మెగా ఫ్యామిలీ vs దిల్ రాజు క్యాంప్.. లోపల  ఏం జరుగుతోంది?
x

మెగా ఫ్యామిలీ vs దిల్ రాజు క్యాంప్.. లోపల ఏం జరుగుతోంది?

ఓ ఫిల్మ్ ఫెయిల్యూర్... ఓ వ్యాఖ్య...

గత కొన్ని రోజులుగా ‘గేమ్ ఛేంజర్’ వివాదం టాలీవుడ్ మీడియాను పూర్తిగా వేడెక్కిస్తోంది. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ తర్వాత, దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా మీడియా హీటు పెంచేశాయి.

“సినిమా ప్లాప్ అయిన తర్వాత హీరోగానీ, డైరెక్టర్ గానీ ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు” అన్న మాటలతో మెగా ఫ్యాన్స్ మనస్తాపానికి గురయ్యారు. దీనికి స్పందనగా శిరీష్ ఒక క్షమాపణ లేఖను విడుదల చేయడం, దిల్ రాజు స్వయంగా వివరణ ఇవ్వడం ఈ వ్యవహారాన్ని మరింత వివాదాస్పదంగా మార్చాయి.

ఈ పరిణామం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ సిస్టమ్, నిర్మాతల–హీరోల సంబంధాలు, మరియు ఫెయిల్యూర్‌కు మానసిక వ్యధ వంటి విషయాలపై గొప్ప చర్చకు దారితీస్తోంది.

ఓ ఫిల్మ్ ఫెయిల్యూర్... ఓ వ్యాఖ్య... ఓ క్షమాపణ లేఖ.

ఇది కేవలం పైకి కనపడే విషయం మాత్రమే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది వాణిజ్య-వ్యక్తిగత సంబంధాల సంక్లిష్టతకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే అంటోంది ట్రేడ్ . ఎందుకంటే సినిమాలు ఫెయిల్ అవుతాయి. కానీ ఫెయిల్యూర్స్‌కి రెస్పాన్స్‌ కూడా ఓ ఆర్ట్. అసలేం జరిగిందో ఓ సారి చూస్తే...

గేమ్ ఛేంజర్ సినిమా ఫెయిల్యూర్ అయిన ఇంతకాలం తర్వాత, దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ మాట్లాడుతూ… ' గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ నిలబడుతామని నమ్మకం వచ్చింది. ఇదంతా కూడా కేవలం నాలుగు రోజుల్లోనే జీవితం మారిపోయింది. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం.

అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన చేసేవారు. గేమ్‌ ఛేంజర్‌ ప్లాప్‌ అయింది. హీరో వచ్చి మాకు ఏమైన సాయం చేశాడా..? దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్‌ కాల్‌ చేసి ఎలా ఉన్నారు..? పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు చరణ్‌ కూడా అడగలేదు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు.' అని అన్నారు.

ఈ మాటలు మెగా ఫ్యాన్స్‌ను తీవ్రంగా గాయపరిచింది. ఎందుకంటే, ఇది చిరంజీవి కుటుంబాన్ని పరోక్షంగా టార్గెట్ చేసినట్లుగా భావించారు. దాంతో పెద్ద వివాదాన్నే రగిల్చింది. మెగాభిమానులు ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు వార్నింగ్ లు ఇచ్చేదాకా వెళ్లింది.

ఫ్లాప్ అవడం ఓ సాధారణం. కానీ ఎమోషన్‌లో వాడే పదాలు, బ్రాండ్ పరంగా వందల కోట్ల విలువను ప్రభావితం చేస్తాయి . అందుకే మెగాభిమానులకు తీవ్రమైన కోపం వచ్చింది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో మౌనమే బెటర్. ఎందుకంటే స్టార్ ఇమేజ్ మీద చేసే మాటలు, అన్‌కంట్రోలబుల్ రియాక్షన్స్ తెస్తాయి. బిజినెస్ పరంగా బ్రిడ్జ్ బర్న్ అవుతుంది.

అయితే ఈ వ్యతిరేకతను గమనించిన శిరీష్ రెడ్డి ఒక అధికారిక లేఖను విడుదల చేశారు:

“నా మాటలతో ఎవరికైనా బాధ కలిగితే, హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. రామ్ చరణ్ గారు ‘గేమ్ ఛేంజర్’ సినిమా సమయంలో పూర్తిగా మాకు సహకరించారు. చిరంజీవి గారి కుటుంబంతో మా బంధం సంవత్సరాల నాటిది. ఎప్పుడూ వారి ప్రతిష్టకు మచ్చ పట్టేలా మేము ప్రవర్తించం.” అని ప్రకటించారు.

