
డార్క్ కామెడీ: 'రివాల్వర్ రీటా' రివ్యూ
స్టైల్ ఫుల్ … థ్రిల్ నిల్!న
పాండిచ్చేరి బేకరీ గర్ల్ రీటా (కీర్తి సురేష్) జీవితం ఒకే రాత్రిలో అతలాకుతలమవుతుంది. అక్క కూతురు తొలి బర్త్‌డే — ఇంట్లో హ్యాపీ హడావుడి. కానీ ఆ రాత్రే పాండిచ్చేరి కిరాతక డాన్… “డ్రాకులా పాండియన్” (సూపర్ సుబ్బరాయన్) తాగిన మత్తులో పొరపాటున వారి ఇంట్లోకి దూసుకువస్తాడు. చిన్న గొడవ పెద్ద దుర్ఘటనగా మారుతుంది. రీటా తల్లి ల్లమ్మ (రాధిక శరత్‌కుమార్) తోసేయటంతో ఆ దెబ్బకు… అంత పెద్ద భయానక డాన్ అక్కడికక్కడే క్షణాల్లో చనిపోతాడు! అక్కడే మొదలవుతుంది అసలు తుఫాన్.
డాన్ చనిపోయిన విషయం బయటపడితే అతని కొడుకు బాబీ (సునీల్) వీరిని బ్రతనిస్తాడా? అని ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో అనుమానం. భయం. అందుకే శవాన్ని ఫ్రిజ్‌లో దాచి బర్త్‌డే ని సైలెంట్ గా సెలబ్రెట్ చేసారు! అంతేకాదు మరుసటి రోజు ఆ డెడ్‌బాడీని దగ్గరలో ఉన్న అడవిలో పూడ్చేయడానికి కారు కొంటారు. కానీ — మధ్యలో డ్రాకులా బాబీ మనుషులు కారుని ఢీకొట్టడం. అడవిలో డిక్కీ ఓపెన్ కాకపోవడం, మెకానిక్ దగ్గర రిపేర్ చేయించాల్సి రావడం, అదే టైంలో రీటాపై పగ పెట్టుకున్న సీఐ కామరాజ్ (జాన్ విజయ్) కారుపై డౌట్ పడటం అన్నీ వరుసగా జరుగుతాయి!
ఇదిలా ఉంటే డాన్ పాండియన్‌ను అసలు చంపాల్సిన సుఫారీ తీసుకున్న గ్యాంగ్ కు ఈ విషయం తెలుస్తుంది. వాళ్లు ఓ ప్లాన్ వేస్తారు. రీటా దగ్గర ఉన్న శవాన్ని దొంగిలించి రెడ్డి (అజయ్ గోష్)కి అప్పగించి 5 కోట్లు కొట్టేయాలి!
ఓ రీటా ఫ్యామిలీ చుట్టూ... ఒక వైపు బాబీ, మరోవైపు సీఐ, ఇంకో వైపు సుఫారీ గ్యాంగ్ అలా మూడు వైపుల నుండి హంటింగ్ ప్రారంభమవుతుంది!ఈ మొత్తం గందరగోళంలో — రీటా కుటుంబం ఎలాంటి స్కెచ్ వేసింది? డాన్ పాండియన్ చావు ఆటలో ఎవరు బలి అయ్యారు? ఎవరు బకరా అయ్యారు? రీటా తండ్రి మరణం… పాండియన్ & రెడ్డి తో ఉన్న నిజమైన కనెక్షన్ ఏమిటి? ఇవన్నీ తెరలేపే మిగతా కథే Revolver Rita!
ఎనాలసిస్ ...
ఈ పై కథలో ఒకటి గమనించవచ్చు రీటా ఏం చేయటానికి ఏమీ లేదు. అంటే కీర్తి సురేష్ పాత్రకు చెప్పుకోదగ్గ టెన్షన్ కానీ సమస్య కానీ లేదు. అలాంటప్పుడు ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా చూడటానికి కూర్చుంటే మనకు ఏమనిపిస్తుంది..ఏమీ అనిపించదు.
ఇక స్క్రిప్టు విషయానికి వస్తే... క్రైమ్ కామెడీల్లో ప్రేక్షకులు కథను కాదు… కథనం ఎలా నడిపారనేది చూస్తారు. సిట్యుయేషన్‌ను ఎక్కడ ఎలా పేల్చాలో, కామెడీని ఎప్పుడు డార్క్‌కి మార్చాలో, suspense ను ఎలా లేయర్ చేయాలో—ఇవి మిస్ అయితే ప్రేక్షకుడు వెంటనే డిస్‌కనెక్ట్ అవుతాడు. ‘రివాల్వర్ రీటా’కి అదే జరిగింది.
ఇది క్రైమ్-కామెడీ కాదు… క్రైమ్-రొటీన్!
