OTT తలనొప్పికి  ఆమీర్ ఖాన్ మందు...
x

OTT తలనొప్పికి ఆమీర్ ఖాన్ మందు...

ఓటీటీ కాదు – థియేటర్‌లే గమ్యం



ఇప్పటి సినిమా మార్కెట్‌లో "Early OTT Deals" అనేవి ఒక స్ట్రాటజీ కాకుండా, ఓ వ్యసనంగా మారిపోయాయి. థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కి బై బై చెప్పేసినట్లు, చాలా మంది ప్రేక్షకులు డైరెక్ట్‌గా ఓటీటీలో సినిమా చూడటానికే వేచి చూస్తున్నారు. ఇది థియేటర్ ఫుట్‌ఫాల్స్‌కు తలకిందులు చేస్తోందనటంలో సందేహం లేదు.

అయితే, ఈ ట్రెండ్‌కు బాలీవుడ్ మిస్టర్ పెర్‌ఫెక్షనిస్ట్ – ఆమీర్ ఖాన్ స్ట్రాంగ్‌గా బ్రేక్ చెప్పారు. ఆయన తాజా సినిమా "Sitaare Zameen Par" కోసం ఎటువంటి డిజిటల్ డీల్స్ చేయకుండా, థియేటర్లకే ప్రాధాన్యత ఇచ్చారు.

"మేము ఉన్నది స్ట్రీమింగ్ వ్యాపారంలో కాదు... కథలు చెప్పే వ్యాపారంలో ఉన్నాము" అంటూ ఆమిర్ ఖాన్ చెప్పి ఆ మాటలు నిలబెట్టుకున్నారు. ఓ రకంగా ఇది అమీర్ తీసుకున్న జెన్యూన్ గ్యాంబ్లింగ్ అనే చెప్పాలి. అందరూ OTT డీల్స్‌తో ముందే కలెక్షన్లను లాక్ చేసుకుంటున్న సమయంలో, ఆయన మాత్రం వాటన్నింటినీ సూటిగా తిరస్కరించారు. థియేటర్లోనే ఫుల్‌ రన్ దిశగా ప్లాన్ చేశారు.

థియేటర్లలో టికెట్ ధరలని పెంచలేదు

వీక్ఎండ్‌కి కూడా లిమిటెడ్ షోలతోనే బుకింగ్స్

ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యేలా సింపుల్ రిలీజ్ స్ట్రాటజీ

ఈ డెసిషన్లు డేంజరస్‌గానే అనిపించొచ్చు... కానీ ఆమీర్ గేమ్ ప్లాన్ అద్భుతంగా వర్కౌట్ అయింది!

"Sitaare Zameen Par" సినిమా రెండు వారాలు థియేటర్లలో హౌస్‌ఫుల్‌కు దగ్గరగా నడవడం ఒక విజయం. మరింత ఆశ్చర్యం ఏమిటంటే, మూడవ సోమవారం కూడా decent occupancy నమోదైంది. ఇది రీసెంట్ బాలీవుడ్ హిస్టరీ లో చాలా అరుదైన విషయం.

“Early OTT Deals” వచ్చే నష్టం

ఓటిటి డీల్స్ ని ముందే లాక్ చేయటం అనేది వ్యాపార నైపుణ్యం అయినా ... లాంగ్‌టర్మ్ డ్యామేజ్ కి కారణం అవుతోంది. థియేటర్లకు వచ్చే ఫుట్‌ఫాల్స్ పడిపోతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కు వెళ్లాలన్న ఉత్సాహం తగ్గిపోతుంది. సినిమాని పర్సనల్‌గా ఆస్వాదించే ఓ థ్రిల్ మిస్ అవుతోంది.

ఇప్పుడు చాలామంది నిర్మాతలు... షార్ట్‌టర్మ్ విండోలో ఓటీటీ డీల్ క్లోజ్ చేసి, కనీస ప్రమోషన్‌తో మూవీ రిలీజ్ చేసి, నాలుగో వారం లోపే వదిలేస్తున్నారు. ఇది వాస్తవానికి ఒక "Burnout Model". కానీ ఆమిర్ ఖాన్ డెసిషన్ మాత్రం “Asset Lifecycle Extension” లాంటి బిజినెస్ మూడ్‌లో ఉంది. ఆమిర్ ఖాన్ ఈ సినిమాను కేవలం సినిమా అనిపించకుండా, ఒక "సినిమా consumption philosophy"గా మార్చారు. ఓ రకంగా ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక Wake-up Blueprint.

సినిమా ట్రేడ్ లో ఓ మాట చెప్తూంటారు "Consistency is more valuable than opening day chaos." ("ఒకే రోజున వచ్చే హంగామా కంటే, నిరంతరత ఎక్కువ విలువైనది.")

OTT బిజినెస్‌లో ఈ మధ్యకాలంలో “Speed Kills Longevity” అనే మాట నిజమవుతుంటే, ఆమీర్ మాత్రం దీన్ని "Sustainable Theatrical Lifecycle"గా మార్చారు.

YouTube Pay-per-view: Next Move?

సితారే జమీన్ పర థియేట్రికల్ మార్కెట్‌లో విజయం సాధించాక, ఇప్పుడు ఓ కొత్త మార్గం కనిపిస్తోంది. YouTube Pay-Per-View Modelపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇది ఇండియన్ మార్కెట్లో తొలి అమీర్ లెవెల్ ఎక్స్‌పెరిమెంట్ అయ్యే అవకాశం ఉంది.
ఆమీర్ ఖాన్ సినిమాను ఓ ప్రోడక్ట్‌గా కాకుండా ఓ అనుభూతిగా విక్రయించారు. “Content is King, but Context is God” అన్నట్టుగా. ఇది ఎవరూ చెయ్యని ధైర్యం, మార్కెట్ మీద అవగాహన కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే చేయగల ఔత్సాహిక స్ట్రాటజీ.


Read More
Next Story