అల్లు అర్జున్ సీక్రెట్ లైన్‌అప్ లీక్!
x

అల్లు అర్జున్ సీక్రెట్ లైన్‌అప్ లీక్!

రాజమౌళి నుంచి భన్సాలీ దాకా


‘పుష్ప’ ఒక్క సినిమాతోనే అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయికి వెళ్ళిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా అతన్ని కేవలం టాలీవుడ్ స్టార్ గా కాకుండా ఇండియన్ పాప్ కల్చర్ ఐకాన్ గా నిలబెట్టింది. “తగ్గేదే లే!” అన్న డైలాగ్ నుంచి ఆయన బాడీ లాంగ్వేజ్ దాకా – దేశమంతా బన్నీ ఫీవర్ ఎగసిపడింది. ఆ తర్వాత‘పుష్ప- 2’తో ఆ క్రేజ్ మరింత రెట్టింపు అయ్యింది. ఇప్పుడు అట్లీ తో చేస్తున్న సినిమాతో కెరీర్ నెక్ట్స్ లెవిల్ కు వెళ్తుందని అంచనా. ఇదే సమయంలో బన్నీ కెరీర్‌లో వరస క్రేజీ ప్రాజెక్టులు లైన్‌లో పెట్టుకుంటున్నాడు. అవి విన్న వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది కదా బన్నీ సత్తా అంటున్నారు.

ఇండస్ట్రీ వర్గాల నుంచి వినపడుతున్న సమచారం మేరకు ...ఇండియన్ సినిమా టాప్ డైరెక్టర్లతో అల్లు అర్జున్ డిస్కషన్స్ మొదలయ్యాయి. ఏది ఫైనల్ కాలేదు కానీ, ఒక్కో కాంబినేషన్ వింటూంటే ఫ్యాన్స్‌లో థ్రిల్ పెరిగిపోతోంది.

ఇదిగో... బన్నీ లైన్‌లో ఉన్న “బిగ్గెస్ట్ ఫిల్మ్స్” లిస్టు!

సంజయ్ లీలా భన్సాలీతో బన్నీ! – పాన్ ఇండియా కలయికకు స్కెచ్ రెడీ

‘గంగూబాయి’, ‘పద్మావతి’లాంటి క్లాసిక్ సినిమాలు చేసిన భన్సాలీతో అల్లు అర్జున్ చర్చలు గత సంవత్సరం నుంచే జరుగుతున్నాయి. ఇద్దరికీ ఒకే ఆలోచన — భారీ ఎమోషన్, గ్లామర్, ఇండియన్ ఆడియెన్స్‌ని కనెక్ట్ చేసే స్టోరీ. అట్లీ తో చేస్తున్న సినిమా రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే ఛాన్స్ బలంగానే ఉంది.

సరైనోడు 2 – మాస్ దరహాసం మళ్లీ రాబోతోంది!

బోయపాటి శ్రీను ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఉన్నాడు. దాని తర్వాత టార్గెట్ – సరైనోడు 2! అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే మొదలయ్యే అవకాశముంది. మాస్ ఆడియెన్స్‌కి ఇది ఓ ఫెస్టివల్ మూవీ అవుతుంది!

ప్రశాంత్ నీల్ – కెజిఎఫ్, సలార్ తర్వాత బన్నీతో మాస్ ఎక్స్‌ప్లోజన్?

టాప్ ప్రొడ్యూసర్ డిల్ రాజు సెట్ చేసిన మీటింగ్‌లో ప్రశాంత్ నీల్ – బన్నీ ఇద్దరూ కలుసుకున్నారు. స్క్రిప్ట్ లెవెల్లో చర్చలు మొదలయ్యాయి కానీ నీల్ వద్ద డ్రాగన్, సలార్ 2, కెజిఎఫ్ 3 లైన్లో ఉన్నందున టైమ్ పట్టే అవకాశం ఉంది. అయితే ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే, అది పాన్ ఇండియా స్థాయిలో గేమ్ ఛేంజర్ అవుతుందనే గ్యారెంటీ.

రాజమౌళి – అల్లు అర్జున్ కలయిక అంటే ప్యూర్ సెన్సేషన్!

ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబు సినిమా SSMB29లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఆయన కొత్త స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు బన్నీ పేరు డిస్కషన్‌లో ఉందట. ఇది ఫైనల్ అయితే, రాజమౌళి విజన్ + బన్నీ ఇన్‌టెన్సిటీ = ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయం!

కొరటాల శివ – మరోసారి కలయిక ఫైర్ అవుతుందా?

కొరటాల శివ – బన్నీ కాంబినేషన్ కొంతకాలం క్రితం అనౌన్స్ అయ్యింది కానీ ఆగిపోయింది. పుష్పా 2 తర్వాత శివ కొత్త కథ నరేట్ చేశాడు, బన్నీ కూడా ఆసక్తిగా విన్నాడట. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్‌పై ఫైన్ ట్యూనింగ్ జరుగుతోంది. వచ్చే నెలల్లో క్లారిటీ రానుంది.

మొత్తం మీద…

అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టేజ్‌లో ఉన్నాడంటే అది యాదృచ్ఛికం కాదు. ఆయనతో సినిమా చేయాలనుకునే దర్శకుల లిస్టు ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఉంది. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు కానీ, ఈ డిస్కషన్స్ అన్నీ రియలైజ్ అయితే, రాబోయే దశాబ్దం అల్లు అర్జున్ యుగంగా మారడం ఖాయం!

Read More
Next Story