రిచ్ గా ఉన్న ఈ సినిమా… స్క్రీన్‌ప్లే లోపంతో సాదా సీదాగా మారిపోయింది.

Read More
Next Story