ఆయుధంలాంటి మనిషి కవిత్వ సంపుటి ఆవిష్కరణ
x

'ఆయుధంలాంటి మనిషి' కవిత్వ సంపుటి ఆవిష్కరణ

సాహితీ స్రవంతి, కడప శాఖ ఆధ్వర్యంలో 20వ తేదీన సి.పి. బ్రౌన్ గ్రంథాలయం లో


ప్రముఖ కవి, ఏఎస్పీ లోసారి సుధాకర్ రచించిన 'ఆయుధంలాంటి మనిషి' కవిత్వ సంపుటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని సాహితీ స్రవంతి, కడప శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ, బుధవారం, సాయంత్రం 5:30 గంటలకు కడపలోని సి.పి. బ్రౌన్ గ్రంథాలయం, ఎర్రముక్కపల్లిలో నిర్వహిస్తున్నట్లు సాహితీ స్రవంతి కన్వీనర్ లెనిన్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.


సాహితీ స్రవంతి, కడప శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిళ్లా కుమారస్వామి అధ్యక్షత వహిస్తారు.

ప్రముఖ సాహితీ విమర్శకులు, విశ్రాంత ఆచార్యులు డా. మేడిపల్లి రవికుమార్ పుస్తకాన్ని ఆవిష్కరించి, సమీక్షను అందిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్, ఆత్మీయ అతిథిగా సీనియర్ న్యాయవాది, అంబేద్కర్ మిషన్ ఛైర్మన్ సంపత్ కుమార్ హాజరవుతారు.

పుస్తక రచయిత శ్రీ లోసారి సుధాకర్ తన స్పందనను తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి సాహితీప్రియులు, కవులు, రచయితలు, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నిర్వాహకులు కోరారు.


Read More
Next Story