
ఇరాన్ అంతమే అమెరికా పంతమన్న ట్రంప్
యుద్ధం 7 వ రోజుకు చేరుకుంది. మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే 2400 మంది చనిపోయినట్టు అనధికార వర్గాల అంచనా
Live Updates
- 6 March 2026 8:27 AM IST
భారత్ కు అమెరికా మినహాయింపు..
ఇరాన్-అమెరికా యుద్ధం, ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు అమెరికా కొన్ని కీలకమైన మినహాయింపులు ఇచ్చింది. ముఖ్యంగా ఇంధన భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకుంది:
చాబహార్ ఓడరేవును వాడుకోండి..
ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్‌కు అమెరికా 6 నెలల పాటు ఆంక్షల నుండి మినహాయింపునిచ్చింది. ఈ మినహాయింపు ఏప్రిల్ 26, 2026 వరకు చెల్లుబాటు అవుతుంది. ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం కొనసాగించడానికి ఈ ఓడరేవు భారత్‌కు ఎంతో కీలకం.

పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, సముద్రంలో నిలిచిపోయిన రష్యా ముడి చమురును కొనుగోలు చేయడానికి భారతీయ కంపెనీలకు అమెరికా 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అదుపులో ఉంచేందుకు ఈ వెసులుబాటు కల్పించారు.
భారత్ వైఖరి:ఎలా ఉందంటే..
అమెరికా కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ, భారత్ ఈ యుద్ధంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇటు అమెరికా-ఇజ్రాయెల్ కూటమితో సంబంధాలను కాపాడుకుంటూనే, అటు ఇరాన్ వంటి వ్యూహాత్మక భాగస్వామితో సంబంధాలు దెబ్బతినకుండా "చర్చల ద్వారా శాంతి"ని కోరుతోంది.

