అల్లు శిరీష్ కెరీర్ సెట్ చేయటానికి అరవింద్ కొత్త ప్లాన్, ఇదైనా వర్కవుట్ అవుతుందా?
అల్లు అరవింద్ వంటి పెద్ద నిర్మాత తన చిన్న కొడుకు కెరీర్ ని తీర్చిదిద్దే విషయంలో ఫెయిల్యూర్ అనే చెప్పాలి.
అల్లు అరవింద్ వంటి పెద్ద నిర్మాత తన చిన్న కొడుకు కెరీర్ ని తీర్చిదిద్దే విషయంలో ఫెయిల్యూర్ అనే చెప్పాలి. తన మరో కొడుకు అల్లు అర్జున్..పుష్ప వంటి ప్యాన్ ఇండియా సినిమా చేసి భాక్సాఫీస్ ని బ్రద్దలు చేయడానికి బయలుదేరారు. అందరూ అతని గురించి మాట్లాడుకుంటున్నారు.మరో ప్రక్క చిన్న కొడుకు కెరీర్ గురించి మాట్లాడటానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో ఉంది. మీడియా దగ్గర కూడా అల్లు శిరీష్ విషయం ఎక్కడా పొరపాటున ఎత్తరు. ఆయన అపారమైన అనుభవం, నాలెడ్జీ...అల్లు శిరీష్(Allu Sirish) విషయంలో అసలు ఫలించలేదు.
అప్పటికీ అల్లు శిరీష్ రెగ్యులర్ కథలు చేయకూడదనే ధోరణిలోనే మొదటి నుంచి వెళ్తున్నారు. ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. అయితే అవేమీ బాక్సాఫీస్ దగ్గర నిలబడటం లేదు. రెండేళ్ల క్రితం ఊర్వశివో రాక్షసీవో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రొమాంటిక్ కామెడీతో మెప్పించాడు శిరీష్. ఆ తర్వాత బడ్డీ అనే ఓ సినిమాని రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో నెక్ట్స్ సినిమా ఉందా లేదా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని గమనించిన అల్లు అరవింద్ ఓ మాస్టర్ ప్లాన్ వేసి తన కొడుకు కెరీర్ కు బూస్టప్ ఇవ్వాలని భావిస్తున్నారట. అదేమిటి
అల్లు అర్జున్ తమ్ముడు, అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్. తాను నటించింది అతి తక్కువ సినిమాలు అయినా మంచి నటుడిగా మాత్రం గుర్తింపు పొందారు. 2013 లో గౌరవం తో మనకు పరిచయం అయ్యారు, ఆ సినిమా అంత గొప్పగా ఆడకపోయినా తన నటన తో ఓ వర్గాన్ని మెప్పించారు. మొదటి సినిమా బాగానే చేశాడు అన్నారు. అప్పటి నుంచి వరస ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా అల్లు శిరీష్ బడ్డీ అనే కొత్త చిత్రం తో మన ముందుకు వచ్చారు. అది అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాలేదు.
వాస్తవానికి మెగా హీరో అనే ట్యాగ్ తోనే శిరీష్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు దాదాపుగా అందరూ విజయాల బాటలో పయనిస్తున్నారు. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నిన్న కాక మొన్న వచ్చిన వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెనతో బంపర్ హిట్ కొట్టాడు. కొండ పొలం లాంటి విభిన్న చిత్రాలు చేసాడు. ఇప్పుడు మరికొన్ని సినిమాలు కమిటయ్యాడు.
కానీ అల్లు శిరీష్ మాత్రం హీరోగా సుస్థిర స్థానం ఏర్పరుచుకోలేదు. ఇప్పటికీ అతడి కెరీర్ తడబడుతూనే సాగుతోంది. శిరీష్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అంటే శ్రీరస్తు శుభమస్తు' మాత్రమే. ఇప్పుడు శిరీష్ సినిమాల పరంగా, సోషల్ మీడియాలో శిరీష్ యాక్టివ్ గా లేడు. అల్లు అరవింద్ లాంటి టాప్ ప్రొడ్యూసర్ తన కొడుకు కెరీర్ పై ఫోకస్ ఎందుకు పెట్టడం లేదు అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. ఇంతవరకు కొత్త అప్డేట్ లేదు. అప్పట్లో చిత్ర షూటింగ్ సమయంలో శిరీష్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్నాడు. జిమ్ వర్కౌట్స్ చేస్తూ ఫొటోస్ షేర్ చేసేవాడు. మరో చిత్రానికి కూడా కసరత్తులు జరుగుతున్నాయని తెలిపాడు. ఆ ఊసు కూడా ఇప్పుడు లేదు. మరి అల్లు శిరీష్ సినిమాల పరిస్థితి ఏంటి.. అనే చర్చ జరుగుతోంది.
