IPL | నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
x

IPL | నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది.v


నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది. ఈ సీజన్ లోనే తొలి టై అయిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే ఈ మ్యాచ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడం విశేషం. రెండు జట్లు సమానంగా స్కోర్స్ చేయడంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఈ కీలక ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 6 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్ 4 బంతుల్లో 13 పరుగులు చేసి విజయాన్ని చేజిక్కించుకుంది.
మ్యాచ్ టై ఎలా అయిందంటే...
తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్‌ టై అయింది. నిబంధల ప్రకారం సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వచ్చింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత రాజస్థాన్‌ 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 4 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది.
అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మ‌ధ్య బుధవారం రాత్రి మ్యాచ్ జరిగింది. మ్యాచ్ విజేతను సూప‌ర్ ఓవ‌ర్‌ నిర్ణయించింది. ఈ ఉత్కంఠ‌పోరులో ఢిల్లీ విజ‌యం సాధించింది.
సూపర్‌ ఓవర్‌లో రాజస్థాన్‌ తొలి బంతి - డాట్ బాల్ పడింది. రెండో బంతిని హెట్‌మయర్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి సింగిల్ తీశాడు. నాలుగో బంతికి రియాన్ పరాగ్ (నో బాల్) ఫోర్‌ కొట్టాడు. నాలుగో బంతికి పరాగ్ రనౌట్ కాగా జైస్వాల్ వచ్చి ఐదో బంతికి ఒక పుగు చేసి రనౌట్ అయ్యారు.
ఆ తర్వాత రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ వేసిన సూపర్ ఓవర్ ొలి బంతికి కేఎల్ రాహుల్ 2 పరుగులు చేశారు. రెండో బంతికి రాహుల్ ఫోర్, మూడో బంతికి సింగిల్ తీశారు. నాలుగో బంతిని స్టబ్స్ బౌండరీ దాటించి 6 రన్స్ కొట్టడంతో ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ జట్లు ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో రాజ‌స్తాన్ కూడా 4 వికెట్లు కోల్పోయి స‌రిగ్గా 188 ప‌రుగులు చేసింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో రాజ‌స్తాన్ విజ‌యానికి 9 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌వ్వ‌గా.. మిచిల్ స్టార్క్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవ‌లం 8 ప‌రుగులిచ్చాడు.

అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. దీంతో మ్యాచ్ ఫ‌లితాన్ని తేల్చడానికి అంపైర్‌లు సూప‌ర్ ఓవ‌ర్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో రాజ‌స్తాన్ కూడా 4 వికెట్లు కోల్పోయి స‌రిగ్గా 188 ప‌రుగులు చేసింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో రాజ‌స్తాన్ విజ‌యానికి 9 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌వ్వ‌గా.. మిచిల్ స్టార్క్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవ‌లం 8 ప‌రుగులిచ్చాడు.
రాజస్థాన్ రాయల్స్ స్కోర్స్ ఇలా...
189 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు రాజస్థాన్‌.. జైశ్వాల్‌ (51), సంజు శాంసన్‌ (31) మంచి శుభారంభం ఇచ్చారు. అయితే శాంసన్‌ రిటైర్డ్‌ హర్ట్‌ కావడంతో వచ్చిన రియాన్‌ పరాగ్‌ (8) స్వల్ప స్కోర్‌కు పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్‌ రాణా (51)తో జట్టు కట్టిన జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇద్దరు బ్యాటర్లు బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఈక్రమంలో 112 పరుగుల వద్ద జైస్వాల్‌ ఔటైనప్పటికీ నితీశ్‌ దూకుడుగా ఆడాడు. 161 పరుగుల వద్ద మూడో వికెట్‌గా నితీశ్‌ పెవిలియన్‌ చేరాడు. చివరి రెండు ఓవర్లలో ఆ జట్టు విజయానికి 23 పరుగులు అవసరం కాగా 19వ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం 6 బంతుల్లో 9 పరుగులుగా మారింది. చివరి ఓవర్లో స్టార్‌ 8 పరుగులే ఇవ్వడంతో మ్యాచ్‌ టై అయింది.
తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. అభిషేక్‌ పోరెల్‌ (49: 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌), కేఎల్‌ రాహుల్‌ (38: 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్‌ (34: 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (14: బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 2, తీక్షణ, హసరంగ ఒక్కో వికెట్‌ తీశారు.
చివరి నిమిషం వరకు రాజస్థాన్ రాయల్స్ ను ఊరించిన విజయం చివర్లో ఒక్కసారిగా చేజారింది.
Read More
Next Story