సియాల్ కోట్, లాహోర్ లపై ప్రతిదాడికి దిగిన భారత్
x
బ్లాక్ అవుట్ కారణంగా పంజాబ్ లో అలుముకున్న అంధకారం

సియాల్ కోట్, లాహోర్ లపై ప్రతిదాడికి దిగిన భారత్

త్రివిధ దళాధిపతులో భేటీ అయిన రాజ్ నాథ్, ప్రధానితో భేటి అయిన ధోవల్


ఆపరేషన్ సింధూర్ తరువాత ఉక్రోశంలో పాకిస్తాన్ దుస్సాహానికి దిగింది. ఈ రోజు పొద్దున్న15 నగరాలపై దాడులకు పాల్పడి చేతులు కాల్చుకున్న పాక్, రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో డ్రోన్లు, క్షిపణులతో భారత్ పైకి దాడికి దిగింది. ముఖ్యంగా జమ్మూలోని ఏడు ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించింది. ఆత్మాహుతి డ్రోన్లను పంపగా వాటిని సైన్యం న్యూట్రల్ చేసింది.

పాక్ చేస్తున్న ఈ ప్రతిదాడులతో భారత్ కూడా ఎదురుదాడికి దిగింది. పాకిస్తాన్ పంజాబ్ రాజధాని లాహోర్ సహ, సియాల్ కోట్ లపై క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది.

మోగిన సైరన్లు..

పాకిస్తాన్ క్షిపణులు ప్రయోగించగానే జమ్మూ నగరం మొత్త సైరన్ల మోత మోగింది. ఈ ప్రాంతం మొత్తం పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయి. దీనితో ప్రభుత్వం వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. జమ్మూకాశ్మీర్ అంతటా ఇంటర్ నెట్ ను నిలిపివేశారు. అలాగే ఫోన్ కాల్స్ కూడా వెళ్లడం లేదని తెలిసింది.

స్థానికులు తీసిన వీడియోల ప్రకారం.. రాత్రి ఆకాశంలో స్పష్టంగా లైట్లు కనిపిస్తున్నాయి. ఇవి భారత సాయుధ దళాల వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా క్షిపణులు, డ్రోన్లు అడ్డగిస్తున్నట్లు కనిపిస్తోంది.

భారత దళాలు కనీసం నాలుగు క్షిపణులు కూల్చివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉద్రిక్తత పరిస్థితులపై త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. తరువాత భారత ప్రధాని మోదీతో అజిత్ ధోవల్ భేటీ అయ్యారు.

నిలిచిపోయిన ఐపీఎల్

భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ ను నిలిపివేశారు. జమ్మూ ఎయిర్ పోర్ట్ పై పాకిస్తాన్ క్షిపణుల, డ్రోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉత్తర భారతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

ధర్మశాల వేదికగా జరుగుతున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేశారు. ప్రస్తుతం మంచునగరంలో ఇప్పటికే అంధకారం అలుముకుంది.

పంజాబ్ జట్టు పది ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 122 పరుగులు చేసిన సమయంలో లైట్లు నిలిపివేశారు. మొదట ప్లడ్ లైట్లలో లోపం కారణంగా మ్యాచ్ ఆగిపోయిందని అనుకున్నారు. కానీ తరువాత స్టేడియంలోకి వచ్చిన భద్రతా సిబ్బంది ప్రేక్షకులను ఖాళీ చేయించారు.

ప్రభ్ సిమ్రాన్ సింగ్, 28 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. మరో ఒపెనర్ ప్రియాంశ్ ఆర్య 34 బంతుల్లో 70 పరుగులు చేసి టీ నటరాజన్ చేతికి చిక్కాడు. కాసేపటికే మ్యాచ్ నిలిచిపోయింది.

జమ్మూ పై దాడి

పాకిస్తాన్ దుస్సాహానికి దిగింది. భారత్ లోని పఠాన్ కోట్, జైసల్మేర్ లోని వాయుసేన స్థావరాలే లక్ష్యంగా దాడికి దిగింది. అయితే వీటిని ఎస్- 400 రక్షణ వ్యవస్థ దిగ్విజయం అడ్డుకుని కూల్చివేసింది. అలాగే జమ్మూలోని తొమ్మిది ప్రాంతాలపై ఆత్మాహుతి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది.

పాకిస్తాన్ దాడులతో దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. జైసల్మీర్ లోని వైమానికి స్థావరం పైకి కూడా పాక్ ఆత్మాహుతి దాడులు చేశారు.
వీటిలో ఎంతమేర నష్టం జరిగిందనే విషయంలో స్పష్టత లేదు. సరిహద్దులో భారీ ఎత్తున దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతున్నాయి. సైరన్ల మోతలతో ఉత్తర భారతంలో గంభీర వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. భారత్ ధీటుగా బదిలిస్తోంది. ఇప్పటి వరకూ ఎనిమిది మిస్సైళ్లను కూల్చివేసింది.
పాకిస్తాన్ దాడుల కారణంగా ధర్మశాలలో జరగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ను నిలిచిపోయింది. బ్లాక్ అవుట్ కారణంగా నగరం మొత్తం అంధకారంగా మారడంతో వెంటనే ఐపీఎల్ మ్యాచ్ ను నిలిపివేశారు.



