బాక్సాఫీస్‌ను ముంచుతున్న  BOGO ఆఫర్‌లు
x

బాక్సాఫీస్‌ను ముంచుతున్న BOGO ఆఫర్‌లు

సినీ పరిశ్రమలో మరో రివర్స్ గేమ్!?

ఒక సినిమా బ్రాండ్ అయితే... కథ దానికి విలువ. కాని ఆ విలువకు పన్ను వేసే బాటనే BOGO ఆఫర్. సినీ పరిశ్రమ ఎదుర్కోబోతున్న అసలైన సంక్షోభం BOGO ఆఫర్ రూపంలో కనిపిస్తోంది. ప్రస్తుతం నార్త్ ఈ BOGO ఆఫర్ ని విస్తృతంగా అమలు చేస్తోంది. ఇక్కడ మన తెలుగు నిర్మాతలు సైతం కొందరు ఈ దిసగా ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే BOGO ఆఫర్ ఏమిటి, దీనివలన సినిమా ఇండస్ట్రీకు నష్టమా ,లాభమా చూద్దాం.

ఇవాళ్టి మార్కెట్ లో నటుల ముఖాలు చూసి టిక్కెట్లు అమ్ముడవటం లేదు. ఒక అనుభూతి(ఫీలింగ్) కోసం టిక్కెట్లు అమ్ముడవుతున్నాయనేది నిజం. ఇక్కడ స్టార్ సినిమా చూడటం కూడా ఓ అనుభూతే. అయితే ఆ స్టార్డం ఏ మేరకు అనేది నిర్ణయిస్తుంది. ఇవాళ్టి పరిస్దితుల్లో ప్రేక్షకుడి నిర్ణయం చాలా స్ట్రాంగ్ గా ఉంటోంది. సినిమా రిలీజ్ అయిన గంటలోనే అది హిట్ లేదా ఫ్లాప్ అనే తీర్పు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్టార్ విలువ, భారీ ప్రమోషన్, విజువల్స్... ఇవన్నీ ఉన్నా సరే — "ఇది నాకొద్దు" అనే నిర్ణయం తీసుకోవడానికి అతనికి 5 నిమిషాల టైం చాలు. అంతే ఆ నెక్ట్స్ షో నుంచి కలెక్షన్స్ డ్రాప్ మొదలైపోతోంది.

"₹200 టికెట్ అనేది పెద్ద విషయం కాదు. సాయంత్రం వృధా అయ్యింది అన్నదే మా బాధంతా." అంటున్నారు ఓ నచ్చని సినిమా చూసి ఇవాళ సగటు ప్రేక్షకుడు. దీన్ని దాటటానికి అన్ని ఇండస్ట్రీలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. రిలీజ్ రోజు హిట్ టాక్ తెచ్చుకోవాలని, హౌస్ ఫుల్స్ అవ్వాలని తాపత్రయపడుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు BOGO ఆఫర్స్ ని తీసుకురావటానికి వెనకాడటం లేదు. ఇప్పుడు అజయ్ దేవగణ్ తాజా చిత్రం ‘సన్నాఫ్‌ ఆఫ్‌ సర్దార్‌-2 ’కు ఇదే ఆఫర్ తెచ్చారు.

సన్ ఆఫ్ సర్దార్ 2 మొదట జూలై 25న విడుదల కావాల్సి ఉండగా, ఆగస్ట్ 1కి విడుదల వాయిదా పడింది. ప్రారంభ రోజున బుక్‌మైషోలో ప్రేక్షకులు 50% తగ్గింపుతో సినిమా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చని చిత్ర నిర్మాతలు జియో స్టూడియోస్ ప్రకటించింది. "Laughter 100%. Ticket price 50%! ! మీ పూర్తి కుటుంబంతో కలిసి, #SonOfSardaar2ని చూడటానికి రండి. SOS2 కోడ్‌ని ఉపయోగించండి & 50% ఆఫ్ (T&C వర్తింపజేయబడింది)" అని వారు ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు ట్రేడ్ లో చర్చగా మారింది.

ఒకప్పుడు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ సినిమాలంటే కంటెంట్‌ను చూసే అవసరమే ఉండేది కాదు. కానీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్...’, అజయ్ దేవగణ్ ‘భోలా’, ‘సన్నాఫ్ సర్దార్-2’ వంటి సినిమాలు ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి కూడా Buy-One-Get-One (BOGO) ఆఫర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి.

'సన్నాఫ్ సర్దార్-2' తొలి రోజే “1+1 టికెట్” తో స్టార్ట్ అవ్వడం, ఇది బాలీవుడ్‌కి మార్కెటింగ్ మారిన పద్దతే కాదు — బిజినెస్ మోడల్‌లో దొర్లిన లాస్ట్ ఫెయిత్‌కి సంకేతం.

