LIVE ఇంగ్లండ్ టార్గెట్ 254.. 3వ వికెట్ డౌన్
x

ఇంగ్లండ్ టార్గెట్ 254.. 3వ వికెట్ డౌన్

హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో పిల్ సాల్ట్ అవుట్


ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో టాస్ ఓడిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌కు 254 పరుగుల భారీ లక్ష్యం ఉంది.

సంజు శాంసన్ మరోసారి అదరగొట్టాడు! 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సెంచరీ చేజార్చుకున్నా, అతని దూకుడు ఇన్నింగ్స్‌కు బలం చేకూర్చింది. విల్ జాక్స్ బౌలింగ్‌లో డీప్ కవర్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు.

మిడిల్ ఆర్డర్‌లో శివమ్ దూబె 43 పరుగులు (రనౌట్), హార్దిక్ పాండ్య 26-27 పరుగులు (రనౌట్) చేశారు.

తిలక్ వర్మ చివరి దశలో దూకుడుగా ఆడి 7 బంతుల్లో 3 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు, కానీ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

13.1 ఓవర్లకు 160/3 వద్ద సంజు ఔట్.

15.4 ఓవర్లకు 190/4 వద్ద కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (11) స్టంపౌట్.

17.3 ఓవర్లకు 212/5 వద్ద దూబె రనౌట్ (బ్రూక్ డైరెక్ట్ హిట్).

18.5 ఓవర్లలో ఆర్చర్ ఓవర్‌లో తిలక్ 3 సిక్సర్లు కొట్టాడు, కానీ అదే ఓవర్‌లో అవుట్ (236/6).

19.5 ఓవర్లలో హార్దిక్ రనౌట్ (251/7).

చివరి ఓవర్లలో అక్షర్ పటేల్ (1*), వరుణ్ చక్రవర్తి (0*)తో భారత్ 253/7కి చేరుకుంది.

ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ 2 వికెట్లు తీశాడు. ఆర్చర్, శామ్ కరన్‌లు భారీగానే పరుగులు ఇచ్చారు.

ఇప్పుడు ఇంగ్లాండ్ ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించాలి. భారత బౌలర్లు బుమ్రా, అర్ష్‌దీప్, వరుణ్‌లతో ఎలా ఆటగాడతారో చూడాలి.

ఈ కీలక మ్యాచ్‌కు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటివరకు టీ20ల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు 29 సార్లు తలపడగా భారత్ 17 మ్యాచ్‌లలో, ఇంగ్లాండ్ 12 మ్యాచ్‌లలో విజయం సాధించాయి.

ఇక టీ20 ప్రపంచకప్ పోటీల్లో ఈ రెండు జట్లు ఐదుసార్లు ఎదురుపడగా భారత్ మూడు, ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌లలో గెలిచాయి. సెమీస్‌లో గెలిచిన జట్టు మార్చి 8న అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో ఫైనల్ ఆడనుంది.


Live Updates

  • 5 March 2026 9:31 PM IST

    64 పరుగులకు 3 వికెట్లు డౌన్

    హ్యాట్రిక్ సిక్స్‌లు ఇచ్చి వికెట్‌ తీసిన వరుణ్‌

  • 5 March 2026 9:05 PM IST

    తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

    అర్షదీప్ తొలి ఓవర్ బాగా కాస్ట్లీ...

    తొలి ఓవర్లో 13 పరుగులు

    తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

    హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో పిల్ సాల్ట్ అవుట్

  • 5 March 2026 8:50 PM IST

    ఇండియా టోటల్ స్కోర్ 253/7

    హార్దిక్ పాండ్యా 20వ ఓవర్ లో రెండో బంతికి 6 బాదాడు. మూడో బంతికి ఒక్క పరుగు మాత్రమే చేశారు. 4 వ బంతికి హార్దిక్ మరో 6 కొట్టారు. 12 బంతుల్లో 27 పరుగులు కొట్టిన హార్దిక్ పటేల్ అవుట్

    20వ ఓవర్లో లాస్ట్ బాల్ కి 2 పరుగులు వచ్చాయి.

    ఇండియా టోటల్ స్కోర్ 253/7

    ఇండియా 253 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ లక్ష్యం 254. 20 ఓవర్లలో ఇంగ్లాండ్ ఏం చేస్తుందో ఇంకాసేపట్లో తేలుతుంది

  • 5 March 2026 8:45 PM IST

    హార్దిక్ పటేల్ అవుట్

    హార్దిక్ పాండ్యా 20వ ఓవర్ లో రెండో బంతికి 6 బాదాడు. మూడో బంతికి ఒక్క పరుగు మాత్రమే చేశారు. 4 వ బంతికి హార్దిక్ మరో 6 కొట్టారు. 12 బంతుల్లో 27 పరుగులు కొట్టిన హార్దిక్ పటేల్ అవుట్

  • 5 March 2026 8:41 PM IST

    తిలక్ వర్మ అవుట్

    ఏడు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు కొట్టిన వర్మ

  • 5 March 2026 8:38 PM IST

     ఐదో వికెట్‌ డౌన్.. దూబె రనౌట్

     పరుగు కోసం యత్నించిన శివమ్‌ దూబె (43) రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు

    శామ్ కరన్ బౌలింగ్‌లో బంతిని ఎదుర్కొన్న హార్దిక్ పాండ్య

    అయితే, పరుగు కోసం రమ్మనకుండానే క్రీజ్‌ను వదిలి వచ్చేసిన దూబె

    బ్రూక్ డైరెక్ట్ హిట్‌తో రనౌట్‌గా దూబె

    దీంతో 212 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయిన భారత్

    అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్

    హార్దిక్‌ మూడు ఫోర్లు.. 200 దాటిన స్కోరు

    హార్దిక్‌ పాండ్య (13*) ఈ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టాడు

    ఓవర్టన్ వేసిన ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి

    దీంతో భారత్ స్కోరు 17 ఓవర్లకు 205/4

    క్రీజ్‌ల పాండ్యతోపాటు దూబె (37*)

    కెప్టెన్ సూర్యకుమార్‌ ఔట్..

    కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (11) ఔటయ్యాడు

    అదిల్ రషీద్‌ (15.4వ ఓవర్‌) బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన తర్వాత స్టంపౌట్‌ అయిన సూర్య

    దీంతో 190 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను నష్టపోయిన భారత్

    ఈ ఓవర్‌లో రెండు సిక్స్‌లు సహా 13 పరుగులు వచ్చాయి

    ప్రస్తుతం భారత్ స్కోరు 16 ఓవర్లకు 190/4

    క్రీజ్‌లో దూబె (35*), హార్దిక్‌ పాండ్య

  • 5 March 2026 7:14 PM IST

    భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. దూకుడుగా ఆడిన అభిషేక్ (9) పెవిలియన్‌కు చేరాడు. 20 పరుగుల వద్ద తొలి వికెట్‌ పడింది. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం భారత్‌ స్కోరు 2 ఓవర్లకు 20/1

  • 5 March 2026 6:49 PM IST

    టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ ఎంచుకొనేవాళ్లం: సూర్య


    తాము టాస్‌ గెలిచినా బ్యాటింగ్‌ ఎంచుకొనేవాళ్లమన్న భారత కెప్టెన్ సూర్య

    తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవన్న సూర్య

Read More
Next Story