
దసరా బాక్స్ ఆఫీస్
ఏ సినిమా జాక్‌పాట్ కొట్టింది? ఏది ఫ్లాప్ అయింది?
దసరా పండగ వెళ్లిపోయింది. దసరాకు విడుదల అయిన చిత్రాలు కూడా ఫస్ట్ వీకెండ్ కూడా పూర్తి చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో ఏ చిత్రానికి దసరా కలసి వచ్చిందనేది ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
అంతకు ముందు బాగా డల్ గా ఉన్న భాక్సాఫీస్ సెప్టెంబర్ లో ఊపిరి పీల్చుకుంది. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కిందపురి, ఓజి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రప్పించి డిస్ట్రిబ్యూటర్స్ ని ఒడ్డున పడేసింది. మరీ ముఖ్యంగా కంటిన్యూగా థియేటర్లలు మంచి ఆక్యుపెన్సీలు చూసేందుకు ఇవి కలిసొచ్చాయి.
ఇప్పుడు అక్టోబర్ కూడా అదే తరహాలో భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురుస్తూండటంతో బయ్యర్ల ఆనందం అంతా ఇంతా కాదు. దాంతో దసరా ముందు తర్వాత కూడా టాలీవుడ్ ప్రశాంతంగా నిద్రపోగలిగింది.
పవన్ కళ్యాణ్ ఓజీ విషయానికి వస్తే...ఓపినింగ్స్, వీకెండ్ కలెక్షన్స్ రికార్డ్ స్దాయిలో వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ తర్వాత డ్రాప్ అయినా మళ్లీ దసరా ప్రభావంతో పుంజుకున్నాయి. మళ్లీ సెకండ్ వీకెండ్ కు కలెక్షన్స్ అందుకున్నాయి. అలాగే ఓజికి ఏపీలో సాధారణ టికెట్ రేట్లు అందుబాటులోకి రావడంతో రిపీట్ చూడాలనుకున్న ఫ్యాన్స్ తో పాటు రిపీట్ వాచ్ కోసం ఎదురు చూస్తున్నఅభిమానులతో హౌస్ ఫుల్స్ కనిపించాయి. మెయిన్ సెంటర్స్ అన్నింటిలోనూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది.
ఇడ్లీ కొట్టు
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన “ఇడ్లీ కొట్టు” చిత్రం తెలుగులో ఫ్లాప్ అని చెప్పాలి. అక్టోబర్ 1న విడుదలైన ఈ చిత్రానికి తమిళంలో యావరేజ్ టాక్ వచ్చింది. కానీ తెలుగులో నెగెటివ్ కామెంట్స్, రివ్యూస్ వచ్చాయి. ఇక ఈ సినిమాకి చెప్పుకోదగ్గ ఓపెనింగ్ రాలేదు.
“ఇడ్లీ కొట్టు” విడుదలైన రెండో రోజుకే “కాంతర చాప్టర్ 1” విడుదలైంది. “కాంతార” దూకుడు ముందు “ఇడ్లీ కొట్టు” కొద్దిగా కూడా నిలవలేకపోయింది. రెండో రోజు నుంచే జనం ధనుష్ సినిమాని పట్టించుకోవటం మానేశారు. ఓవరాల్ గా కాంతార ప్రభంజనాన్ని ఏపీ తెలంగాణలో ఇడ్లీ కొట్టు ఫేస్ చేయలేకపోయింది. చాలా సెంటర్లలో దీని షోలు తీసి దానికి ఇవ్వాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
“కాంతార చాప్టర్ 1”
ఇక ఈ వీకెండ్ తెలుగు ప్రేక్షకులకు మొదటి ఛాయిస్ గా “కాంతార చాప్టర్ 1” నిలిచింది. ఆ తర్వాత “ఓజి”, “మిరాయి” నిలిచాయి. వీటి తర్వాతే “ఇడ్లీ కొట్టు.” రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతారా: ఛాప్టర్ 1’ ఈరోజు థియేటర్లలో విడుదలై, అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఈ ప్రీక్వెల్‌కు ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ వల్ల బుకింగ్స్ వేగంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమానే వీకెండ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాంతారా భారీ ఆదరణ కారణంగా తమిళనాడుతో పాటు పలు సెంటర్లలో ఇడ్లీ కడై కలెక్షన్లు పడిపోతున్నాయి.
తిరగబడ్డ అంచనా
రిలీజ్ కు ముందు ట్రేడ్ సర్కిల్స్, లాంగ్ వీకెండ్ లలో ఇడ్లీ కడైకు సాఫ్ట్ రన్ ఉంటుందని, ఇది కుటుంబ ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంటుందని అంచనా వేశారు. రెడ్ జైంట్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పెద్ద ఎత్తున స్క్రీన్ కౌంట్ కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడు మాత్రం కాంతారా ప్రభావంతో కొన్ని A సెంటర్లలో మొదటి వీకెండ్ తరువాత రీప్లేస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితిపై ఆన్‌లైన్‌లో చర్చ నడుస్తోంది. దనుష్ గత దర్శకత్వ చిత్రం "నీక్" (NEEK) తెలుగులో "జాబిలమ్మ నీకు అంత కోపమా" కూడా ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించిన ‘డ్రాగన్’ సినిమాతో ఢీకొని, అదే తరహా పరిస్థితి ఎదుర్కొన్నారని సినీ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు అదే చరిత్ర మరోసారి పునరావృతమవుతున్నట్లుగా ఉంది.
అయితే కొందరు తమిళ ట్రేడ్ ట్రాకర్స్ మాత్రం భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రకారం, ఇడ్లీ కొట్టు కుటుంబ కథనం కావడం వల్ల B, C సెంటర్లలో మాత్రం బాగా కనెక్ట్ అవుతుందని, కేవలం A సెంటర్లలోనే కాంతారా హీట్ ప్రభావం ఉంటుందని అంటున్నారు.
మొత్తం మీద, కాంతారా ఛాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి ఊపుమీద నడుస్తుండగా, దనుష్ ‘ఇడ్లీ కడై’ మాత్రం తన స్థానం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాబోయే రోజులు ఈ బాక్స్ ఆఫీస్ పోరాటంలో ఎవరు గెలుస్తారో నిర్ణయిస్తాయి.