‘వందేళ్ల రాజ్ కపూర్’ : మరొక నివాళి
x

‘వందేళ్ల రాజ్ కపూర్’ : మరొక నివాళి

ప్రేమ, ప్రయత్నం, పరాజయం, పరిమితులు: వందేళ్ల అసమాన కళా జీవితం రామ్. సి నివాళి


-రామ్.సి

-1-

ప్రతి మనిషి ఓ కలతోనే ప్రారంభమవుతాయి, కానీ కొందరు కళను జతచేసుకొని ఎదుగుతారు. కానీ, ఆ కలను సాకారం చేసే మార్గం ఒక వింత ప్రయాణంలా నేరుగా ఉండక , క్లిష్టంగా, మలుపులతో నిండి ఉంటుంది. ఇది ఆ వ్యక్తి సినిమా కథలాగా మన కళ్ల ముందుంచుతుంది. చిన్నతనంలోనే, ఒక భావోద్వేగ కథకుడిగా తనను తాను చూసుకున్న అతను, జీవితాన్ని ఓ తెరపై నిలిపి, మానవ అనుబంధాల అందాన్ని ప్రపంచానికి చూపించాలని తీర్మానించాడు.
అతను కళాత్మక కుటుంబ వారసత్వంలో పుట్టినప్పటికీ, అది ఓ భారమైనా, కుటుంబ ప్రతిష్ఠ అతనికి తలుపులు తెరిచినా, అతని అసమానమైన శ్రమ, ప్రజల మనసులను తాకే ప్రతిభ మాత్రమే అతనిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. చేస్తున్న పనికి వన్నె అద్దడం చాలా గొప్ప, అరుదైన నైపుణ్యం.

రాజ్ కపూర్ విజయానికి మార్గం సునాయాసం కాదు. ఒక క్లాపర్ బాయ్‌గా అతని ప్రస్థానం కష్టమయిన శ్రమతో మొదలై, స్టూడియో గదుల్లోని తపన అతనికి నిజమైన పరిశ్రమ జీవితం అంటే ఏమిటో బోధించింది. అవకాశాలు తలుపు తట్టినప్పుడల్లా, అతను కేవలం ప్రతిభతోనే కాదు, అసమానమైన పట్టుదలతో ముందుకు సాగాడు. అనేక ఆర్థిక కష్టాలు అతని ప్రాజెక్టులను అంచున నిలిపినప్పటికీ, అతను తన కలను విరమించలేదు. సాహసోపేతమైన ఇతివృత్తాలు, వినూత్నమైన సంగీతం, మరియు సృజనాత్మక కథనాలు అతని పనికి ప్రాణం పోశాయి. సాధారణ మనుషుల పోరాటాలు, కలలు, నిస్సహాయత,మంచితనం, ప్రేమ, అతని కథల్లో చిరస్థాయిగా నిలిచాయి.
-2-
కానీ వ్యక్తి ప్రతిభ లోపాలకు అతీతం కాదు. అతని వ్యక్తిగత జీవితం కూడా తీరని కథలా ఉండేది. అతని ప్రేమలు, వ్యవహారాలు, మక్కువ చూపించిన సంబంధాలు పరిశ్రమలో పుకారులకు కేంద్ర బిందువయ్యాయి. ఇవి అతని ప్రతిష్టకు ప్రమాదం కలిగించినప్పటికీ, జీవితం పట్ల అతని తివిరి ప్రేమను, భావోద్వేగాల్లో అతని మునకను స్పష్టతగా చూపాయి. అతని కుటుంబం ఒక వైపు ప్రశంసనీయమైనదిగా కనిపించినప్పటికీ, లోపల విభేదాలతో అస్తవ్యస్తంగా ఉండేది. సృజనాత్మక స్వేచ్ఛ పై గొడవలు మరియు సంబంధాల్లోని గాఢత అతనికి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో బలహీనతలను మనకూ చూపించాయి.
తప్పిదాలు అతని కథలో ఒక ప్రధాన భాగం. కొన్ని ప్రాజెక్టులు, కొందరు అతని దృష్టిని ముందుగానే అర్థం చేసుకోలేకపోయి,ఘోర పరాజయాలు అందించాయి. కానీ ఆ పరాజయాలు కూడా అతని విజయం కోసం బాటలు వేసాయి. అతని అభిమానులు అతనిని కేవలం ఓ నటుడు, దర్శకుడిగా కాకుండా, తమని చూసుకున్నారు, ఓ జీవానంత వెండితెర కళాఖండంగా భావించారు.
-3-
అతని సినిమాలు కలలు కలిగించే విజువల్స్ కావు, భావోద్వేగాలతో కూడిన జీవన భాష్యం, నేను నీలాంటి మనిషినే అని చూపే అద్దం, వినూత్న కథనాలతో చిరకాల ముద్ర వేశాయి. నన్నడిగితే సమస్య ఏదైనా, ప్రేమతో ఎలా పరిష్కరించచ్చో ,ప్రయత్నించచ్చొ ,ఆలోచించించొచ్చో ప్రేక్షకుడిగా నాకు అలవాటు చేసిన వాడు. అతను ప్రయోగాలను ప్రమాదంగా చూడలేదు; అవి అతని జీవితానికి ఆవశ్యకమని నమ్మాడు. అతను కేవలం ఓ వ్యక్తి కాదు; ఒక కాలాతీతత్వాన్ని ప్రతిబింబించే రూపం. అతని పేరు వినబడినప్పుడు ఓ సామాన్యుడి సంకల్పాన్ని,ఆశయాన్ని సూచిస్తుంది. అతను ఓ కలల సామ్రాజాన్ని అందరికి పంచిన మనిషి. అతని లోపాలు, విజయాలు, అన్ని కలిపి అతన్ని మనకు సృష్టించి మిగిల్చినవి.

ఆయన సొంతంగా నిర్మించిన అవారా (1951), శ్రీ 420 (1955), జగ్తే రహో (1956), జిస్ దేశ్ మే గంగా బెహతీ హై (1960) ఇతర సంస్థలతో నటుడిగా వచ్చిన దస్తాన్ (1950), అన్హోనీ (1952), ఆహ్ (1953), చోరి చోరి (1956), అనారీ (1959), ఛాలియా (1960), దిల్ హాయ్ టు హై (1963) బూట్ పోలిష్ (1954), అబ్ దిల్లీ డోర్ నహిన్ (1957)వంటివి దేనికవే ప్రత్యేకాలు.

నాన్న పరిచయం చేసిన వ్యక్తి అతను. అలసట చెందినప్పుడు, ఆకాశం చూసినప్పుడంతా అతని పాటలు గుర్తుకొస్తాయి,ప్రేమను పంచిన వాడు, అంతకన్నా ఎక్కువ పొందినవాడు.అమాయకత్వం బలహీనం కాదు ,బలం అని నిరూపించిన వాడు. లౌక్యం నిజాయితీ కాదని నేను చెప్పగలిగినంత అనుభూతి అనుభవం పంచిన వాడు.అతనే రాజ్ కపూర్ ((14 డిసెంబర్ 1924 – 2 జూన్ 1988). శతజయంతి శుభాకాంక్షలు.



Read More
Next Story