ఆర్ఆర్‌పై ఎస్‌ఆర్‌హెచ్ గెలిచే అవకాశమెంత..!
x

ఆర్ఆర్‌పై ఎస్‌ఆర్‌హెచ్ గెలిచే అవకాశమెంత..!

తమ జట్టే కప్పు కొడుతుందని సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు వెటోరీ.


ఐపీఎల్ టైటిల్ కోసం పది జట్లు హోరాహోరీగా తలపడటానికి సిద్ధమవుతున్నాయి. ప్రతి జట్టు లక్ష్యం ఒక్కటే.. కప్పును ఇంటికి తీసుకెళ్లడం. ఇందులో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు జరిగిన 17 సీజన్లలో అత్యధికంగా కప్పుకు కొట్టాయి. 2012లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ ఒకే ఒక్కసారి టోర్నీ ఛాంపియన్‌గా నిలిచింది. ఎంట్రీ ఇచ్చి నాలుగో సంవత్సరం 2016వ ఎడిషన్‌లో ఐపీఎల్ ఛాంపియన్‌గా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచింది. కాగా ఆ తర్వాత రెండే రెండు సార్లు రన్నరప్‌గా నిలిచింది. అతి తక్కువ సార్లు సెమీస్‌కు కూడా చేరింది. అయితే ఈ సారి మాత్రం తమ జట్టే కప్పు కొడుతుందని సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు వెటోరీ.

ఈసారి మరింత బలంగా తమ జట్టు మైదానంలోకి దిగనుందని, ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో తమ ప్లేయర్లు దుమ్ముదులిపేస్తారని అన్నాడు. ఇషాన్ కిషన్‌ చేరడంతో బ్యాటింగ్ బలోపేతమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్స్ కానున్నారని, ఇషాన్ కిషన్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడని వెటోరీ చెప్పాడు. గాయాలతో కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న ప్యాట్ కమ్మిన్స్, నితీష్ కుమార్ ఇప్పుడు మళ్ళీ నెట్స్‌లో తమ బంతికి పదును పెడుతున్నారని, ఆదివారం మైదానంలో వారి బంతి విసురుకు ప్రత్యర్థులు అల్లాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ జట్టు చాలా స్ట్రాంగ్‌గానే కాకుండా స్మార్ట్‌గా కూడా ఉందన్నాడు. బౌలింగ్ విభాగంలో షమీ, హర్షల్ పటేల్, పాట్ కమ్మిన్స్, నితీష్ కుమార్ రెడ్డి కీలకంగా ఉన్నారని చెప్పాడు. గత సీజన్‌లో చేసిన తప్పిదాలను ఈసారి రిపీట్ చేసే ప్రసక్తే లేదన్నాడు వెటోరి.

ఇదిలా ఉంటే ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటి వరకు 57 మ్యాచ్‌లు ఆడగా వాటిలో 35 మ్యాచ్‌లలో విజయం సాధించింది. దీంతో హోమ్ గ్రౌండ్స్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు విజయావకాశాలు ఉన్నాయంటున్నారు. అదే సమయంలో ఉప్పల్ స్టేడియంలో అధికంగా ఛేజింగ్ టీమ్ గెలుస్తుంటుంది. ఉప్పల్ స్టేడియంలో ఇప్పటి వరకు ఒక టీమ్ చేసిన అత్యధిక స్కోర్‌ కూడా ఎస్ఆర్‌హెచ్ టీమే. 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లో కోల్పోయి 277 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ఈ స్టేడియంలో మొత్తం 77 మ్యాచ్‌లు జరిగితే వాటిలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు కేవలం 34 మ్యాచ్‌లలో గెలిచాయి. చేజింగ్ చేయడానికి వచ్చిన జట్లు 42సార్లు గెలిచాయి. ఒక్క మ్యాచ్ టై అయింది.

ఇక ఆర్ఆర్, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య చూసుకుంటే.. సన్‌రైజర్స్‌తో తలపడిన ఆఖరి మూడు గేమ్స్‌లో కూడా రాజస్థాన్ ఓటమిపాలయింది. అదే విధంగా హైదరాబాద్‌లో ఆడిన చివరి ఐదు మ్యాచ్‌లలో కూడా ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది. దాంతో పాటుగా ఆర్ఆర్ బౌలింగ్ చాలా వీక్‌గా ఉంది. అదే సమయంలో ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వీటి ప్రకారం చూసుకుంటే రేపు ఆర్ఆర్‌పై జరిగే మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు విజయావకాశాలు అధికంగా ఉన్నాయనిపిస్తోంది.

Read More
Next Story