విడిపోయిన దారులు, కారణం ఏమిటి?
x

విడిపోయిన దారులు, కారణం ఏమిటి?

బాలయ్య బాబు – పూరి జగన్నాథ్

తెలుగు సినిమా మాసుల మేళవింపు అది. ఓ వైపు "సింహ గర్జన"తో స్క్రీన్‌ను చీల్చే బాలయ్య బాబు… మరోవైపు "డైలాగ్స్ "తో మాస్‌ని రెచ్చగొట్టే పూరి జగన్నాథ్. ఈ ఇద్దరి కలయిక అంటే ఫ్యాన్స్‌కు ఫెస్టివల్!

పైసా వసూల్ టైమ్‌లో వీళ్లు కలిసినప్పుడు మాస్ మానియా… యాక్షన్ ఫైర్! సినిమా బ్లాక్ బస్టర్ కాలేదు గానీ, బాలయ్యలో ఓ "బ్యాడ్ బోయ్ ఎనర్జీ"ని చూపించింది అనేది మాత్రం నిజం. అప్పట్లో అందరూ– “ఇదే కాంబో మళ్లీ రిపీట్ అవుతుంది”… “బాలయ్య పిలుస్తాడు… పూరి వస్తాడు”… అంటూ ఊహించారు. కానీ ఊహలు ఊసులు గానే మిగిలిపోయాయి.

ఇప్పుడు బాలయ్య సక్సెస్ స్పీడో మీటర్ మీద వేగంగా దూసుకెళ్తుంటే… పూరి ప్లాపుల బరువుతో తడబడుతున్నాడు. ఈ టైమ్ లో బాలయ్య పిలిచి పూరి కి సినిమా ఇస్తాడు అనుకోవడం అత్యాశే అయినా, ఫ్యాన్స్ అవసరమైన సినిమా అనిపించింది. కానీ ఆ కిక్ ని బాలయ్య కోరుకోలేదు. పూరికి పిలుపు రాలేదు...అందుకు కారణం ఏమిటి..

పూరీకి ప్లాప్ వరుస – బాలయ్యకు సక్సెస్ ల వరుస

పూరి జగన్నాథ్ గత కొన్ని సంవత్సరాల్లో మెహబూబా, లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలతో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నారు. ఆయన మాస్ మేకింగ్ స్టైల్ ఇప్పుడు విసిగించే స్థాయికి చేరిందని విమర్శకులు చెబుతున్నారు. మాస్ యాక్షన్‌ కథలలో ఎమోషన్ మిస్ అవుతుండటం, ఆ కథలలో డెప్త్ లేకపోవడం ప్రధాన సమస్యలుగా మారాయి.

అయితే ఇదే సమయంలో బాలకృష్ణ మాత్రం అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి వరుస విజయాలతో తన కెరీర్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్తూ దూసుకుపోతున్నారు. ప్రతీ సినిమాతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ, జాగ్రత్తగా దర్శకులను ఎంపిక చేస్తున్నాడు.

పూరి ని ఎందుకు తప్పించారు?

వాస్తవానికి బాలయ్య బాబు ఎవరితోనైనా పర్సనల్ రిలేషన్‌ని ఎక్కువగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు ఆయన కమర్షియల్ విజయం మీద పూర్తిగా ఫోకస్ చేశారంటున్నారు. పూరీ దర్శకత్వంలో మళ్లీ సినిమా చేస్తే – అది ఫలితం ఇవ్వకపోతే – ఇప్పటి ఇమేజ్‌కి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే పూరిని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు మీడియాలో చెప్పుకుంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదు. బాలయ్య డేట్స్ రాబోయే రెండేళ్ల దాకా ఖాలీ లేవు. వరస ప్రాజెక్టులు ఉన్నాయి..అందుకే పూరి తో ప్రస్తుతం చేయలేదంటున్నారు. ఏది నిజమనేది ఇద్దరిలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి చెప్తేనే తెలుస్తోంది.

పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి తో Beggar అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ మీద వర్క్ చేస్తున్నాడు. ఇది కూడా పూరి తన మాస్ ఫార్ములాను వదిలి, కొత్త పంథాలోకి వస్తున్న సంకేతంగా చూడవచ్చు.

బాలయ్య – దిశా స్పష్టంగా ఉంది

బాలయ్య ఇప్పుడు అనుకున్న డైరెక్టర్‌లు, సబ్జెక్ట్‌లు, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నింటినీ ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అఖండ 2 అంటే ఏ విధమైన హైప్ ఉంటుందో, ఆ అంచనాలను మించి ప్రెజెంట్ చేయాలన్న నమ్మకంతో టీమ్ పని చేస్తుంది. బాలయ్య ఈ ఫేజ్‌లో రిస్క్ తీసుకోకుండా, తన బ్రాండ్ విలువను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.

ఫైనల్ గా

పూరీ జగన్నాథ్‌కి మరోసారి గ్రాండ్‌గా రీ ఎంట్రీ రావాలంటే, ఒక కంటెంట్ బేస్డ్, ఫ్రెష్ టేక్ అవసరం. బాలయ్య బాబు మాత్రం, ప్రస్తుతం కెరీర్‌లో సెకండ్ గోల్డెన్ ఫేజ్ అనిపించే స్థాయిలో నిలబడ్డారు. ఈ దశలో పూరీతో మరో ప్రయోగం చేయడం కన్నా, టాప్ డైరెక్టర్లతో పంథా మార్చే ప్రయోగాలకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంలో పొరపాటు ఏమీ లేదు.

Read More
Next Story