అదిరిపోయే థ్రిల్లర్:  శాఖాహారి ఓటిటి మూవీ రివ్యూ
x

అదిరిపోయే థ్రిల్లర్: 'శాఖాహారి' ఓటిటి మూవీ రివ్యూ

ఈ మధ్యకాలంలో కొన్ని చిన్న సినిమాలు తమ కంటెంట్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఊహించని విజయాన్ని అందుకుంటున్నాయి.

ఈ మధ్యకాలంలో కొన్ని చిన్న సినిమాలు తమ కంటెంట్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఊహించని విజయాన్ని అందుకుంటున్నాయి. రీసెంట్ గా విజయ్ సేతుపతి మహారాజా చిత్రం అలాంటి పేరు తెచ్చుకుంది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నడలో రిలీజైన 'శాఖాహారి' సినిమా కూడా అద్బుతమైన సక్సెస్ అందుకుంది. స్టార్స్ ఎవరూ లేకుండా క్యారక్టర్ ఆర్టిస్ట్ లతో కేవలం స్క్రిప్టునే నమ్ముకుని చేసిన ఈ సినిమాకు కోటి రూపాయలు పెడితే ఐదు కోట్ల పైగా కలెక్షన్స్ వచ్చాయి. మర్డరీ మిస్టరీ థ్రిల్లర్ స్టోరీకి కన్నడ ప్రేక్షకులు థ్రిల్ అయ్యిపోయారు. ఇప్పుడు ఈ థ్రిల్లర్ మూవీ ని డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేసారు. అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కథేంటి..తెలుగు వాళ్లకు నచ్చే కంటెంట్ ఉందా చూద్దాం.

'శాఖాహారి' కథ విషయానికొస్తే...

సుబ్బన్న (రంగాయన రఘు).. ఓ చిన్న ఊరిలో శాఖాహార హోటల్ నడుపుతుంటాడు. ఆ చుట్టు ప్రక్కల ఆ హోటల్ చాలా ఫేమస్. అభిమానంగా ఆయన వండి వడ్డించే వంటకాలుకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. సామాన్య జనం నుంచి పోలీస్ లు, న్యూస్ పేపర్ వాళ్లు వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా ఇక్కడకు వచ్చి సుబ్బన్న చేతి కాఫీనో, దోశో, కషాయమో తీసుకుని వెళ్తూంటారు. సుబ్బన్న గతంలో చిన్న పాటి లవ్ స్టోరీ ఉండటంతో పెళ్లి కాకుండా అలా మిగిలిపోతాడు. సోలో బ్రతుకే సో బెటర్ అన్నట్లు గా జీవిస్తూంటాడు. అతనికి ఈ డిజిటల్ రోజుల్లో ఓ పాతకాలం రేడియో, అందులో వచ్చే ఆకాశవాణి పాటలంటేనే ఆసక్తి.

అలాగే తనకు వారసత్వంగా వచ్చిన హోటల్ లో తనే వంట మాస్టర్ గా ఉండటం , సాయింత్రం అయ్యేసరికి నాటకాలుకు వెళ్లటం చేస్తూంటాడు. అలా కాలక్షేపం చేస్తున్న అతని జీవితంలో ఓ కుదుపులాంటి మలుపు వస్తుంది. భార్యని హత్య చేసిన విజయ్ అనే కుర్రాడు.. సుబ్బన్న హోటల్‌లోకి వచ్చి తలదాచుకుంటాడు. పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి ఓ బుల్లెట్ దిగి వచ్చిన విజయ్ బాధాకరమైన గతం విని తన ఇంట్లో ఉండటానికి కొద్ది రోజులు ఉండటానికి ఫర్మిషన్ ఇస్తాడు.

