
నందిపల్లిలో జగన్ సందడి- చిత్రమాలిక
నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో జగన్ సందడి చేశారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 25న వేంపల్లె మండలం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని సందడి చేశారు.
వేంపల్లె మండలం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ (శ్రీ పార్వతీ దేవి సమేత మహా నందీశ్వర స్వామి వారు), కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు.
ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో సంప్రదాయ దుస్తులతో పాల్గొన్నారు.
స్వామివారికి భక్తిశ్రద్దలతో అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం వేదపండితుల ఆశీర్వచనం స్వీకరించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుందన్నారు.
నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ ఛైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డిని, కమిటీ సభ్యులను అభినందిస్తూ, ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని అన్నారు.

