కామెడీ ఫ్యామిలీ డ్రామా :  బ్రదర్ (జీ 5) మూవీ రివ్యూ!
x

కామెడీ ఫ్యామిలీ డ్రామా : 'బ్రదర్' (జీ 5) మూవీ రివ్యూ!

ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే మూవీస్ ఈ మధ్యన తగ్గిపోయాయి. ఒకటి అరా వచ్చినా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోవడం లేదు.

ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే మూవీస్ ఈ మధ్యన తగ్గిపోయాయి. ఒకటి అరా వచ్చినా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోవడం లేదు. ముఖ్యంగా మహిళలు థియేటర్స్ కు వెళ్లడం తగ్గిపోయాక సెంటిమెంట్ అనేది సినిమాల్లో తగ్గిపోతూ వచ్చింది. అయితే అప్పుడప్పుడు కొందరు ఆ రోజుల నాటి సినిమాని మనకు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో వచ్చిందే ఈ తమిళ సినిమా బ్రదర్. జయం రవి హీరోగా చేసిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజైంది. యావరేజ్ అని బాక్సాఫీస్ దగ్గర అనిపించుకున్న ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ తో ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా కథేంటి..తెలుగు వాళ్లకు నచ్చుతుంగా వంటి విశేషాలు చూద్దాం.

స్టోరీ లైన్

విశాఖలో ఉండే కార్తీక్ ( జయం రవి) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఎంతకాలమైనా డిగ్రీ పూర్తి చేయకుండా కార్తీక్ కాలక్షేపం చేస్తూంటాడు. అయితే కార్తీక్ ఓ లక్ష్యం లేకపోయినా ఓ లక్షణం ఉంటుంది. అది తన కళ్ల ముందు ఎలాంటి అక్రమాలు .. అవినీతి .. అన్యాయం జరిగినా ఎదిరించేస్తూంటాడు. ఇక కార్తీక్ కి ఒక అక్కయ్య ఆనంది (భూమిక). వివాహమైన ఆమె 'ఊటీ'లోని అత్తగారింట్లో ఉంటుంది. ఆమె ఆడబడుచు అర్చన (ప్రియాంక అరుళ్ మోహన్) కి కార్తీక్ అంటే ఇష్టం. కానీ అతని పద్దతి చూసి దూరం జరుగుతుంది. ఈ క్రమంలో కార్తీక్ చేసిన ఓ పని వలన తన తండ్రి హార్ట్ ఎటాక్ వరకు వెళ్లాడు.

ఈ విషయం తెలుసుకున్న ఆనంది, తన తమ్ముడిని తండ్రికి దూరంగా ఉండటం మంచిదని భావిస్తుంది. దాంతో తనతో పాటు ఊటీకి తీసుకుని వచ్చేస్తుంది. ఇన్నాళ్లూ స్వేచ్చగా ఉన్న కార్తీక్, ప్రతీతి పద్ధతి ప్రకారమే నడుచుకునే ఆ ఇంట్లో ఇమడలేకపోతాడు. ఈ క్రమంలో అతని వల్ల అత్త మామ .. భర్త నుండి ఆనంది మాట పడవలసి వస్తుంది. తన పిల్లలతో సహా ఆ ఇంటికి దూరమయ్యే పరిస్థితి వస్తుంది. అప్పుడు కార్తీక్ కి ఒక నిజం తెలుస్తుంది. అదేమిటి? అక్క కాపురాన్ని కార్తీక్ ఎలా చక్కదిద్దుతాడు? అర్చనతో అతని పెళ్లి జరుగుతుందా? అనేది కథ.

ఎలా ఉంది

కుటుంబం అంతా వెళ్లి చూసేలా ప్యాక్ చేసిన ఫ్యామిలీ చిత్రంగా రూపొందించాలని డైరెక్టర్ తాపత్రయం అని అడుగడుగునా అర్దమవుతూనే ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఓపెనింగ్ సీన్ నుంచి టోన్ ని క్లియర్ గా సెట్ చేసుకుంటూ వెళ్లారు. హీరో చేసే కొన్ని పనులు వల్ల కుటుంబంలో ముఖ్యంగా తన అక్క కాపురంలో సమస్యలు రావడం, వాటిని తనే చక్కదిద్దటం సినిమా కథగా అనుకున్నారు. అయితే సినిమా కలర్ ఫుల్ గా డిజైన్ చేశారు కానీ స్క్రీన్ ప్లే టైట్ గా ఉండదు. చాలా మంది సపోర్టింగ్ క్యారెక్టర్ సాయంతో కథను తోసుకుంటూ వెళ్తున్నట్లు అనిపిస్తుంది కానీ దానంతట అది నడుస్తున్నట్లు అనిపించదు.

చాలా సార్లు కామెడీ కోసం లాజిక్ కు వదిలేసిన సీన్స్ ఉంటాయి. అయితే కొత్త కథ లేకపోయినా కొత్తగా చెప్పాలన్న ఆసక్తి ఉంటే చాలా వరకు సినిమాలు పాడైపోతాయి. కానీ బ్రదర్ పదం అంత ఓల్డ్ గా చాలా సీన్లు ఉండటం కొంచెం ఇబ్బంది పెడుతుంది. కాకపోతే ఓటీటీలో చేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఏదైమైనా కామెడీ ఎలిమెంట్స్ ని కథలో మరిన్ని కలుపుకుని ఉంటే బాగుండేది. అలాగే రొటీన్ గా టెంప్లేట్ లో సాగే కమర్షియల్ ఎలిమెంట్స్ ని తగ్గించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.

టెక్నికల్ గా చూస్తే

సినిమా క్వాలిటీ ప‌రంగా మంచి మార్కులు పడతాయి. నిర్మాణ విలువ‌లు క‌నిపించాయి. పాట‌లు వింటున్న‌ప్పుడు యావరేజ్ గా అనిపిస్తాయి. డబ్బింగ్ అయినా పాటల్లో సాహిత్యం బాగుంది. నిడివి ప‌రంగా సినిమా ట్రిమ్ చేసుకోవచ్చు. ఏదైమైనా ఫ్యామిలీ కామెడీ సినిమా చూడ‌బోతున్నాం అని ప్రేక్ష‌కులు ఫిక్స‌య్యాక‌… వాళ్ల‌ని న‌వ్వించ‌డం,ఏడిపించటం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ప్రేక్ష‌కుడూ కొన్ని కోరుకుంటాడు. వాటిని ఇవ్వకపోతే నిరాశపడతాడు. కోరుకున్న స్థాయిలో న‌వ్వించే స‌త్తా ఈ స్క్రిప్టులో లేక‌పోయింది. డైరెక్టర్ అది గమనించలేదు. దాంతో ‘బ్రదర్’ కాస్త అదర్ సినిమా వెతికేగా త‌యారైంది.

చూడచ్చా

ఏదో కొత్త తరహా సినిమా చూద్దామని ఫిక్సై ఓటీటీ ఓపెన్ చేసుకుని కూర్చుంటే మాత్రం నిరాశ ఎదురౌతుంది. ఫ్యామిలీ డ్రామా కొద్దిగా కామెడీ ఉంది, అసభ్యత ఉండని సినిమా కావాలనుకుంటే మాత్రం ఈ సినిమా మంచి ఆప్షన్.

ఎక్కడుంది

జీ 5 ఓటిటి లో తెలుగులో ఉంది.

Read More
Next Story