మరో ప్రక్క లోక‌ల్ పోలీస్ ఆఫీస‌ర్‌కు (గోపాల‌కృష్ణ దేశ్‌పాండే) విజయ్ కోసం తెగ వెతుకుతూంటాడు. అతని ట్రాన్సఫర్ పై ఈ కేసు ఆధారపడి ఉంటుంది. అలాగే విజయ్ ని తనే కాల్చి ఉండటంతో ఆ బుల్లెట్ తగిలి ఏమైనా అయితే ఏంటి పరిస్దితి అనే భయం అతన్ని తన టీమ్ తో కలిసి వెతుకుతూంటాడు. మరో ప్రక్క పై అధికారులు ప్రెజర్ ఉంటుంది. త్వరగా విజయ్ ని కనుక్కోమని, అతను కనుక చనిపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్తూంటారు.

ఇదిలా సుబ్బన్న ఉంటే అతన్ని తన హోటల్ లో ఎవరికి కనపడకుండా దాయటానికి నానా తిప్పలు పడుతూంటాడు. ఓ రోజు మొత్తానికి అతన్ని వేరే చోటకు పంపటానికి ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో ఓ అనుకోని సంఘటన సంఘటన జరుగుతుంది. సమస్య తీవ్రం అవుతుంది. ఇంతకీ ఏమిటా సంఘటన. సుబ్బన్న ఎందుకు అతను హంతకుడు అని తెలిసినా తన దగ్గర పెట్టుకునే ధైర్యం చేసాడు. పోలీస్ ఆఫీసర్ కు ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది. చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

వినయ్ కోసం వచ్చిన లోకల్ పోలీస్ (గోపాల్ కృష్ణ దేశ్ పాండే)కు సుబ్బన్న గురించి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఇంతకీ అవేంటి? తన హోటల్‌కి వచ్చిన వాళ్లని సుబ్బన్న ఎందుకు చంపేస్తున్నాడు? అనేదే స్టోరీ.

ఎలా ఉంది

ఇది ఓ గ్రిప్పింగ్ మిస్టరీ స్టోరీ. . సుబ్బన్న లాంటి వ్యక్తులు మనకు నిత్యం రోజువారి జీవితంలో తారసపడుతూంటారు. క్రైమ్ గురించి వింటేనే భయపడే ఓ వ్యక్తి అదే క్రైమ్ లో కూరుకుపోవాల్సి వస్తే అనేది ఎప్పుడూ ఆసక్తి కరమే. ముఖ్యంగా హోటల్ కు వచ్చే కష్టమర్స్ కళ్ల నుంచి తన దాస్తున్న వ్యక్తిని కాపాడటం పెద్ద టాస్కే. ఈ క్రమంలో అతని వింత ప్రవర్తనను కూడా వాళ్లు అనుమానిస్తూంటే దాన్ని కవర్ చేసే సీన్స్ ఆసక్తికరంగా అనిపిస్తాయి.ఈ సినిమా ఇంత సక్సెస్ కు కారణం మనకు తెలుసున్న పాత్రలుతోనే కథను డిజైన్ చేయటం. దానికి తగినట్లే టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ తో డిజైన్ చేసారు. క‌న్న‌డంలో సీనియ‌ర్ న‌టుల్లో ఒక‌రైన రంగాయ‌న ర‌ఘు ఈ సినిమాని పూర్తిగా తన భుజాలపై మోసాడు. స‌ర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లు, విజువ‌ల్స్‌, బీజీఎమ్ ఈ సినిమాకు హైలైట్‌ . అయితే కొంత హింసాత్మ‌క దృశ్యాలు డోస్ తగ్గిస్తే బాగుండేది.

చూడచ్చా

థ్రిల్లర్ అభిమానులకే కాకుండా సినిమా లవర్స్ ఖచ్చితంగా చూడతగ్గ సినిమా. ఎక్కడా బోర్ కొట్టని నేరేషన్ ఈ సినిమాని నచ్చేలా చేస్తుంది.

ఏ ఓటిటిలో ఉంది

అమేజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story