మరో మైలురాయిని దాటిని ‘కల్కి2898 ఏడీ’
x

మరో మైలురాయిని దాటిని ‘కల్కి2898 ఏడీ’

బాక్సాపీస్ వద్ద ప్రభాస్ ప్రభంజనం కొనసాగుతోంది. పురాణాలు, సైన్స్ ఫిక్షన్ ను జోడించి తీసిన కల్కి 2898 ఏడీ వెయ్యి కోట్ల మార్క్ ను దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్థ..


బాక్సాపీస్ వద్ద ‘కల్కి’ జోరు కొనసాగుతోంది. తాజాగా ఆ సినిమా రూ. 1000 గ్రాస్ వసూళ్లను దాటినట్లు ప్రకటించింది. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇండియాతో పాటు ఓవర్ సీస్ లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఇప్పట్లో నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు. వైజయంతీ మూవీస్ ప్రకారం.. కొన్ని నెలల తరువాత ఇండియన్ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా ఇదే.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణే ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా, జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో విడుదలైంది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఉత్తరాది, ఓవర్ సీస్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. శనివారం, మేకర్స్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో "ఎపిక్ మహా బ్లాక్‌బస్టర్ 1000 కోట్ల +"తో కూడిన పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. సినిమా భారీ విజయానికి కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
మైక్రోబ్లాగింగ్ సైట్‌లో నిర్మాణ సంస్థ ఇలా రాసుకొచ్చింది.. "1000 కోట్ల వసూళ్లు సాధించి ముందుకు దూసుకుపోతోంది. మా చిత్రం పై మీరు హృదయపూర్వకంగా ప్రేమ చూపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు." గతంలో, షారుఖ్ ఖాన్ నటించిన "పఠాన్", "జవాన్", SS రాజమౌళి "RRR", "బాహుబలి: ది కన్‌క్లూజన్", అమీర్ ఖాన్ నటించిన "దంగల్", యష్ నటించిన "KGF: చాప్టర్ 2" ఈ వసూళ్లు రాబట్టాయి. ఇవన్నీ కూడా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్ల మార్క్ ను అందుకున్నాయి. ఇప్పుడు వీటి సరసన కల్కి కూడా చేరింది. లాస్ ఏంజిల్స్ జరిగే ప్రఖ్యాత సిని షోలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ పాల్గొనబోతున్నారని, అలాగే తరువాత విలేకరులతో సమావేశం ఉంటుందని వెల్లడించింది.
ఈ సినిమా దేశంలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. దీనికోసం రూ. 600 కోట్లు ఖర్చు చేసినట్లు నిర్మాత అశ్వనీదత్ వెల్లడించారు. "కల్కి 2898 AD"లో దిశా పటాని, శాశ్వత చటర్జీ, శోభన కూడా నటించారు. గతంలో "ప్రాజెక్ట్ కె పేరుతో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
Read More
Next Story