
మన ఊహకు ఎంత దూరమైనా, అది రీల్‌లో చూపించగలగడం.
Lights… Code… Action! ఇండియాలో మొదటి AI ఫిల్మ్! !
"Not everyone can become a great artist, but a great artist can come from anywhere." – Ratatouille (2007)
ఈ డైలాగ్ ఇప్పుడు పూర్తిగా మరోరకంగా అర్దం అవుతోంది… ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రేట్ ఆర్టిస్టు… ఓ కంప్యూటర్ నుంచి కూడా రావచ్చు!
ఓ సినిమా... కానీ ఒక్క కెమెరా లేకుండా!
ఒకప్పుడు సినిమా అనగానే… కెమెరాలు, సెట్స్, ఆర్టిస్టులు, రాత్రింబవళ్ళ కష్టాలు, కోట్ల రూపాయల బడ్జెట్ గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు?
ఒక కంప్యూటర్, కొన్ని కమాండ్లు, కొంత ఐడియా… అంతే!
ఒక సినిమా పుట్టించేయగలుగుతున్నాం.
ఇది కల కాదు.
ఇది భవిష్యత్తు కాదు.
ఇది ఇప్పుడే జరుగుతోన్న 'ఏఐ విప్లవం'.
కర్ణాటకలోని చిన్న గ్రామం సిద్ధెహళ్లి. ఇక్కడినుండే మొదలైంది భారతదేశ తొలి పూర్తిగా AIతో తయారైన సినిమా — ‘Love You’
ఇందులో 15 మంది నటీనటులు ఉన్నారు
పాటలు ఉన్నాయి - ఫైట్స్ ఉన్నాయి -చాలా లొకేషన్లు ఉన్నాయి
కానీ…
👉 కెమెరా లేదు
👉 షూటింగ్ లొకేషన్ లేదు
👉 నటీనటుల నటన లేదు
👉 మ్యూజిక్ డైరెక్టర్ లేనే లేదు!
ఇవన్నీ AIతో రూపొందించబడ్డవి.
కథలు చెప్పే మనిషిని... కథే చెప్పగలగే మెషిన్ భర్తీ చేస్తుందా?
ఈ చిత్రాన్ని రూపొందించిన నరసింహ మూర్తి, గ్రాఫిక్ డిజైనర్ నూతన్ కలిసి...
కేవలం ₹10 లక్షలతో...
సాఫ్ట్‌వేర్ లైసెన్సులు కొని…
AIని స్క్రీన్‌ప్లే రాయమన్నారు, పాటలు రాయమన్నారు, డైలాగ్స్ చెప్పమన్నారు.
AI నో అన్నదేం లేదు... రాసేసింది!
"Cinema is a matter of what's in the frame and what's out." – Martin Scorsese
ఇప్పుడు ఆ ఫ్రేమ్ మొత్తం… కంప్యూటర్‌లోనుంచే వస్తోంది!
AI: ఓ సాధనం? లేక ఓ సృష్టికర్త?
AI తో సినిమా తీయడంలో ప్లస్ పాయింట్లు ఏంటంటే:
Low Budget, High Quality: కెమెరాలు, సెట్స్, మానవ వనరులు తగ్గిపోవడం వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది.
Speed: నెలలు పట్టే సినిమా... కొన్ని రోజుల్లో తయారు చేయొచ్చు.
Creative Limitlessness: మన ఊహకు ఎంత దూరమైనా, అది రీల్‌లో చూపించగలగడం.
అయితే మైనస్‌లు లేవా?
ఎమోషన్ చూపించలేని పిక్సెల్స్: మనిషి జీవితం నుంచి పుట్టే నొప్పి, ఆనందం, బాధ, ప్రేమ... ఇవన్నీ డేటా లైన్లలో పుట్టలేవు.
ఆర్టిస్టుల భవిష్యత్తు?: నటులు, రచయితలు, సంగీత దర్శకులు, టెక్నీషియన్లు... వీరి అవసరం ఇక తగ్గిపోతుందా?
“Technology is a useful servant but a dangerous master.” – Christian Lous Lange
ఇదే మాట AIకి కూడా వర్తిస్తుంది.
కళను కోడింగ్ చేసుకోవచ్చా?
AI సినిమాలు తీస్తోంది
కానీ… వాటిలో మన గుండె చప్పుడు ఉంటుందా?
టిఫిన్ పెట్టే అమ్మని, గుడిలో కొబ్బరికాయ కొట్టే నాన్నని, ఆటోలో వెళ్తూ పాట పాడే ప్రేయసిని...అంతే ఆర్తితో AI చూపించగలదా? విజువల్స్ వస్తాయి కానీ ఆ కళ్ల వెనక ఉండే ఎమోషన్ ని మనలోకి ప్రవహింపచేయగలదా?
ఏమౌతుంది భవిష్యత్తులో?
ఓ రైటర్ తన కథను కేవలం చెప్పి, AI తో పూర్తిస్థాయి సినిమాగా డెమోలో చూపించవచ్చు.
తక్కువ బడ్జెట్‌తో టాలెంట్ ఉన్నవాళ్లకు ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ పెరుగుతుంది.
ఆలోచింపజేసే ప్రశ్నలు:
“You don’t make a movie, the movie makes you.” – Jean-Luc Godard
అలా ఆయన చెప్పినట్లు AI సినిమా మనల్ని చేస్తుందా?
“Art is not freedom from discipline, but disciplined freedom.” – John F. Kennedy
మరి AI కి డిసిప్లిన్ ఉన్నా... కళలో ఫ్రీడం ఉందా?
“In AI we trust... or should we?” – Anonymous
మన భావోద్వేగాలను రీడింగ్ చేయగలగడం, మనసు అర్థం చేసుకోవడం... ఇవి పూర్తి స్దాయిలో AI వల్లే సాధ్యమా?
సినిమాకు కొత్త పాఠం — కొత్త భాష: ‘ఎమోషన్ కోడ్‌డ్ సినిమా’!
AI మన వంతు కష్టం తగ్గించొచ్చు
కానీ మనకి ఉండాల్సింది కళవ మీద పట్టు
AI ఓ గొప్ప సాధనం
కానీ మనిషి ఊహే నిజమైన డైరెక్టర్! అనే మర్చిపోకూడదు.
ఈ విజువల్,డిజిటల్ విప్లవం ఎక్కడ ఆగుతుందో తెలియదు
కానీ ఒక విషయం మాత్రం నిజం:
"సినిమా… ఇక మనిషి చేతులకి, చేతలకే పరిమితం కాదు.
మన ఊహలకు దాని గమ్యం తెలిపే రోబో చేతుల్లోకి వెళుతోంది."
Welcome to the AI Age of Cinema!