
‘కానిస్టేబుల్ కనకం’ రివ్యూ!
రూరల్ థ్రిల్లర్
1998లో శ్రీకాకుళం జిల్లా రేపల్లె అనే చిన్న గ్రామం… అక్కడి పోలీస్ స్టేషన్‌కు కొత్తగా ట్రాన్స్‌ఫర్ అయిన కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి (వర్ష బొల్లమ్మ) అడుగు పెడుతుంది. ఒంటరిగా వచ్చిన ఆమెకు హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు (రాజీవ్ కనకాల) తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. కానీ ఎస్‌ఐ సదాశివం (ప్రేమ్ సాగర్) , కానిస్టేబుల్ సత్తిబాబు (రమణ భార్గవ) మాత్రం కనకం రాకపట్ల అసహనంగా ఉంటారు.
ఇక ఆ ఊరి ప్రెసిడెంట్ ప్రకాశ్ రావు (అవసరాల శ్రీనివాస్) దే అక్కడ రాజ్యం. ఏం చెప్తే అక్కడ అలా. ఆయన ఇప్పుడు ఓ డెసిషన్ తీసుకున్నాడు. అదేమిటంటే.... ఏళ్లుగా ఆగిపోయిన అమ్మవారి జాతర ను మళ్లీ నిర్వహించాలని, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా..వెంటనే ఏర్పాట్లు మొదలవుతాయి. ఇదే సమయంలో ఆ ఊరి మొత్తం భయాందోళనలో పడిపోతుంది—కారణం, అడవిగుట్ట . ఆ గుట్ట వైపు వెళ్లిన వారు తిరిగి రావటం లేదు. ముఖ్యంగా పెళ్లి కాని యువతులు వరుసగా కనిపించటం లేదు. ఇది ఆ ఊరి వాళ్లను కలవరపెడుతుంది.
ఈ అదృశ్యాల మిస్టరీ కొనసాగుతూంటే...ఒకరోజు కనకం స్నేహితురాలు చంద్రిక (మేఘలేఖ) కూడా అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. అంతకుముందు చంద్రికను చివరిసారి కనకంతోనే చూసినట్టు గ్రామస్తులు చెబుతారు. దీంతో ఈ కేసులో కనకం అనుమానితురాలిగా మారుతుంది. ఇప్పుడు కనకం ముందు రెండు పెద్ద ప్రశ్నలు—
1. చంద్రిక ఏమైంది?
2. అడవిగుట్టలో దాగి ఉన్న రహస్యం ఏమిటి?
ఈ మిస్టరీని ఛేదించడానికి కనకం ఎలాంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొందీ? గ్రామంలో జాతర జరగడం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? యువతులు కనిపించకపోవడానికి నిజమైన కారణం ఎవరు? అదే ఈ సిరీస్ హార్ట్ పాయింట్.
* విశ్లేషణ
ఈ సీరిస్ కు బాగా ప్లస్ అయ్యింది ఏమిటి అంటే... Backdrop & Premise. ఓ పల్లె అక్కడ భయాలు, నమ్మకాలు, రాజకీయ ఆధిపత్యం, పోలీస్ వ్యవస్థలో లింగపరమైన ప్రతిఘటన అన్నీ కలసి ఉండే క్లాసిక్ సెట్టింగ్. ఈ ల్యాండ్‌స్కేప్‌ను క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు వేదికగా ఎంచుకోవడం దర్శకుడు ప్రశాంత్ కుమార్‌కు స్ట్రాంగ్ పాయింట్. అడవిగుట్ట అనే స్థానిక ఫోక్‌లార్‌ను ఉపయోగించి మిస్టరీని బిల్డ్ చేయడం, కథనానికి రియలిస్టిక్ టెక్స్చర్ ఇచ్చింది.
కానీ సీరిస్ లో ఎక్కువ క్యారెక్టర్లు ఉండటం వల్ల స్ట్రక్చర్ కొంత డైల్యూట్ అయ్యింది. ఎక్కువ పాత్రలు ఒకేసారి పరిచయం కావడం వల్ల narrative weight dilute అవుతుంది. ప్రేక్షకుడికి అసలు ట్రాక్ ఏదో అర్థం కావడానికి సమయం పడుతుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్,అమేజాన్ లో ఉండే ఇంటర్నేషనల్ థ్రిల్లర్స్‌లో కనిపించే పేసింగ్ ఇక్కడ లేకపోవడం స్పష్టంగా కనపడుతుంది. Screenplay flaws ఉన్నా, సీజన్ 2లో టోన్ & పేసింగ్ కరెక్షన్ చేస్తే ఈ సిరీస్ ఒక benchmark rural crime-thrillerగా మారేది.
అయితే కనక ఇన్వెస్టిగేషన్‌ను నడిపే విధానం ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఒక్కో క్లూ రివీల్ కావడం, అడవిగుట్ట మిస్టరీ వెనక ఉండే మర్మం బలమైన ఉత్కంఠను కలిగిస్తాయి. చివరి రెండు ఎపిసోడ్లలో ట్విస్ట్‌లు మూడ్‌ను ఎలివేట్ చేశాయి. కాకపోతే కథలోని “missing women” ట్రాక్ ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలకు,సీరిస్ గా చిత్రాలకు దగ్గరగా ఉన్నా presentation engagingగా ఉంటుంది. అయితే మిస్సింగ్ యువతుల వెనుక ఉన్న కారణం ఒక సరికొత్త షాకింగ్ truthగా బయటపడటం కలిసొచ్చింది.
* టెక్నికల్ గా ...
అడవిగుట్ట మిస్టరీని ఛేదించే కానిస్టేబుల్ కనకం పాత్రలో వర్షబొల్లమ్మ సహజంగా నటించింది.ఇక చివరి రెండు ఎపిసోడ్స్‌లో ఆమె నటన హైలైట్. కానిస్టేబుల్ కనకానికి అండగా నిలిచే పాత్రలో రాజీవ్ కనకాల ఒదిగిపోయారు. మేఘ లేఖ, అవసరాల శ్రీనివాస్, ప్రేమ్ సాగర్, రమణ భార్గవ్ తమ పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ గానూ సిరీస్ బాగుంది. సురేశ్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాల్లో డెప్త్ ను పెంచింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి.
* చూడచ్చా?
ఫ్యామిలీలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. అసభ్య సన్నివేశాలు, డైలాగులు లేవు.
* ఎక్కడ చూడచ్చు ?
ఈటీవీ విన్ లో తెలుగులో ఉంది. ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కోటీ సుమారు 30 నిమిషాలు