
'అవతార్ 3' బజ్ జీరో ఎందుకని?
అభిమానుల్లో టెన్షన్!
2009లో వచ్చిన ‘అవతార్’ సినిమా ప్రపంచ బాక్సాఫీస్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. అప్పటి వరకు ఎవరు చూడని విజువల్స్, భారీ కలెక్షన్లు—అన్ని రికార్డులు బద్దలైపోయాయి. ఆ అద్భుత విజయంతో జేమ్స్ కామెరూన్‌కి నమ్మకం వచ్చింది. ఆ వెంటనే ఫ్రాంచైజీకి ఇంకో నాలుగు సినిమాలు ప్లాన్ చేశాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు అవతార్ 3 వస్తోంది. కానీ ఆ హైప్ ఎక్కడా కనిపించటం లేదు.
Avatar 3 — హైప్ ఏమైంది?
డిసెంబర్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ‘Fire and Ash’ పై స్పందన ఎంతో నీరసం. మొదటి భాగం, రెండో భాగం వచ్చినప్పుడు భారీ బజ్, సోషల్ మీడియా శబ్దం— ఇప్పుడు మూడో భాగానికి ఆ హైప్ దాదాపు కనిపించట్లేదు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ రిలీజ్ అనౌన్స్ అయ్యింది… కానీ ప్రచారం… ఉత్సాహం… సౌండ్ — ఏమీ లేవు!
ఇండియాలోనూ ఇదే పరిస్థితి
డిసెంబర్ 19 స్పెషల్‌గా అవతార్ కోసం థియేటర్స్ ఖాళీగా అయితే పెట్టారు. ఆ తేదీకి పెద్ద తెలుగు రిలీజ్ ఏదీ పెట్టలేదు. కానీ ప్రత్యేకంగా ఆ సినిమా కోసం వెయిటింగ్ అయితే కనిపించటం లేదు.
ట్రేడ్ అంటోంది
మిగతా సినిమాలు వేటికి ఈసారిల అవతార్ భయం లేదు. అందుకు కారణం Avatar 3 పై బజ్ పెద్దగా లేదు. ఇండియన్ బాక్సాఫీస్ పై తీవ్ర ప్రభావం ఉంటుందని ఎవరు భయపడట్లేదు. కాబట్టి డిసెంబర్ 19న అవతార్ తో పాటు మరో రెండు తెలుగు సినిమాలు రిలీజ్ చేస్తే బెస్ట్ ఇది ట్రేడ్ మాట. ” చాలా మంది ఫిల్మ్ లవర్స్ అభిప్రాయం కూడా ఇదే.
అవతార్ 3కు ఉన్న సీన్:
అద్బుతమైన టాక్ వస్తే ...థియేటర్స్ పెంచుదాం.
టాక్ యావరేజ్ అయితే పట్టించుకోవాల్సిన పనిలేదు.
ప్రత్యేకంగా తెలుగు స్టేట్స్‌లో, మొదటి రెండు పార్ట్‌ల లెవల్ ఇంపాక్ట్ రావడం ఖచ్చితంగా డౌటే.
హైప్ ఎందుకు ఇలా పడిపోయిందో షాకింగ్ కారణాలు!
2009లో వచ్చిన అవతార్ ప్రపంచ సినిమా చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్. అది సినిమా మాత్రమే కాదు—అది ఒక కల్చరల్ ఫెనామెనన్.
ప్రపంచ బాక్సాఫీస్‌ని అసలు ఊహించని స్థాయిలో కుదిపేసింది. అదే పవర్‌తో జేమ్స్ కామెరూన్ ఇంకా నాలుగు సినిమాలు ప్లాన్ చేశాడు.
కానీ మొదటి సీక్వెల్ Avatar: The Way of Water ఆ అంచనాలు చేరుకోలేదు. వసూళ్లు వచ్చాయి—కానీ ప్రేక్షకుల ఫీలింగ్ మాత్రం:
“విజువల్స్ గొప్ప, కానీ కథ ఎక్కడ?”
ఇది ఇప్పుడు డైరెక్ట్‌గా Avatar 3 Fire and Ash హైప్ మీద ప్రభావం చూపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా హైప్ ఎందుకు తగ్గింది?
అవతార్ 3 డిసెంబర్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. కాని ప్రతీ చోట ఒకే మాట వినిపిస్తోంది: “ఈసారి ఎలాంటి ఎక్సైట్మెంట్ కనిపించట్లేదు!”