Live Updates

  • 9 May 2025 12:35 PM IST

    హిమాచల్ ప్రదేశ్‌లో బ్లాక్‌ఔట్ ప్రకటన

    పాకిస్థాన్‌తో ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ కీలక ప్రకటన చేసింది. బిలాస్‌పూర్‌లో బ్లాక్‌ఔట్ మార్గదర్శకాలను జారీ చేసింది. పౌరుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు.వైమానిక దాడి సంభవించినప్పుడు ప్రమాదాలను తగ్గించడానికి వారి వారి ప్రాంతాలలో పూర్తిగా బ్లాక్‌అవుట్ ఉండేలా చూసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్ రాహుల్ కుమార్ నివాసితులకు విజ్ఞప్తి చేశారు.

    పాకిస్తాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బిలాస్‌పూర్ సరిహద్దును పంచుకుంటుంది, సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌తో, దీనిని హై అలర్ట్‌లో ఉంచారు. పరిపాలన జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, బహిరంగ మరియు ఇండోర్ రెండింటిలోనూ అన్ని లైట్లు రాత్రి వేళల్లో ఆపివేయాలి, పౌరులు ఆశ్రయం ఉన్న ప్రదేశాలలో ఉండాలని మరియు అనవసరమైన ప్రయాణాలను నివారించాలని సూచించారు.

    ఏదైనా అత్యవసర పరిస్థితిలో భద్రతా దళాల సజావుగా పనిచేయడానికి రాత్రిపూట వాహనాల రాకపోకలను నిలిపివేయాలని అడ్వైజరీ తెలిపింది. “ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ అడ్వైజరీ జారీ చేయబడింది. అన్ని నివాసితుల నుండి పరిపాలన కఠినమైన సమ్మతిని అభ్యర్థిస్తుంది. అటువంటి పరిస్థితులలో సంయమనం మరియు అప్రమత్తత బలమైన కవచాలు” అని అది పేర్కొంది. ఇంతలో, ఉనా జిల్లాలో శుక్రవారం అన్ని విద్యా సంస్థలు మూసివేయబడ్డాయి, దీని కోసం గురువారం రాత్రి ఆలస్యంగా నోటిఫికేషన్ జారీ చేయబడింది.

  • 9 May 2025 12:27 PM IST

    క్షతగాత్రులను పరామర్శించిన సీఎం ఒమర్ అబ్దుల్లా

    పాకిస్థాన్ దాడుల్లో గాయాలైన వారిని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరామర్శించారు. పూంచ్ ప్రాంతంలో పాకిస్థాన్ దాడుల్లో గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అధికారులు. వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఒమర్.. అధికారులకు ఆదేశాలిచ్చారు.

  • 9 May 2025 12:24 PM IST

    ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు అజయ్ బంగా భేటీ అయ్యారు.

  • 9 May 2025 12:21 PM IST

    సైన్యానికి మద్దతుగా కాంగ్రెస్ ‘తిరంగ యాత్ర’

    దేశ సాయుధ దళాల మనోధైర్యాన్ని పెంచడానికి ఒడిశా కాంగ్రెస్ శుక్రవారం ఇక్కడ 'తిరంగ యాత్ర' చేపట్టింది.

    ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (OPCC) అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ నేతృత్వంలోని నాయకులు రామ్ మందిర్ స్క్వేర్ నుండి మాస్టర్ క్యాంటీన్ స్క్వేర్ వరకు త్రివర్ణ పతాకాన్ని మోసుకెళ్లారు.

    "మా సాయుధ దళాలు పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇస్తున్నాయి. వారు (పాకిస్తాన్) భారతదేశం యొక్క మనోధైర్యం మరియు బలం ముందు నిలబడలేరు" అని దాస్ నొక్కి చెప్పారు.

    రాష్ట్ర ఇన్‌చార్జ్ అజయ్ కుమార్ లల్లు, CLP నాయకుడు రామ చంద్ర కదమ్, ఎమ్మెల్యేలు రమేష్ జెనా మరియు సోఫియా ఫిర్దౌస్‌తో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ర్యాలీలో పాల్గొని సాయుధ దళాలను కీర్తిస్తూ నినాదాలు చేశారు.

    అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదంపై యుద్ధంలో ప్రభుత్వానికి అన్ని మద్దతును అందిస్తోంది అని ఆయన అన్నారు.

    "మా దళాలు ఉగ్రవాదులను శాశ్వతంగా నిర్మూలించడానికి కృషి చేస్తున్నాయి. మేము వారితో నిలబడతాము. నిన్న, మా సైనికులను గౌరవించటానికి మేము రక్తదాన శిబిరాన్ని నిర్వహించాము. ఈ రోజు, మేము 'తిరంగ యాత్ర' నిర్వహించాము" అని దాస్ అన్నారు.

