
బ్లేమ్ గేమ్ మొదలయ్యింది. "గేమ్ ఛేంజర్"
హిట్టైతే నాది, ఫ్లాపైతే వారిదా?
"ఫెయిల్యూర్ అంటే అందరికీ భయం. కానీ కొన్ని ఫెయిల్యూర్స్ మాత్రం వ్యక్తిత్వాలను నిప్పులా పరీక్షిస్తాయి. గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పుడు అదే పనిచేస్తుంది."
450 కోట్ల బడ్జెట్, శంకర్ అనే విజన్‌రీ డైరెక్టర్, రామ్ చరణ్ అనే పాన్ ఇండియా స్టార్ — కానీ, ఆ కలల ప్రాజెక్టు ‘గేమ్ ఛేంజర్’ చివరికి ఒక పీడకలలా మారింది. సంక్రాంతి రిలీజ్ అంటే అది సంబరంగా మారాల్సింది. కానీ, విడుదలైన మొదటి షో నుండి నెగిటివ్ టాక్ రావడం, బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవడం — ఎప్పటికీ మెగాభిమానుల గుండెల్లో పైకి కనపడని మంటే. కానీ ఇప్పుడు మంట రేగింది వేరే వైపు నుంచి, ఈ ఫెయిల్యూర్ కు ఎవరు బాధ్యత తీసుకోవాలి?
అసలు షాకింగ్ ట్విస్ట్ సినిమాలో కాదు — సినిమా తర్వాత దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చేసిన వ్యాఖ్యలలో ఉంది!
గేమ్ చేంజర్ మూవీని డైరెక్ట్ చేసేది శంకర్ అని అందరికీ తెలిసిందే. కానీ ఈ భారీ చిత్రానికి కథను అందించింది మాత్రం..డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అని.. చాలా తక్కువ మందికి తెలుసు. గేమ్ ఛేంజర్‌కు కథ ఇచ్చానని కార్తీక్ సుబ్బరాజ్ గతంలో గర్వంతో చెప్పాడు. కానీ సినిమా గల్లంత అవ్వగానే... "నాది వన్ లైనర్ మాత్రమే. స్క్రిప్ట్ వేరే వాళ్లది" అని మాట్లాడటం మొదలు పెట్టాడు! అసలేం జరిగింది..కార్తీక్ సుబ్బరాజ్ ఏమన్నాడు?
ఫెయిల్యూర్ అంటే అందరికీ భయమే. దానికి అందరూ దూరంగా ఉంటారు. ఇప్పుడు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కూడా అదే చేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అవడంతో ...ఆ సినిమా కథా రచయితగా తను కేవలం నామ మాత్రమే అని తేల్చేశాడు. రిలీజ్ కు ముందు ఈ సినిమాకు కథ ఇవ్వడం అదృష్టం అన్నట్లు చెప్పిన ఈయన తర్వాత పూర్తిగా స్వరం మార్చేసారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan), స్టార్ దర్శకుడు శంకర్(Shankar)..ల ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)సినిమా భారీ అంచనాల నడుమ ఈ ఏడాది జనవరి 10న రిలీజ్ అయింది. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు 50వ మైలురాయి చిత్రం కావాల్సి ఉంది. బదులుగా, అది ఒక పీడకల గా మారింది. ఈ చిత్రం భారీ నష్టాలను చవిచూసింది. సంక్రాంతికి ప్రీమియర్ ప్రదర్శించినప్పటి నుండి ప్రేక్షకుల నుండి పూర్తిగా నెగిటివిటి ఎదుర్కొంది.
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. ఓపెనింగ్స్ కొంత వరకు పర్వాలేదు అనిపించినా, సంక్రాంతి సెలవులు కూడా కొంత వరకు క్యాష్ చేసుకున్నా.. ఆ తర్వాత మాత్రం డౌన్ అయిపోయింది.దీంతో అనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వకపోవడం వల్ల డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోయింది ఈ సినిమా.
అప్పుడు... అదో మరిచిపోలేని జ్ఞాపకం
సినిమా విడుదలకు ముందు, శంకర్ దర్శకుడితో అనుబంధం ఉన్నందుకు కార్తీక్ గర్వంగా ఉందని చెప్పాడు. " ‘గేమ్ ఛేంజర్’ స్టోరీ రాశాగానీ అది పక్కా శంకర్ విజన్‌తో రూపొందింది. నా కథను ఆయన తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుందన్న దానికి ఆ సినిమా నిదర్శనం. ఆయన చిత్రాల ప్రభావంతోనే నేను దర్శకుడిగా మారా. నా కథతో శంకర్ మూవీ తీయడం ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం. " అని అతను చెప్పాడు.
