ప్రభాస్ #Spirit లో విలన్ గా డాన్ లీ ? ఎవరతను... ఏంటి అతని స్పెషల్?
x

ప్రభాస్ #Spirit లో విలన్ గా డాన్ లీ ? ఎవరతను... ఏంటి అతని స్పెషల్?

ఇప్పుడు ఎక్కడ చూసినా 'కల్కి2898 AD 'కబుర్లే. ఈ సినిమాతో ప్రభాస్ మాసివ్ సక్సెస్ అందుకున్నారు. 'కల్కి'లో రెబల్ స్టార్ యాక్టింగ్​కు నార్త్​లోనూ మరోసారి ఓ రేంజి క్రేజ్ ఏర్పడింది.

ఇప్పుడు ఎక్కడ చూసినా 'కల్కి2898 AD 'కబుర్లే. ఈ సినిమాతో ప్రభాస్ మాసివ్ సక్సెస్ అందుకున్నారు. 'కల్కి'లో రెబల్ స్టార్ యాక్టింగ్​కు నార్త్​లోనూ మరోసారి ఓ రేంజి క్రేజ్ ఏర్పడింది. అక్కడి వాళ్లు కూడా ప్రభాస్ కోసం సినిమా ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయ్యిపోయారు. దాంతో 'కల్కి' తర్వాత ప్రభాస్‌ నుంచి వచ్చే తర్వాతి సినిమా ఏంటి అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే ప్రభాస్ 'కల్కి'తో పాటు 'సలార్ 2', 'రాజాసాబ్​', 'స్పిరిట్​', 'కన్నప్ప' మూవీస్​కు సైన్ చేసిన సంగతి తెలిసిందే. 'కల్కి' షూటింగ్ టైమ్ లోనే అప్పుడప్పుడు రాజాసాబ్, కన్నప్ప సెట్స్​లోనూ సందడి చేసేవారు. అయితే ఈ సినిమాలు కాకుండా అభిమానులు మాత్రం స్పిరిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం సందీప్ వంగా.

సందీప్‌ వంగా దర్శకత్వం​లో తెరకెక్కునున్న 'స్పిరిట్‌'పై రెబల్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ప్రభాస్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్​గా కనిపిస్తారన్న చెప్పటంతో ఈ చిత్రం మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇది ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న డైరెక్టర్ త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌ను లాక్‌ చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే విషయం బయిటకు వచ్చి మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ సినిమాలో కొరియన్ స్టార్ హీరో మా డాంగ్-సియోక్ (డాన్ లీ) నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. డాన్ లీ దక్షిణ కొరియాతో పాటు అటు హాలీవుడ్‌లో కూడా చాలా సినిమాలు చేసారు.డాన్ లీ (Don Lee) అలియాస్ మా డోంగ్ సియోక్ యాక్ష‌న్ సినిమా కేరాఫ్ ఎడ్రస్. 'ట్రైన్ టూ బూసన్' తో వ‌ర‌ల్డ్ వైడ్‌గా హీరోగా అవతరించాడు. మార్వెల్ (Marvel) మూవీస్‌లో డాన్ లీ న‌టించాడు. ముఖ్యంగా ఆయన నటించిన 'ది ఔట్‌లాస్', 'ది గ్యాంగ్‌స్టర్, ది కాప్, ది డెవిల్', 'అన్‌స్టాపబుల్', 'ఛాంపియన్', వంటి సినిమాలు మన తెలుగు వాళ్లకు కూడా పరిచయమే.

ఈ సినిమాల మాత్రమే కాకుండా డాన్ లీ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన సపోర్టింగ్ రోల్స్, విలన్‌గా కూడా నటించారు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్‌లో మాస్టర్ అయిన డాన్ లీ.. తన సినిమాల్లో చేసే యాక్షన్‌ సీన్స్‌కి వీరాభిమానులు ఉన్నారు. నిజంగా డాన్ లీ.. ప్రభాస్‌ సినిమాలో విలన్‌గా నటిస్తే ఇంటర్నేషనల్ లెవల్లో ప్రాజెక్టు కు క్రేజ్ రావటం ఖాయం. ఏదైమైనా ఈ వార్త పై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు నమ్మటానికి లేదు.

ఇక యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోల పాత్రలా.. స్పిరిట్ లో కూడా విభిన్నమైన పాత్రలో ప్రభాస్ ని చూపిస్తారని నమ్మకంతో ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించిన ఆసక్తికర విషయాలను సందీప్ వంగ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేసారు.

ఈ మూవీ స్టోరీ లైన్ గురించి సందీప్ వంగా మాట్లాడుతూ.. “ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అలాంటి ఆఫీసర్ జాబ్ లో, తనకి దగ్గర వ్యక్తి విషయంలో ఒక తప్పు జరుగుతుంది. ఆ తరువాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు” అనేది కథని చెప్పుకొచ్చారు.

అలాగే స్పిరిట్ బడ్జెట్ విషయానికి వస్తే... దాదాపు రూ.300 కోట్లతో తెరకెక్కనుందని తెలియచేసారు. అలాగే 'స్పిరిట్' సినిమాప్రభాస్​తో మూవీ అనగానే రూ.300+ కోట్లు కూడా ఇన్వెస్ట్​ చేయడానికి ముందుకొచ్చే ప్రొడ్యుసర్లు ఉన్నారని సందీప్ అన్నారు. దాంతో తనకు ఈ సినిమా బడ్జెట్ విషయంలో అసలు ఆలోచించుకోవాల్సిన పనిలేదని తెల్చి చెప్పారు.

అలాగే భారీ బడ్జెట్​తో రూపొందనున్న స్పిరిట్, ప్రభాస్ ఇమేజ్​తోనే టీజర్, ట్రైలర్, ఆడియో రిలీజ్, ప్రీ ప్రమోషన్స్​తోపాటు శాటిలైట్, డిజిటల్ రైట్స్​తోనే పూర్తి బడ్జెట్ రికవరీ అయ్యే అవకాశం ఉందని సందీప్ అభిప్రాయపడ్డారు.

ఈ సినిమా స్క్రిప్ట్ ని యానిమల్ కంటే ముందే ప్రభాస్ కి వినిపించారట. కరోనా సమయంలో ప్రభాస్ కి ఈ స్టోరీ లైన్ చెప్పగా.. ఆయనకి బాగా నచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక 2024 నవంబర్​ లేదా డిసెంబర్​లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సందీప్ అన్నారు.

నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ...‘‘ ‘స్పిరిట్‌’చాలా ప్రత్యేకమైన సినిమా. పోలీస్‌ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’’ అని భూషణ్‌ కుమార్‌ చెప్పారు

ఏదైమానా సందీప్ వంగా సినిమా ..రిలీజ్ కు ముందే ఇలాంటి వార్తలతో భారీ క్రేజ తెచ్చుకుంటోంది. ఫామ్ లో ఉన్న సందీప్ వంగా, ప్రభాస్ కాంబినేషన్ అంటే చాలు భాక్సాఫీస్ దగ్గర భారీ మోత ఖాయం అనేది నిజం.

Read More
Next Story