హనీరోజ్ లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి జ్యూడిషియల్ కస్టడి
వేధింపుల వెనక ఉన్న ప్రముఖ బిజినెస్ మేన్ బాబీ చెమ్మనూర్
గత కొంతకాలంగా మల్లువుడ్ కథానాయిక హనీరోజ్ ను సోషల్ మీడియా వేదిక వేధిస్తున్న ప్రముఖ బిజినెస్ మేన్ బాబీ చెమ్మానూర్ కు పోలీసులు అరెస్ట్ చేయగా, ఆయన కొచ్చి కోర్టు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. తనను అసభ్యకరంగా కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసుకుని వేధిస్తున్నారని కేరళ సీఎం పినరయ్ విజయన్ దృష్టికి తీసుకెళ్లగా, దానిపై ఆయన ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు బిజినెస్ మేన్ బాబీ ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ రోజు సాయంత్రం ఆయనను ఎర్నాకులం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ -2 ముందు హజరుపరిచారు.
ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, డిఫెన్ లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో కీలక ఆధారాలు ధ్వంసం చేసేందుకు యత్నిస్తారని, అలాగే అతను చేసిన నేరం సామాన్యమైందని కాదని వాదించింది. దీనితో కోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.
14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
వాదనలు విన్న తరువాత నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఆయనపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 75(4) కింద కేసు నమోదు చేసింది. ఇది మహిళలను లైంగికంగా వేధించడం, దుర్భాషలు ఆడటంతో పాటు ఐటీ ఆక్ట్ లోని సెక్షన్ 67 ను ఉపయోగించింది. ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా పబ్లిక్ డొమైన్ లో కేసులు పెట్టడం, వారిని కించపరచడం వంటివి ఇందులో ఉన్నాయి.
Next Story