ముఖ్యంగా ఇలాంటి కథలు 100 సార్లు చూశాం – కొత్తదనం సున్నా!జేకే చంద్రు రాసిన స్క్రీన్‌ప్లేలో clichés, ఫార్ములా ట్విస్ట్ లు, déjà-vu సన్నివేశాలు, ప్రెడిక్టబుల్ బీట్స్ ఇవన్నీ literally ఒక టిక్‌లిస్ట్ లాగా వరుసగా కనిపిస్తాయి. కథలో సస్పెన్స్ గానీ, హ్యూమర్ గానీ సరిగ్గా పండ లేదు. ఒకరకంగా ఖాళీగా అనిపించే స్క్రీన్‌ప్లే. డ్రాకులా పాండియన్, అతని కొడుకు బాబీ, ఫెమినిన్ పింప్, over-the-top లేడీస్, ఓ రకమైన యాక్సెంట్‌తో గట్టిగా అరుచే హెన్చ్‌మన్— అన్నీ కలిపితే “quirky character gallery” లా కనిపిస్తాయి.
ఇలాంటి కథతో వచ్చిన కోకో కోకిల లో నయనతార’s సైలెన్స్ కూడా కామెడీగా ఉంటుంది. ఇక్కడ సౌండ్ ఎక్కువ, విషయం తక్కువ. అలాగే రీటా పాత్రకు పెద్దగా ప్రయారిటీ లేదు. ఆమె పాత్రకు ఏం జరిగినదో గ్రహించేందుకు breathing room ఇవ్వలేదు. ఒక emotional beat కూడా లేదు. అందుకే ఆమె జర్నీపై ప్రేక్షకుడికి పెట్టుబడి (investment) ఉండదు.
ఇంకా చిత్రం ఏమిటంటే ఒక సీన్ పూర్తిగా చూపించిన తర్వాత, రీటా… అదే సీన్‌ని మళ్లీ డైలాగ్‌ల రూపంలో చెబుతుంది. దీనివల్ల కథ పేసింగ్ మారిపోయింది. క్రైమ్-కామెడీలో suspense అంటే “ఇప్పుడు ఏమవుతుందా? తప్పించుకుంటారా?” అనే anxiety. కానీ ఇక్కడ అదేమీ జరగదు. దాంతో మనకూ ఏమీ చూసినట్లు అనిపించదు.
ఓ క్రైమ్ కామెడీగా ఈ సినిమా క్యారెక్టర్‌లను కాకుండా— clichéలను ఫాలో అవటంతో అంతగా నవ్వించదు. ప్లాట్,పాత్రలు ఇంట్రస్ట్ గా అనిపించినా కథ,కథనం మాత్రం దాన్ని దెబ్బకొట్టేసాయి.
ఎవరెలా చేసారు
కీర్తి సురేష్ — సాధారణంగా ఆమె పెర్ఫార్మెన్స్‌నే సినిమా లాగిస్తుంది, కానీ ఇక్కడ రీటా పాత్రలో ప్రత్యేకత లేకపోవడంతో ఆమె నటన కూడా సాదాసీదాగా అనిపిస్తుంది.
రాధిక శరత్‌కుమార్ — తల్లి పాత్రలో బాగా చేసింది. అలాగే సూపర్ సుబ్బరాయన్ — పాండ్యన్‌గా ఓకే. ఇక సునీల్ — లుక్ బాగుంది, కానీ పాత్ర మాత్రం పూర్తిగా తేలిపోయింది. అజయ్ ఘోష్ — తన రేంజ్‌లో సరే అనిపించే రోల్. జాన్ విజయ్ — ఇదే తరహా కామెడీ పోలీస్ రోల్స్‌ని చాలా సార్లు చేసిన ఫీలింగ్. రెడిన్ కింగ్స్ లీ — కొన్ని చోట్ల నవ్వించాడు. మిగతావాళ్లు — పర్వాలేదు, మామూలే.
టెక్నికల్‌గా
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (సీన్ రోల్డాన్) – జానర్‌కు తగ్గట్టు ఉంది, కానీ ప్రత్యేకంగా గుర్తుండేలా కాదు. సినమాటోగ్రఫీ (దినేష్ కృష్ణన్) – బాగుంది.
నిర్మాణ విలువలు – అవసరమైన స్థాయిలో ఉన్నాయి. జేకే చంద్రు (రచయిత & దర్శకుడు) – రెండు వైపులా నిరాశపరిచాడు. అనేక క్రైమ్ కామెడీలలోని సన్నివేశాలను కలిపినట్టే అనిపిస్తుంది; కొత్తదనం అసలు లేదు.
ఫైనల్ ధాట్
ఓ సినిమాని అనుకరించాలి అనుకున్నప్పుడు అది ఎందుకు క్లిక్ అయ్యిందో ముందు గమనించి దాన్ని రిపీట్ చెయ్యాలి కానీ సీన్స్, డైలాగులు, క్యారక్టర్ లు రిపీట్ చేస్తే ఇలాంటి అవుట్ ఫుట్ వస్తుంది. ఈ సినిమా చూసాక కోకో కోకిల మరోసారి చూడాలనిపిస్తే అది మీ తప్పు కాదు.
అలాగే కీర్తి సురేష్ ..వరస పెట్టి చేస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ ప్లాప్ సినిమాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టే టైమ్ వచ్చిందనే రెడ్ సిగ్నల్ ఈ సినిమా ఇస్తుంది రివాల్వర్ తో బెదిరిస్తూ మరీ.