అలాగే ఒక ఇంటర్వూలోకార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ..తన కెరీర్ లోనే మొదటి పొలిటికల్ స్టోరీ గేమ్ చేంజర్. ఆ కథ ను పూర్తి చేసిన తర్వాత..నా బెస్ట్ ఫ్రెండ్స్కు వినిపించాను. అది విన్న ప్రతి ఒక్కరికి కథ చాలా బాగా నచ్చింది. మెయిన్గా పెద్ద సినిమాల శంకర్ స్థాయిలో ఈ స్టోరీ ఉంది. ఈ సినిమా చాలా పెద్దగా చేయవచ్చని ఫ్రెండ్స్ సలహా ఇచ్చారని తెలిపారు.
నేను కథను స్టార్ట్ చేసినప్పుడు భారీ స్థాయిలో మెసేజ్ ఉండి..దానికి తోడు పొలిటికల్ టచ్ ఉండాలని రాసుకున్నాను. కానీ తీరా స్టోరీ పూర్తయ్యాకే తెలిసింది. ఇంత పెద్ద పొలిటికల్ మూవీని తీసే అనుభవం..ఆ స్థాయి నాకు లేదని. అందుకే ఈ స్టోరీని శంకర్ సర్కి వినిపించాను. అప్పుడు ఆయన స్టోరీ చెప్పగానే ఇంప్రెస్ అయ్యే..సినిమా తెరకెక్కించాలని కూడా సిద్ధం అయ్యారని కార్తీక్ ఇంటర్వ్యూలో వివరించాడు.
రామ్ చరణ్ వంటి స్టార్ హీరోతో ఈ సినిమాను రూపొందించడం వల్ల..ఈ సినిమా స్థాయి మరింత పెరిగిందని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెలియజేశారు. గేమ్ ఛేంజర్ సినిమా తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరిస్తుందని అన్నారు.
కానీ సినిమా విడుదలైన తర్వాత, దానికి వచ్చిన నెగిటివ్ రిపోర్టులు తర్వాత, అతని స్వరం గమనించదగ్గ విధంగా మారిపోయింది.
ఇప్పుడు..మరిచిపోవాలనుకుంటున్న జ్ఞాపకం
కార్తీక్ సుబ్బరాజ్ తన సొంత చిత్రం రెట్రో ను ప్రమోట్ చేస్తూ తన తాజా ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు, "నేను మొదట్లో శంకర్ సర్‌కి ఒక గ్రౌన్డడ్ IAS ఆఫీసర్ గురించి వన్-లైన్ కథను అందించాను. తర్వాత, అది పూర్తిగా భిన్నమైన ప్రపంచంగా మారిపోయింది. చాలా మంది రచయితలు చేరి, కథ, స్క్రీన్‌ప్లే మార్చేసారు." అన్నారు.
కాస్తంత మర్యాదగా చెప్పాలంటే, కార్తీక్ గేమ్ ఛేంజర్ రిజల్ట్ నుండి మర్యాదపూర్వకంగా చేతులు కడుక్కొన్నాడు. శంకర్ తన ఇష్టాయిష్టాలు మరియు అభిరుచులకు అనుగుణంగా సినిమాను పూర్తిగా నాశనం చేశాడని అతను సూచించి షాక్ ఇచ్చాడు.
ఇది గేమ్ ఛేంజర్ కాదు… blame షిప్ట్ చేసిన shame ఛేంజర్!
ఈ కామెంట్ చూసిన కార్తీక్ అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. "మూవీ బాగాలేదని పోతే, తల దించుకుని నెత్తిన బరువు మోస్తారనుకున్నాం. కానీ కార్తీక్ గారు... నైస్ చేతులు కడుక్కున్నారు!". “గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవ్వడం కన్నా, దీనికి కథ ఇచ్చానని చెప్పినవాడు తర్వాత మాట మార్చడం బాధాకరం!” అని మరికొందరు అంటున్నారు.
పబ్లిక్ మాత్రం సూటిగా అడుగుతోంది:
"ఒకవేళ సినిమా హిట్ అయ్యుంటే... అదే కార్తీక్ ఊహించిన విజన్ అంటాడేమో?"
అయితే అదే సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు మొదలవుతుంది. ఒక కథ ఎవరికైతే పుట్టిందో… అది చివరి వరకూ తమ సిగ్నేచర్ వాయిస్‌తో ఉండకపోతే, ఫెయిల్యూర్ entire blame ఎవరి మీద పడుతుంది?
ఇక కార్తీక్ సుబ్బరాజ్( Karthiksubbaraj) మూవీస్ చూస్తే..పిజ్జా, జగమే తంత్రం, మహాన్, పెట్టా, జిగర్తాండ, ఇప్పుడు జిగర్ తండా డబుల్ X. ఇప్పుడు రెట్రో. ఈ మూవీని చూసిన ఇట్టే అర్థమవుతుంది..కార్తీక్ సుబ్బరాజ్ ఎంత విలక్షణమైన డైరెక్టర్ అనేది. అయితే అతని స్థాయికి తగ్గ కామెంట్ అయితే మాత్రం కాదు. ఇలా మాట్లాడి ఉండాల్సింది మాత్రం కాదు.