ఇక్కడా బాద్ షానే.. అట్టడుగున ఆమీర్.. మధ్యలో విరాట్.. విషయం ఏంటంటే ?
x

ఇక్కడా బాద్ షానే.. అట్టడుగున ఆమీర్.. మధ్యలో విరాట్.. విషయం ఏంటంటే ?

దేశంలో అత్యధిక పన్ను చెల్లించే సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇళయ దళపతి విజయ్ రెండో స్థానంలో నిలవగా ..


దేశంలో అత్యధిక పన్ను చెల్లించే భారతీయ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలిచారు. 2024-25 కు సంబంధించి అత్యధిక పన్ను షారుక్ చెల్లించాడని ఫార్చ్యూన్ ఇండియా నివేదిక వెల్లడించింది.

అత్యధిక పన్ను చెల్లించే సెలబ్రిటీల టాప్ 10 జాబితాలో అమితాబ్ బచ్చన్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో దళపతి విజయ్ రెండో స్థానంలో ఉన్నారు.
టాప్ 10 జాబితాలో..
ఆర్థిక సంవత్సరంలో షారుక్ ఖాన్ దాదాపు 2 వేల కోట్ల ఆదాయం సంపాదించాడు. ఇందులో సినిమాలు, బాక్సాపీస్ వసూళ్లు, వాణిజ్య ప్రకటనలు, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. అందులో దాదాపు రూ. 92 కోట్లను పన్నుగా చెల్లించాడు. సౌత్ ఇండియన్ బాక్సాపీసును తరుచు షేక్ చేసే ఇళయ దళపతి విజయ్.. ఈ సంవత్సరం దాదాపు రూ. 80 కోట్ల రూపాయలను పన్ను కింద ప్రభుత్వానికి చెల్లించారు.
సినిమాల వారీగా అంతగా రాణించనప్పటికీ, నటుడు సల్మాన్ 75 కోట్ల రూపాయల పన్ను చెల్లించి మూడవ స్థానంలో నిలిచాడు. అతని ప్రొడక్షన్ వెంచర్లు, టెలివిజన్‌లో పని, ఎండార్స్‌మెంట్‌లు అతని ఆదాయాన్ని స్థిరంగా ఉంచడానికి దోహదపడ్డాయని నివేదిక పేర్కొంది.
ఇటీవల రూ. 1000 కోట్ల బ్లాక్‌బస్టర్ చిత్రం కల్కి 2898AD లో అశ్వత్థామగా మెరుపులు మెరిపించిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రూ. 71 కోట్ల పన్ను చెల్లించి జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచారు.
జాబితాలో క్రికెటర్లు
66 కోట్ల పన్ను చెల్లించిన క్రికెటర్ కోహ్లి ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఎంఎస్ ధోని (రూ. 38 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ. 28 కోట్లు) టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్న క్రికెటర్లు. నటులు అజయ్ దేవగన్ (రూ. 42 కోట్లు), రణబీర్ కపూర్ (రూ. 36 కోట్లు), హృతిక్ రోషన్ (రూ. 28 కోట్లు) కూడా సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారుల టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నారు.
కపిల్ శర్మ, పంకక్ త్రిపాఠి..
పెద్ద మొత్తంలో పన్ను విరాళాలు అందించిన ఇతర ప్రముఖులు కామిక్ కపిల్ శర్మ (రూ. 26 కోట్లు); బాలీవుడ్ నటులు కరీనా కపూర్ (రూ. 20 కోట్లు), షాహిద్ కపూర్ (రూ. 14 కోట్లు), కత్రినా కైఫ్ (రూ. 11 కోట్లు); దక్షిణ భారత నటులు మోహన్ లాల్ (రూ. 14 కోట్లు), అల్లు అర్జున్ (రూ. 14) కోట్లు ఈ జాబితాలో ఉన్నారు.
టాప్ 20 జాబితాలో నటీనటులు కియారా అద్వానీ (రూ. 12 కోట్లు), పంకజ్ త్రిపాఠి (రూ. 11 కోట్లు) ఉన్నారు. నటుడు అమీర్ ఖాన్ 10 కోట్ల రూపాయల పన్నుతో 21వ స్థానంలో నిలిచారు.


Read More
Next Story