ఇది క్షమాపణ మాత్రమే కాదు. ఒకానొక ‘డామేజ్ కంట్రోల్’ వ్యూహం కూడా.

బిజినెస్ మైండ్ vs ఫ్యామిలీ బాండింగ్

శిరీష్ చేసిన వ్యాఖ్యలు ఎమోషనల్ అవే కావచ్చు. కానీ వ్యాపార పరంగా చూస్తే, ఇవి అసాధారణం కావు. ఇండస్ట్రీలో, పెద్ద హీరోలతో పనిచేసిన తర్వాత సినిమా ఫెయిల్ అయితే నిర్మాతలు ఒంటరి అనిపించుకునే సందర్భాలు అనేకం ఉన్నాయి.

రామ్ చరణ్ మౌనం

రామ్ చరణ్ ఈ వివాదంపై స్పందించలేదు. ఇది సీనియారిటీకీ, క్లాస్‌కీ సూచనగా భావిస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో శిరీష్‌పై విమర్శల వర్షం కురిపించారు.

అదే సమయంలో “ఇలాంటి ప్రాజెక్టుల ఫెయిల్యూర్లో ఫోన్ కాల్ మాత్రమే కాదు, డ్యామేజ్ షేరింగ్ కూడా అవసరం,” అంటూ కొంతమంది అంటున్నారు. మరోవైపు, "డైరెక్టర్ శంకర్ ఎందుకు స్పందించలేదు?" అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. ఎవరి వెర్షన్ వారిది.

మీడియాదే తప్పా?

దిల్ రాజు మాట్లాడుతూ...." 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ అందరు స్టార్‌ హీరోలతో మంచి రిలేషన్‌ మెయింటైన్‌ చేస్తూ అందరితోనూ సినిమాలు​ తీసిన సంస్థ ఇది. ఎక్కడా ఏ వివాదం లేకుండా పని చేసుకుంటూ వచ్చాను. కానీ ఆరు నెలల కిందట ఫ్లాప్‌ అయిన ఒక్క సినిమాను పట్టుకుని మమ్మల్ని చీల్చి చెండాడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే టాపిక్‌.

జరిగిన సంభాషణంతా వదిలేసి కావాల్సిన చిన్న క్లిప్‌ తీసుకుని సంచలన హెడ్డింగ్స్‌ పెట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇంత నెగిటివిటీ ఎందుకు? అయిపోయిన సినిమాను వదిలేయండి. జనవరి తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాపులున్నాయి. వాటిలో ఒక్క సినిమా గురించైనా మాట్లాడుతున్నారా?" అని అసహనం వ్యక్తం చేశారు.

* ఫైనల్ గా ఈ వ్యవహారం ఏమిచెబుతుంది?

పాన్ ఇండియా ఫిల్మ్స్ అంటే బడ్జెట్ మాత్రమే కాదు, బాండ్స్‌ను కూడా హ్యాండిల్ చేయాలి.

కమ్యూనికేషన్ లేకపోవడం పెద్ద సమస్య.

విజయం వచ్చాక సెలబ్రేషన్స్ అందరిదీ. కానీ ఫెయిల్యూర్‌కి ఎవరి బాధ్యత అన్నదానిపై ఇండస్ట్రీలో స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది.

ఈ పరిణామం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ సిస్టమ్, నిర్మాతల–హీరోల సంబంధాలు, మరియు ఫెయిల్యూర్‌కు మానసిక వ్యధ వంటి విషయాలపై గొప్ప చర్చకు దారితీస్తోంది. ఇది కేవలం ఒక సినిమాకున్న సమస్య కాదు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో వాణిజ్య సంబంధాలు, మానవ సంబంధాల మధ్యనున్న బలహీన రేఖలపై వెలుగుపెడుతోంది.

అదే సమయంలో ఒక ముఖ్యమైన ప్రశ్నను ఎదుట పెట్టింది

ఫెయిల్యూర్ తరువాత బాధ్యత ఎవరిది?

అభిమానుల ప్రాధాన్యత ఎంత?

ఎమోషనల్‌గా మాట్లాడిన మాటలు బిజినెస్‌కి ఎంత నష్టాన్ని తెస్తాయ్?

అయినా ...

“సినిమా ఫెయిలయితే… మనుషుల మధ్య రిలేషన్షిప్ కూడా ఫెయిలవాలా?”

మీ అభిప్రాయం ఏంటి? ఈ సంఘటన ఇండస్ట్రీలో భవిష్యత్ బంధాలకు ఏమి చెబుతోంది?

Read More
Next Story