* BOGO: ఆఫర్‌పై ప్రేక్షకుడు హాల్‌లోకి వచ్చేస్తాడు... కానీ నిర్మాతకు లాభం ఏమీ ఉండదు!

BOGO ఆఫర్ వినడానికి బాగుండొచ్చు. కానీ ఆ లోతులో చూస్తే:

₹100 టికెట్ అమ్మితే, నిర్మాతకు దొరికేది ₹52

ఉచిత టికెట్‌కి నిర్మాతే ₹12 GST + ₹48 థియేటర్ షేర్‌ ఇస్తాడు

అర్థం?

₹52 సంపాదించాలంటే ₹60 ఖర్చు చేయాలి, ఇది డిస్కౌంట్ కాదు..డొనేట్ చేయటం.

సినిమా నెంబర్స్ పెరగాలి, OTT డీల్స్ పెద్దదిగా రావాలి అన్న దానికి ఇదే మార్గం. కాని ఇది సరైన వ్యాపారం కాదు — ప్రమోషన్ మీద ఆధారపడిన పిచ్.

* థియేటర్లకే లాభం, కానీ ప్రేక్షకుడికి అలవాటు – ప్రమాదమే!

BOGO స్కీమ్ వల్ల థియేటర్లకు నష్టమేమీ ఉండదు. ఎందుకంటే:

Snacks, Beverages అమ్ముడవుతాయి

Premium seating ఫుల్ అవుతుంది

రద్దీ వాతావరణం social proof లా పనిచేస్తుంది

కానీ — దీర్ఘకాలంగా చూస్తే ఇది ప్రేక్షకుడికి ఒక conditioning అవుతుంది.

* చివరకు జరిగేదేమిటి...

డిస్కౌంట్ లు అలవాటుగా మారతాయి. అలవాట్లు వెంటనే చూడాలన్ని అర్జెన్సీ ని కిల్ చేస్తాయి. అప్పుడు ప్రేక్షకుడు ఇలా అనిపించుకుంటాడు: “ఇంకో రెండు రోజులు ఆగితే BOGO వస్తుంది కదా అప్పుడు చూద్దాంలే!”. దీంతో ఫస్ట్ వీక్ కలెక్షన్లు – కట్

* స్టార్ అనే హ్యాష్‌ట్యాగ్ కన్నా

ఒక చిన్న సినిమా 'సైయారా' — కేవలం మంచి కథ, ఎమోషనల్ హుక్‌తో, భారీ ప్రమోషన్లు లేకుండా స్టెడీ రన్ సాధిస్తోంది. మరోవైపు, 'మహావతార నరసింహ' — దేశవ్యాప్తంగా దుమ్ము రేపుతోంది. ఇవి content-first strategies ఫలితాలు. ఇవే అజయ్ దేవగణ్‌లాంటి స్టార్స్ ఇప్పుడు మిస్ అవుతున్నారు.

"ఇక సినిమాలో ఎవరు ఉన్నారనేది కాదు. అందులో ఏముందనేది ముఖ్యం .కథ కనెక్ట్ అయినప్పుడు, టిక్కెట్ కలెక్ట్ అవుతుంది."

* ఇప్పుడు సినిమా వాల్యూ ఏమిటి?

OTT ప్రపంచంలో, ప్రేక్షకుడికి అతని టైమ్ విలువైనదిగా అనిపించాలి. టికెట్‌కి డబ్బు ఇవ్వడమే కాదు — అతని ఆదివారం సాయంత్రం విలువైన టైమ్ కు మీ సినిమా న్యాయం చేస్తుందా?

* “సినిమా అనేది ఇప్పుడు నంబర్ గేమ్ కాదు. ఇది ఎమోషన్ గేమ్.”

బజ్ అనేది కలెక్షన్ రిపోర్ట్‌తో కాదు. అది కథలో ఉండే నమ్మకంతో, ఫస్ట్ షో రివ్యూలో రానివ్వాలి. ప్రేక్షకుడిని థియేటర్‌కి తీసుకురావాలంటే — పేరు కాదు, ఖచ్చితంగా చూడాలనిపించేలా పిలుపు కావాలి. BOGO దానికో చిన్న ద్వారం కావచ్చు. కానీ లోపలికే వచ్చేలా చేయాల్సింది మీ కథ.

“ఆఫర్‌లు జనాలను థియేటర్స్ కు తీసుకురాగలవు. స్టోరీ టెల్లింగ్ మాత్రమే వారిని అక్కడ ఉంచగలదు.”

Read More
Next Story