ఓ చిట్ చాట్ లో అల్లు శిరీష్ తన ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ..నేను నటించే సినిమాల ఎంపిక విషయంలో నా ప్రమేయమే ఉంటుంది. నేను చేసిన గౌరవం, ఏబిసిడి,ఒక్క క్షణం వంటి సినిమాలన్నీ కూడా తానే ఎంపిక చేసుకున్నానని అయితే ఈ సినిమా కథలు విన్నప్పుడు నాన్న వీటిని చేయొద్దు ఇవి ఫ్లాప్ అవుతాయి అంటూ ముందుగా తనకు హెచ్చరించారని శిరీష్ వెల్లడించారు. ఈ విధంగా ఈ సినిమాల గురించి నాన్న తన జడ్జిమెంట్ ముందుగా ఇచ్చినప్పటికీ నేను మాత్రం తన మాట వినకుండా సినిమాలు చేసి ఫ్లాప్ అందుకున్నానని శిరీష్ తెలిపారు.
ఇక ఊర్వశివో రాక్షసివో సినిమా కథ మొదట నాన్నగారు కూడా విన్నారు. ఈ కథకు తానైతే బాగుంటానని నాన్నగారు ఈ సినిమాలో నటించమని చెప్పారు. ఇలా నాన్న జడ్జిమెంట్ ఈ సినిమా విషయంలో నిజమైంది.ఇలా తన తండ్రి అల్లు అరవింద్ సినిమాల ఎంపిక విషయంలో ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారని ఇకపై తన సినిమాలన్నింటిని నాన్ననే ఎంపిక చేస్తారు అంటూ అల్లు శిరీష్ చెప్పారు. సరే..మరి ఇప్పుడు అల్లు అరవింద్ ప్లాన్ ఏంటి... అంటే తన కొడుకుని తమిళంలోకు పంపాలని డిసైడ్ అయ్యారనే వార్త వినపడుతోంది.
నటుడుగా అల్లు శిరీష్ అద్భుతం అని చెప్పలేం కానీ చాలా మంది కన్నా బాగా చేస్తారు. మంచి ఈజ్ ఉంది బాడీలో. మహానటుడు అల్లు రామలింగయ్య రక్తం కనుక నటన పరంగా శిరీష్ ప్రేక్షకుల్ని మెప్పిస్తాడనడంలో సందేహంలేదు. కానీ.... తెలుగు రంగం వదిలి తెలుగువాడైన శిరీష్ తమిళ రంగంలోకి వెళ్లడం ఒకింత ఆశ్చర్యమే. అల్లు అరవింద్ కుటుంబం అనేక దశాబ్దాలు చెన్నైలో ఉండటం వల్ల... తమిళం చాలా అనర్గళంగా మాట్లాడగలుగుతారట.
మరో కారణం ఏమిటంటే తెలుగులో ఇప్పటికే తమ రెండు కుటుంబాల నుంచి చాలా మంది హీరోలు ఉండటం వల్ల పోటీ ఎందుకని? తమిళ రంగంలోకి వెళుతున్నాడని అంటున్నారు. శిరీష్ తాను హీరో నిలబడాలని భీష్మించుకోవడంతో తండ్రిగా అల్లు అరవింద్ కుమారుడి కోరిక తీర్చడానికి ఈ ఐడియా వేశారని అనుకుంటున్నారు. అయితే అదైనా వర్కవుట్ అవుతుందా..అసలు అరవింద్ నిజంగానే తన చిన్న కొడుకుని తమిళంలోకి పంపాలనుకుంటున్నారా అనేది వేచి చూసి తెలుసుకోవాల్సిన విషయం.