
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' రివ్యూ
ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది, కథేంటి, వర్కవుట్ అయ్యే కంటెంట్ ఉందా, రివ్యూలో చూద్దాం.
"కొన్ని కాంబినేషన్స్ జనాలను థియేటర్లకి లాక్కొస్తాయి. అవి ఒక్కసారిగా క్రేజ్ క్రియేట్ చేస్తాయి!" అలాంటి రేర్ కాంబినేషన్‌నే ఈసారి మనకు చూపించింది ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఒకవైపు లేడీ అమితాబ్ విజయశాంతి, మరోవైపు మాస్, మేనరిజం కలిపిన యాక్టర్ కళ్యాణ్ రామ్. ఈ ఇద్దరి కాంబో ఓ పక్క ఇంటెన్సిటీని, మరో పక్క ఎమోషన్‌ని ప్రామిస్ చేస్తూ ఈ సినిమా థియేటర్ లో దిగింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది, కథేంటి, వర్కవుట్ అయ్యే కంటెంట్ ఉందా, రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
విశాఖపట్నం అండర్‌వర్డ్‌లో పెద్ద పేరు అర్జున్ (కళ్యాణ్ రామ్). అర్జున్ తల్లి ఎవరో తెలుసా? లెజెండరీ ఐపీఎస్ ఆఫీసర్ వైజయంతి (విజయశాంతి). తాను నమ్మిన
న్యాయం కోసం ఎంతకైనా తెగించి ముందుకు వెళ్లే టైపు. కానీ ఈ ఇద్దరూ ఇప్పుడు – రెండు గడియారాల ముల్లుల లాంటివాళ్లు.
ఒకరి నీడ ఇంకొకరికి దరిచేరదు.
కాని అర్జున్ కు తల్లి విపరీతమైన ఇష్టం కానీ, ఆమె అతనిపై ఒక రకమైన అసహ్యంతో దూరంగా ఉంటుంది. అందుకు కారణం ఏమిటి, తల్లిలాగ ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ ఎందుకు గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఎందుకు తల్లి,కొడుకులు దూరం అయ్యారు, అసలు వీరి దూరానికి కారణమైన వ్యక్తి ఎవరు,
ఇక వైజయంతీకి పఠాన్ (సోహైల్ ఖాన్) అనే ముంబై గ్యాంగ్ స్టర్ నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. దాన్నుంచి తల్లిని అర్జున్ ఎలా కాపాడుకొన్నాడు? అసలు వైజయంతీకి, పఠాన్‌కీ ఉన్న వైరం ఏమిటి? ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కడుపున క్రిమినల్ ఎలా పుట్టాడు? చివరకు తల్లిని కలిసాడా, వంటి విషయాలు తెలియాలంటే, సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
ఎనాలసిస్
ఇది ఎన్నిసార్లు తెరపై చూసిన కథే. అయితే ఇదే కథను ..కొత్త స్క్రీన్ ప్లేతో కొత్త సీన్స్ తో ప్రజెంట్ చేసేవారు ఉంటారు. కానీ దర్శకుడు పాత సీన్స్ ని అంతే పాతగా ప్రెజెంట్ చేసారు. Inner vs Outer Conflict ని కథలో తీసుకొచ్చి ఎంగేజింగ్ గా చూపే ప్రయత్నం చేసాడు కానీ అంతగా పండలేదు. హిరోకి ఉన్న బాహ్య పోరాటం: గ్యాంగ్‌స్టర్లతో, రాజకీయులతో. అంతకు మించి, అతని అంతర్గత పోరాటం: తన తల్లికి తానే శత్రువుగా మారడం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటంలో దర్శకుడు స్క్రిప్ట్ పరంగా తడబడ్డాడు. ఎంతసేపు హీరోని యాక్షన్ పరంగా ఎంత హై లో చూపాలనే తాపత్రయం తప్పించి, కథలో విషయం ఎంత ఉందనేది చూసుకోలేదు.
కథలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్..ఓ పోలీస్ అధికారి కొడుకు ఎందుకు గ్యాంగస్టర్ గా అయ్యాడు అనేది. ఆ ఎపిసోడ్ ని గతంలో అజిత్ హీరోగా వచ్చిన కిరీడం నుంచి తీసుకున్నారు. ఈ కాలానికి సరిగ్గా ఎడాప్ట్ చేయలేకపోయారు. దీంతో ఆ సీన్స్ లో కావలసిన బలం లేదు. అయినా తల్లి, కొడుకు ఎందుకు విడిపోయారో తెలుసుకోవడానికి సినిమాకు ఎవరూ వెళ్లరు కదా. విడిపోయిన తర్వాత ఏం జరిగింది. తర్వాత ఎలాంటి నాటకీయ పరిస్థితుల్లో మళ్లీ ఒకటయ్యారు అనేదే కీలకం. అదీ ప్రెడక్టబుల్ గా ఉండటానికి వీల్లేదు. ఇక క్లైమాక్స్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ గానే ఉంది కానీ కొంతవరకే. అది ఊహకు అందేదే.
టెక్నికల్ గా ...
మంచి బడ్జెట్ లో తీసిన సినిమా కావటంలో టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. సినిమాలో సినిమాటోగ్రఫీ , అజనీష్ లోక్‌నాథ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేశారు.ఫస్టాఫ్ ఎడిటింగ్ స్పీడుగానే వెళ్లిపోయిన సెకండాఫ్ లో మరింత షార్ప్ గా ఉండాల్సింది.
నటీనటుల్లో
కళ్యాణ్ రామ్ తన వంతు న్యాయం చేసాడు. తల్లిని విపరీతంగా ప్రేమించే కొడుకుగా, ఓ గ్యాంగస్టర్ గా బాగా చేసాడు. అయితే గ్యాంగస్టర్ గా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందేమో. విజయశాంతి గత రోజుల్లోకి వెళ్ళిపోయింది. పవర్‌ఫుల్ పాత్రలో కనిపించింది. ఆమె కోసం పృథ్వీ, బబ్లు, శ్రీకాంత్ వంటి వారు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. శ్రీకాంత్ మళ్లీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు.
ఫైనల్ గా..
క్లైమాక్స్ లో చిన్న మెరుపు కోసం రొటీన్ సీన్స్ నడిచే సినిమాని భరించలేరు కదా. ఇదేమీ కాంతారా కాదు. ఆఖరులో అద్బుతం జరిగిపోవటానికి