
సియాల్ కోట్, లాహోర్ లపై ప్రతిదాడికి దిగిన భారత్
త్రివిధ దళాధిపతులో భేటీ అయిన రాజ్ నాథ్, ప్రధానితో భేటి అయిన ధోవల్
ఆపరేషన్ సింధూర్ తరువాత ఉక్రోశంలో పాకిస్తాన్ దుస్సాహానికి దిగింది. ఈ రోజు పొద్దున్న15 నగరాలపై దాడులకు పాల్పడి చేతులు కాల్చుకున్న పాక్, రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో డ్రోన్లు, క్షిపణులతో భారత్ పైకి దాడికి దిగింది. ముఖ్యంగా జమ్మూలోని ఏడు ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించింది. ఆత్మాహుతి డ్రోన్లను పంపగా వాటిని సైన్యం న్యూట్రల్ చేసింది.
పాక్ చేస్తున్న ఈ ప్రతిదాడులతో భారత్ కూడా ఎదురుదాడికి దిగింది. పాకిస్తాన్ పంజాబ్ రాజధాని లాహోర్ సహ, సియాల్ కోట్ లపై క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది.
మోగిన సైరన్లు..
పాకిస్తాన్ క్షిపణులు ప్రయోగించగానే జమ్మూ నగరం మొత్త సైరన్ల మోత మోగింది. ఈ ప్రాంతం మొత్తం పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయి. దీనితో ప్రభుత్వం వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. జమ్మూకాశ్మీర్ అంతటా ఇంటర్ నెట్ ను నిలిపివేశారు. అలాగే ఫోన్ కాల్స్ కూడా వెళ్లడం లేదని తెలిసింది.
స్థానికులు తీసిన వీడియోల ప్రకారం.. రాత్రి ఆకాశంలో స్పష్టంగా లైట్లు కనిపిస్తున్నాయి. ఇవి భారత సాయుధ దళాల వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా క్షిపణులు, డ్రోన్లు అడ్డగిస్తున్నట్లు కనిపిస్తోంది.
భారత దళాలు కనీసం నాలుగు క్షిపణులు కూల్చివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉద్రిక్తత పరిస్థితులపై త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. తరువాత భారత ప్రధాని మోదీతో అజిత్ ధోవల్ భేటీ అయ్యారు.
నిలిచిపోయిన ఐపీఎల్
భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ ను నిలిపివేశారు. జమ్మూ ఎయిర్ పోర్ట్ పై పాకిస్తాన్ క్షిపణుల, డ్రోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉత్తర భారతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ధర్మశాల వేదికగా జరుగుతున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేశారు. ప్రస్తుతం మంచునగరంలో ఇప్పటికే అంధకారం అలుముకుంది.
పంజాబ్ జట్టు పది ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 122 పరుగులు చేసిన సమయంలో లైట్లు నిలిపివేశారు. మొదట ప్లడ్ లైట్లలో లోపం కారణంగా మ్యాచ్ ఆగిపోయిందని అనుకున్నారు. కానీ తరువాత స్టేడియంలోకి వచ్చిన భద్రతా సిబ్బంది ప్రేక్షకులను ఖాళీ చేయించారు.
ప్రభ్ సిమ్రాన్ సింగ్, 28 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. మరో ఒపెనర్ ప్రియాంశ్ ఆర్య 34 బంతుల్లో 70 పరుగులు చేసి టీ నటరాజన్ చేతికి చిక్కాడు. కాసేపటికే మ్యాచ్ నిలిచిపోయింది.
జమ్మూ పై దాడి
పాకిస్తాన్ దుస్సాహానికి దిగింది. భారత్ లోని పఠాన్ కోట్, జైసల్మేర్ లోని వాయుసేన స్థావరాలే లక్ష్యంగా దాడికి దిగింది. అయితే వీటిని ఎస్- 400 రక్షణ వ్యవస్థ దిగ్విజయం అడ్డుకుని కూల్చివేసింది. అలాగే జమ్మూలోని తొమ్మిది ప్రాంతాలపై ఆత్మాహుతి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది.
Live Updates
- 8 May 2025 11:54 PM IST
ఒకవైపు యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఫేక్ వార్తలు విజృంభిస్తున్నాయి. ఇందులో భాగంగానే లాహోర్ మీద దాడి.. తర్వాత తాజా దృశ్యాలు అంటూ మూడు నెలల క్రితం ప్లేన్ క్రాష్ ఫొటోలను కొందరు షేర్ చేస్తున్నారు.
- 8 May 2025 11:51 PM IST
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని.. భారతదేశం అంతటా... ప్రయాణీకులు సజావుగా చెక్-ఇన్, బోర్డింగ్ ఉండేలా.. షెడ్యూల్ చేసిన బయలుదేరే సమయానికి కనీసం 3 గంటల ముందు వారి సంబంధిత విమానాశ్రయాలకు చేరుకోవాలి: ఎయిర్ ఇండియా
- 8 May 2025 11:50 PM IST
ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. 20 కి.మీ పరిధిలోనే ఘటన జరగడంతో వెంటనే షరీఫ్ను వ్యక్తిగత సిబ్బంది సురక్షిత బంకర్లోకి తరలించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఈ రాత్రి గడిచేసరికి పాకిస్థాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు రక్షణ వర్గాలు చెబుతున్నాయి
- 8 May 2025 11:49 PM IST
పాకిస్తాన్ లోని పలు నగరాల్లో పేలుడు.. రహస్య ప్రాంతాలకు వెళ్లిపోయిన సైనిక అధికారులు
- 8 May 2025 11:47 PM IST
స్పైస్ జెట్ ట్రాఫిక్ మార్గదర్శకాలు
"అన్ని విమానాశ్రయాలలో మెరుగైన భద్రతా చర్యల దృష్ట్యా, ప్రయాణీకులు చెక్-ఇన్ మరియు బోర్డింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా నిష్క్రమణకు కనీసం 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు" అని ఎయిర్‌లైన్ ట్వీట్ చేసింది.
- 8 May 2025 11:44 PM IST
పాకిస్థాన్‌లో బ్లాక్‌ఔట్
పీఓకే, లాహోర్, కరాచీ, సియాల్‌కోట్, ఇస్లామాబాద్‌లో మొత్తం షట్‌డౌన్ చేయాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- 8 May 2025 11:43 PM IST
సరిహద్దు పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరిహద్దు రక్షణ దళాల డైరెక్టర్ జనరల్‌తో మాట్లాడారు. విమానాశ్రయ భద్రత గురించి ఆయన CISF DGతో కూడా మాట్లాడారు.
- 8 May 2025 11:38 PM IST
ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో పెరిగిన సైబర్ సెక్యూరిటీ ప్రమాదం. కీలక సూచనలు చేస్తున్న అధికారులు. ఎటువంటి వీడియో, మెసేజ్ లింక్‌లను ఓపెన్ చేయొద్దంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.