మొదటి రెండు పార్ట్స్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన సౌండ్, విశేషాలు, వీడియోలు— ఇప్పుడు మూడో భాగానికి దాదాపు జీరో. ఎదురుచూస్తున్న వాళ్లు లేరనికాదు… కానీ ఆతురత, మాస్ క్రేజ్, సోషల్ వైరలిటీ — ఇవి కనిపించడం లేదు.
⭐ ఎందుకు హైప్ రాలేదు?
అవతార్ 3 ప్రమోషన్స్ చూస్తూంటే ఎటువంటి కొత్తదనం కనిపించటం లేదు. ఎందుకని అలా అంటే.. 2009 నాటికి పాండోరా వరల్డ్, 3D, IMAX—అవి కొత్త ప్రపంచం.
ఇప్పుడు?
RRR, Bahubali, KGF2, Kalki,కాంతారా ఇలా మన ఇండియన్ సినిమాలు కూడా విజువల్ రేంజ్లో బుల్లెట్‌లా దూసుకెళ్తున్నాయి.
ప్రేక్షకుడు అనుకుంటున్నాడు: “మళ్లీ అదే పాండోరా? ఏం కొత్త ఉంది?”
అవతార్ 2 కంటెంట్ ఫెయిల్ ఇంపాక్ట్ బాగా ఉంది. Way of Water వల్ల వచ్చిన ఫీల్: స్లో నేరేషన్, స్టోరీ వీక్, ఎమోషనల్ కనెక్ట్ లేదు. వసూళ్లు హైప్‌తో వచ్చాయి; కంటెంట్ మాత్రం చాలామంది ఫ్యాన్స్‌ను ఉత్సాహం లేకుండా చేసింది. అది ఇప్పుడు Avatar 3కు అదే సీన్ రివర్స్ అయ్యి ఆ ఎఫెక్ట్ కనపడుతోంది.
మార్కెటింగ్ సైలెంట్
Avatar 3 ట్రైలర్, ప్రమోషన్స్ లో స్పీడు లేదు, బిగ్ బ్యాంగ్‌గా కాలేదు. ఇప్పుడు ప్రేక్షకుడుకి పెద్ద సౌండ్, పెద్ద వైరల్ మూమెంట్ కావాలి.
అది కనిపించలేదు.
మాస్ అంశం తక్కువ
ఇప్పటి సినీ ప్రేక్షకుడు కావాల్సిన ఫీల్ ఇదీ: “సీటు నుంచి లేవకుండా కూర్చోబెట్టింది!” “పవర్! రష్!”. కానీ అవతార్ సినిమాలు పోయెటిక్, స్లో, విజువల్. మాస్ డ్రామా, బిల్డ్ అప్ తక్కువ. అంటే మారిన సాధారణ ప్రేక్షకుడు కనెక్ట్ మైనస్.
కథ ఏంటో ఎవరికీ క్లారిటీ లేదు
అవతార్ 1లో కథ సులభం. అవతార్ 2లో ఇది డైల్యూట్ అయింది.
అవతార్ 3లో: స్టోరీ ఏం టో ఎవరికీ తెలీదు, ఎమోషన్ ఎక్కడో తెలియదు, కథ క్లూ లేకపోతే హైప్ రాదు.
అందుకే Avatar 3కి “Fire” ఇప్పటికైతే కనిపించడం లేదు
హైప్ = చాలా సైలెంట్
ఇండియా మార్కెట్ = అనుమానంతో చూస్తోంది
19న తెలుగు రిలీజ్ పెట్టినా పెద్ద రిస్క్ ఉండదు అంటోంది ట్రేడ్.
అయినా… కామెరూన్ ఎప్పుడూ అండర్‌ఎస్టిమేట్ చేయరాదు. సినిమా అద్భుతం అయితే Word of Mouth అగ్నిలా పాకుతుంది. అందుకే ఈసారి అవతార్ హైప్‌తో కాదు—టాక్‌తో నడవాల్సి ఉంటుంది.
ఇప్పుడు అందరి మనస్సులో మెదిలే ప్రశ్న ఒక్కటే…
పాండోరా మళ్లీ ప్రపంచాన్ని ఫైర్ లో ముంచేస్తుందా? లేక ‘Fire and Ash’లో అసలు మంటే కనిపించదా?
సామాన్య ప్రేక్షకుడు అయితే అవతార్ 3 నిజంగా పాండోరా మాజిక్ మళ్లీ చూపిస్తుందా? అలాగే కామెరూన్ ఈసారి ఆశ్చర్యపరుస్తాడా? అనే ఆలోచనలో ఉన్నాడు.
ఎవ్వరికీ క్లారిటీ లేదు.
డిసెంబర్ 19 — సమాధానం!

