LIVE Iran is bleeding
x
ఇరాన్-అమెరికా యుద్ధం 10వ రోజుకు చేరింది

యుద్ధ వార్తలు : ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ ను ఖతం చేస్తామన్న ఇజ్రాయెల్

మిస్టర్ ట్రంప్.. ఇరాన్ "మరో వియత్నాం" అమెరికాకు ఇరాన్ పాలకుల హెచ్చరిక


ఇరాన్- అమెరికా యుద్ధం 10వ రోజుకు చేరుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ గా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబాను ఎంపిక చేశారు. అయితే ఆయన్ను బతకనివ్వబోమని ఇజ్రాయెల్ అప్పుడే హెచ్చరిక చేసింది. (అప్ డేట్స్ చూడండి) అమెరికా, ఇజ్రాయిల్ దాడులతో ఇవాళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై బాంబు దాడులు పెరిగాయి.

ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్(IRGC) లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ట్రంప్ "అన్‌కండిషనల్ సరెండర్" డిమాండ్ చేస్తున్నాడు, కానీ ఇరాన్ "మరో వియత్నాం" అని వార్నింగ్ ఇచ్చింది. (వియత్నాంతో యుద్ధంలో అమెరికా ఓడిపోయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని)..

యుద్ధం గల్ఫ్ దేశాలకు పాకింది. ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ట్రంప్ మాత్రం "ఇది చిన్నదే" అంటున్నాడు. ఆయిల్ ధరలు బ్యారల్ కి 100 డాలర్లు దాటి పోయాయి. 20% శాతం పెరిగాయి. పాకిస్తాన్, రష్యా ఇరాన్‌కు సపోర్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రష్యా ఇరాన్‌కు సహాయం చేస్తోందని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ ప్రకటించాడు. ట్రంప్ ఇండియాకు రష్యన్ ఆయిల్ కొనుగోలు అనుమతించాడు.
సౌదీ అరేబియా, ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అరబ్ దేశాలపై దాడులు కొనసాగిస్తే "బాగా నష్టపోయేది ఇరానేనని" అని టెహ్రాన్ ను హెచ్చరించింది.
దేశంలోని పెద్ద షయ్‌బా (Shaybah) ఆయిల్ ఫీల్డ్‌పై డ్రోన్ దాడి జరిగిన తర్వాత సౌదీ అరేబియా ఈ హెచ్చరిక చేసింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజేష్కియాన్ (Masoud Pezeshkian) శనివారం, గల్ఫ్ అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఆపేసినట్లు చెప్పిన మాటలు నిజం కాదని సౌదీ తోసిపుచ్చింది.

"ఇరాన్ వైపు ఈ ప్రకటనను అమలు చేయలేదు, అధ్యక్షుడు ప్రసంగించినప్పుడు కూడా, తర్వాత కూడా కాల్పులు, బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి" అని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో చెప్పింది. "ఇరాన్, ఏ కారణాలు లేకుండా, వాస్తవాలు లేని బలహీన కారణాల సాకుతో దాడులు కొనసాగిస్తోంది."
ఇరాన్ దాడులు "మరింత ఉద్ధృతి"కి దారితీస్తాయి, ఇది "భవిష్యత్తులో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది." అని హెచ్చరించింది.
మధ్యప్రాచ్య యుద్ధం ఆయిల్ సరఫరాలపై ప్రభావం చూపుతున్నందున ఫ్యూయల్ డ్యూటీలు తొలగించాలని వియత్నాం పేర్కొంది. US-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ఆయిల్ సరఫరాలను భంగపరిచి, 2022 తర్వాత అత్యధిక స్థాయికి ధరలు పెరగడంతో, ఇంధన దిగుమతులపై టారిఫ్‌లను రద్దు చేసే ప్రణాళికను పరిగణిస్తోందని ప్రభుత్వం చెప్పింది. "దేశీయ మార్కెట్‌ను స్థిరీకరించడానికి, జాతీయ ఎనర్జీ భద్రతను నిర్ధారించడానికి" ఈ చర్య అవసరమని వియత్నాం అభిప్రాయపడింది.

