ANR 100 పండుగ.. 25 నగరాల్లో అక్కినేని క్లాసిక్స్ , డిటేల్స్
x

'ANR 100' పండుగ.. 25 నగరాల్లో అక్కినేని క్లాసిక్స్ , డిటేల్స్

తెలుగు సినిమా ఉన్నంతకాలం అక్కినేని నాగేశ్వరరావు గుర్తుంటారు.ఆయన గురించి, సినిమాల గురిచి మాట్లాడుకుంటూనే ఉంటాము.

తెలుగు సినిమా ఉన్నంతకాలం అక్కినేని నాగేశ్వరరావు గుర్తుంటారు.ఆయన గురించి, సినిమాల గురిచి మాట్లాడుకుంటూనే ఉంటాము. సెప్టెంబర్‌ 20న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. తన జీవితకాలంలో తెలుగువారికి గొప్ప క్లాసిక్స్ ని అందించిన ఏయన్నార్‌ శత జయంతి ఉత్సవాలకు ఆయన కుటుంబ సభ్యులు రెడీ అవుతున్నారు. అక్కినేని అభిమానులు కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. శతజయంతి ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ భావిస్తున్నారు. ఆ మూడు రోజులు కూడా అక్కినేని ఫ్యాన్స్ కోసం సూపర్‌ హిట్‌ క్లాసిక్‌ మూవీస్‌ రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఏయన్నార్‌ నటించిన సూపర్‌ హిట్‌ టాప్‌ 10 సినిమాలను సెప్టెంబర్‌ 20 నుంచి 22వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన 25 సిటీల్లో రీ రిలీజ్ చేయబోతున్నారు. సింగిల్ స్క్రీన్‌ థియేటర్ ల్లోనే కాకుండా మల్టీ ప్లెక్స్ ల్లో కూడా ఆ టాప్ 10 సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్‌ సంస్థలు అయిన ఐనాక్స్, పీవీఆర్‌ లతో చర్చలు జరుపుతున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి పురస్కరించుకుని, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF) ఒక ప్రత్యేక ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది. 'ఏఎన్ఆర్ 100- కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఈ రెట్రోస్పెక్టివ్ ఫెస్టివల్‌లో అక్కినేని నాగేశ్వరరావు సినీ కెరీర్‌లో అద్భుతమైన 10 క్లాసిక్ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

ఈ ఫిల్మ్ ఫెస్టివల్ సెప్టెంబర్ 20-22 మధ్య, హైదరాబాద్, ముంబయి, దిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాలతో పాటు, వడోదర, జలంధర్, రూర్కెలా, వరంగల్, కాకినాడ, తుమకూరు వంటి చిన్న నగరాల్లో కూడా జరగనుంది.

ఉత్సవాల్లో ప్రదర్శించే చిత్రాలు లిస్ట్

దేవదాసు,

మాయాబజార్‌,

మిస్సమ్మ,

డాక్టర్‌ చక్రవర్తి,

భార్యభర్తలు,

గుండమ్మ కథ,

ప్రేమ్‌ నగర్‌,

ప్రేమాభిషేకం,

సుడిగుండాలు,

మనం

ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్‌పూర్ మాట్లాడుతూ.. “అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్ రెట్రోస్పెక్టివ్‌ల భారీ విజయం తర్వాత, తెలుగు సినీ లెజెండ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఈ ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫెస్టివల్‌ను ప్రదర్శించడం మాకు చాలా ఆనందంగా ఉంది. 1953 నుండి 2014 వరకు సినిమాల ఎంపికలో ANR బిగ్గెస్ట్ హిట్‌లు ఉన్నాయి, అవి యాక్టర్ గా ANR అద్భుతమైన ప్రదర్శన చూసే అవకాశాన్ని ప్రజలకు అందిస్తాయి .

ఈ సినిమాలు దశాబ్దాలుగా ప్రజలతో ప్రతిధ్వని స్తున్నాయి. మన సినిమా వారసత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మేము అన్ని ప్రాంతాల నుండి భారతీయ సినిమా యొక్క విభిన్న వారసత్వాన్ని ప్రదర్శించడానికి కట్టుబడి ఉన్నాము . ఈ రెట్రోస్పెక్టివ్‌లలో మోడరన్ ప్రేక్షకులు క్లాసిక్ చిత్రాలను ఎంతగా ఇష్టపడుతున్నారో మేము చూశాము, అనేక స్క్రీనింగ్స్ హౌస్ ఫుల్ కావడం ఆనందంగా వుంది’ అన్నారు.

ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం, NFDC, PVR-Inox, అక్కినేని కుటుంబం, FHF సంస్థలు సహకరించనున్నాయి.

Read More
Next Story