  • 9 May 2025 12:19 PM IST

    రక్షణ కార్యకలాపాల రియల్ టైమ్ రిపోర్టింగ్ నుండి మీడియా సంస్థలను దూరంగా ఉంచాలని కేంద్రం కోరింది.

  • 9 May 2025 12:18 PM IST

    తరలి వెళ్తున్న జమ్మూకశ్మీర్ వాసులు

    జమ్మూకశ్మీర్‌లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. సరిహద్దులో భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. బోర్డర్ ప్రాంతాలంతా బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్న క్రమంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • 9 May 2025 12:15 PM IST

    ఫేక్ న్యూస్‌ను పట్టించుకోవద్దు: అసోం సీఎం

    భారత్, పాక్ మధ్య పరిస్థితులు మరింత తీవ్రతరం అయిన నేపథ్యంలో ఫేక్ న్యూస్ విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కీలక సూచన చేశారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫేక్ న్యూస్‌ను పట్టించుకోవద్దని, అలాంటి వాటిని తిరస్కరించాలని కోరారు. సాయుధ దళాలను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్న వారిపై నివేదిక ఇవ్వాలని ప్రజలను కోరారు. "స్వార్థ ప్రయోజనాల నుండి వచ్చే నకిలీ వార్తలను తిరస్కరించాలి. అధికారిక మార్గదర్శకాలను పాటించాలి’’ అని హిమంత బిస్వా శర్మ శుక్రవారం ప్రజలను కోరారు.

    ‘‘ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ఐక్యంగా ఉన్నందున, బాధ్యతాయుతమైన పౌరులుగా, స్వార్థ ప్రయోజనాల నుండి వచ్చే నకిలీ వార్తలను తిరస్కరించండి, మన సాయుధ దళాలను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్న వారిపై నివేదిక ఇవ్వండి, అధికారిక మార్గదర్శకాలను పాటించండి. జై హింద్ (sic)’’ అని శర్మ Xలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

    ముందుగా, జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి మరియు పంజాబ్‌లోని జలంధర్‌లో డ్రోన్ దాడి గురించి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ చేసిన వాదనలను "నకిలీ కొత్తవి" అని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.

  • 9 May 2025 12:12 PM IST

    జమ్మూలో ఏడుగురు ఉగ్రవాదులు హతం

    జమ్మూకశ్మీర్‌లో బీఎస్ఎఫ్ బలగాలు ఏడుగురు ఉగ్రవాదులను హతం చేసింది. సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు దాడులు చేశాయి. వీటిలో ఏడుగురు చొరబాటుదారులు మరణించారు. ఈ ఘటన సంబ సెక్టార్‌లో జరిగింది. ఆ ప్రాంతంలో పెద్ద ఉగ్రవాద గ్రూప్.. ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నానికి పాకిస్థాన్ ఆర్మీ మరోవైపు కాల్పులు జరుపుతూ మద్దతు ఇస్తందుని బీఎస్‌ఎఫ్ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

    ‘‘చొరబాటుదారులను అడ్డుకునే క్రమంలో ఏడుగురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. ఈ కాల్పుల్లో ధాందర్ పోస్ట్‌కు తీవ్ర డ్యామేజ్ అయింది’’ అని అధికారి పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ థర్మల్‌ను ధ్వంసం చేసిన క్లిప్‌ను కూడా బీఎస్ఎఫ్ షేర్ చేసుకుంది.

  • 9 May 2025 12:03 PM IST

    ఢిల్లీలోని కీలకమైన ప్రాంతాల్లో భారీ భద్రత

    డ్రోన్‌లు, మిస్సైళ్లతో గురువారం రాత్రి పాకిస్థాన్ దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచేసింది రాష్ట్ర ప్రభుత్వం. ‘ప్రభుత్వ భవనాలు, నీటి శుభ్రత ప్లాంట్‌లు, కోర్ట్‌లు, విదేశీ అంబెసీల ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నాం. అదనపు బలగాలు, పారామిలిటరీ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం’’ అని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. పోలీసులు కూడా రైల్వే స్టేషన్లు, మాల్స్, పార్క్‌లు, మెట్రో స్టేషన్‌ల దగ్గర అధిక భద్రతను కల్పిస్తున్నారు. రాత్రి సమయంలో చేపట్టి గస్తీలను కూడా మరింత అధికం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సెన్సిటివ్ ప్రాంతాలను మరింత నిశితంగా పరీశిలిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • 9 May 2025 11:38 AM IST

    రాజస్థాన్ జైసల్మీర్‌లో ప్రొజెక్టయిల్ లాంటి వస్తువు ఒకటి లభించింది. భద్రతా బలగాలు, పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వస్తువు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.


Read More
Next Story