మాలేగావ్ పేలుళ్ల పై సినిమా
x

'మాలేగావ్ పేలుళ్ల' పై సినిమా

సినిమా విడుదల స్టే ఇవ్వం, జడ్జి లు సినిమాలు చూసి ప్రభావితం అవ్వరని తేల్చేసిన కోర్టు... వివరాలు

“ భారత న్యాయవ్యవస్థలోని ఒక న్యాయమూర్తి సినిమా చూసి ప్రభావితమై సాక్ష్యాలను మర్చిపోతారని మీరు నిజంగా భావిస్తున్నారా? అని ప్రశ్నించింది కోర్టు. 2008 నాటి మాలేగావ్ పేలుళ్ల కేసును స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన మ్యాచ్‌ఫిక్సింగ్-ది నేషన్ ఈజ్ ఎట్ స్టేక్ (Matchfixing- The Nation is at Stake) సినిమా విడుదలపై స్టే ఇవ్వవిధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది .

మాలేగావ్ పేలుడు , తదనంతర సంఘటనల చిత్రీకరణను ఈ కేసులో నిందితులలో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సవాలు చేశారు, ఇది తన ప్రతిష్ట మరియు కెరీర్‌కు హాని కలిగించవచ్చని వాదించారు. అయితే జస్టిస్ బీపీ కొలబవల్లా , జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్‌లతో కూడిన ధర్మాసనం పురోహిత్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సినిమా ముందుగా అనుకున్న ప్రకారం( నవంబర్ 15న) విడుదల అవటానికి దారి ఏర్పడింది.

ఈ సినిమా ట్రైలర్‌లు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని, ఆర్మీ ఆఫీసర్‌గా పురోహిత్ ప్రతిష్టను అన్యాయంగా దెబ్బతీసేలా ఉన్నాయని అతని లాయర్లు హరీష్ పాండ్య మరియు ధృతిమాన్ జోషి అన్నారు. సినిమా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగలదని, కొనసాగుతున్న విచారణలో జోక్యం చేసుకునే అవకాశం ఉన్నందున అదే పరిమితులు సినిమాకు వర్తింపజేయాలని వారు వాదించారు. అయితే సినిమా అనేది... కేసు విచారణ పై ఎటువంటి ప్రభావం చూప‌ద‌ని బెంచ్ స్ప‌ష్టం చేసింది.

ఈ చిత్రం కల్పితమని, ఇప్పటికే అందుబాటులో ఉన్న పుస్తకం ఆధారంగా రూపొందించామని చిత్ర నిర్మాతలు కౌంటర్ వాదన వినిపించారు.. ఈ చిత్రం 'ది గేమ్ బిహైండ్ సాఫ్రాన్ టెర్రర్' అనే కల్పిత పుస్తకం ఆధారంగా రూపొందించబడిందని చెప్పారు. అలాగే ఇదే విషయం చెప్తూ సినిమా ప్రారంభంలో ఆడియో డిస్‌క్లైమర్‌ను జోడించడానికి అంగీకరించారు, ఈ చిత్రం జీవించి ఉన్న లేదా చనిపోయిన నిజమైన వ్యక్తితో ఏ విధమైన పోలికను కలిగి ఉండదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో కల్పిత సినిమాతో న్యాయమూర్తులు ప్రభావితం అవుతారనే పురోహిత్ ఆందోళనను కోర్టు ప్రశ్నించింది. ‘‘ఒక జడ్జి సాక్ష్యం మర్చిపోయి సినిమా చూసి ప్రభావితుడవుతాడని అంటున్నావా? ,సినిమాకు ఆధారమైన పుస్తకం సంవత్సరాలుగా ఎటువంటి సమస్య లేకుండా పబ్లిక్‌గా అందుబాటులో ఉందని పేర్కొంది. " పిటిషనర్ యొక్క భయాందోళనకు సరైన ఆధారాలు ఉన్నాయని మేము భావించడం లేదు ," అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే పురోహిత్ తరపు న్యాయవాది ధృతిమాన్ జోషి, సినిమా ప్రమోషన్ మెటీరియల్ లో సినిమా కల్పితమేనని స్పష్టం చేయాలని కోర్టును కోరారు. అయితే, ఈ సూచనను కోర్టు తోసిపుచ్చింది.

ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలోని నార్త్ మహారాష్ట్ర టౌన్ అయిన మాలేగావ్‌లో 2008 సెప్టెంబర్ 20న బాంబు పేలుడు ఘటన జరిగింది. మసీదుకు సమీపంలోని మోటార్ వాహనానికి అమర్చిన బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుడుకు కుట్రపన్నారనే ఆరోపణపై ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, మరో ఐదుగురు విచారణను ఎదుర్కొంటున్నారు.

తొలుత ఈ ఘటనపై మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ విచారణ జరపగా, ఆ తదనంతరం 2011లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి బదిలీ చేశారు. ఈ మాలేగావ్ పేలుడు కేసు ప్రస్తుతం తుది వాదన దశలో ఉంది. ఈ కేసుకు సంబంధించి సైనికాధికారిగా పురోహిత్‌కు సంబంధాలు ఉన్నట్టు వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

Read More
Next Story