Live Updates

  • 9 March 2026 2:44 PM IST

    మొజ్తాబా ఖమేనీని బతకనివ్వం- ఇజ్రాయెల్

    ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ (56) కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, ఇతర ఉన్నతాధికారులు కీలక ప్రకటనలు చేశారు.

    ఇజ్రాయెల్‌ను నాశనం చేసే ప్రణాళికలను కొనసాగించడానికి ఏ నాయకుడైనా ప్రయత్నిస్తే, వారు తమకు ప్రధాన లక్ష్యం (Target for elimination) అని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.


    తమను టార్గెట్ చేస్తే కొత్త లీడర్‌గా ఎన్నికైన మొజ్తబా ఖమేనీని కూడా బతకనివ్వబోమని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు.

    "ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి, ఇరాన్ ప్రజలను అణచివేయడానికి ప్రయత్నించే ఎవరైనా సరే.. వారు ఎక్కడ దాక్కున్నా, వారి పేరు ఏదైనా వదిలిపెట్టం." అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ (X ఖాతాలో) పోస్ట్ చేశారు.

    ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ తన సైనిక చర్యలకు 'Lion's Roar' అనే పేరు పెట్టి, ఇరాన్ నాయకత్వంపై ఒత్తిడి పెంచుతోంది.

    బీబీసీ, ఇతర అంతర్జాతీయ రక్షణ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇజ్రాయెల్ ఒకరిని 'టార్గెట్' చేస్తే వారి భద్రతకు పెను సవాలు ఎదురవుతుందనడంలో సందేహం లేదు. గతంలో హమాస్ నేత ఇస్మాయిల్ హనియే, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా వంటి వారిని ఇజ్రాయెల్ అంతం చేసిన తీరు వారి గూఢచారి వ్యవస్థ (మొసాద్), సైనిక సామర్థ్యాన్ని చాటిచెప్పింది.

    మొజ్తబా ఖమేనీ విషయంలో..

    మొజ్తబాకు అత్యున్నత భద్రత ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఆయనకు దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన 'మల్టీ-లేయర్' భద్రత ఉంటుంది. ఆయన కదలికలు చాలా రహస్యంగా ఉంటాయి.

    ఇరాన్ తన అగ్రనేతల కోసం క్షిపణి దాడులను కూడా తట్టుకోగల అత్యాధునిక భూగర్భ బంకర్లను నిర్మించుకుంది.

    ఒకవేళ తమ సుప్రీం లీడర్‌పై దాడి జరిగితే, అది పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధానికి (Full-scale regional war) దారితీస్తుందని, ఇజ్రాయెల్‌ను మ్యాప్ నుండి తుడిచేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది.

    ఇజ్రాయెల్ వ్యూహాలు...

    ఇరాన్ లోపలే ఇజ్రాయెల్‌కు గూఢచారుల నెట్‌వర్క్ బలంగా ఉంది. గతంలో ఇరాన్ అణు శాస్త్రవేత్తలను, సైనిక జనరళ్లను ఇరాన్ గడ్డపైనే ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన దాఖలాలు ఉన్నాయి.

    ఇజ్రాయెల్ వద్ద ఉన్న అత్యాధునిక డ్రోన్లు, బంకర్ బస్టర్ బాంబులు ఎంతటి కట్టుదిట్టమైన భద్రతనైనా ఛేదించగలవు.

    ఇజ్రాయెల్ రక్షణ మంత్రి నేరుగా "టార్గెట్" అని ప్రకటించడం ద్వారా మొజ్తబాను మానసిక ఒత్తిడికి గురిచేయడం, ఆయన కదలికలను పరిమితం చేయడం ఇజ్రాయెల్ ఎత్తుగడలో భాగం.

    మొజ్తబా ఖమేనీ బయటి ప్రపంచానికి కనిపించకుండా, కేవలం రహస్య ప్రాంతాల నుండే పాలన సాగించే అవకాశం ఉంది.

    అంతర్జాతీయ యుద్ధ తంత్రంలో ఏ నేతకైనా 100% భద్రత అనేది అసాధ్యం, ముఖ్యంగా ఇజ్రాయెల్ వంటి దేశం వెన్నాడుతున్నప్పుడు.

Read More
Next Story