ఆంధ్రులు ఎవరు? తెలుగు వారి భాష కాదా?
x

ఆంధ్రులు ఎవరు? తెలుగు వారి భాష కాదా?

మగధ నుంచి శ్రీలంక వరకు ఎక్కడెక్కడి ప్రాంతాలను పాలించినా అక్కడి సంస్కృతిని గౌరవించారనే చరిత్ర చెబుతోంది. మెగాస్తనీసు రాసిన ఇండికా కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది..


"తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా ..మన భాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా …. వచ్చాడన్నా … ఆ …..
వచ్చిండన్నా …. వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా …
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది.
మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం వెలసింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలు బండ్లకెత్తినా
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం . ఐదు కోట్ల తెలుగువారిది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్ కి జై
గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం .. వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు..."

ఈ ఒక్క పాట చాలు మన తెలుగు జాతి రొమ్ము విరుచుకుని తిరగడానికి. తెలుగు జాతి ఎక్కడెక్కడున్నా వాళ్లంతా ఆంధ్రులే. సుదీర్ఘ చరిత్ర, సంస్కృతీ, సంప్రదాయం వారి సొంతం. క్రీస్తు పూర్వం 150 ఏళ్ల నాటికిందటే ఆంధ్ర పదం ఉందంటే మనకు వళ్లు పులకరిస్తుంది. ఒక ప్రత్యేక జాతికి ఉపమానంగా ఆంధ్ర అనే పదం ఉంది. దాని భాషే ఆంధ్ర భాష. గోదావరి పెన్నా నదుల మధ్య కొంత మందితో సహా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో వ్యాపించి ఉండేవారు. ఐతరేయ బ్రాహ్మణంలో కూడా ఆంధ్ర జాతి ప్రస్తావన ఉంది. క్రీస్తుపూర్వం సుమారు 251 ప్రాంతంలో సిముకుడితో మొదలై పాట్నా నుంచి కాంచీపురం వరకు విస్తరించిన ఆంధ్ర శాతకర్ణుల పాలన నుంచి నేటి వరకు ఆంధ్రులకి దురాగతాలు తెలియవనే నానుడి ఉంది. మగధ నుంచి శ్రీలంక వరకు ఎక్కడెక్కడి ప్రాంతాలను పాలించినా అక్కడి సంస్కృతిని గౌరవించారనే చరిత్ర చెబుతోంది. మెగాస్తనీసు రాసిన ఇండికా కూడా ఆంధ్రుల గురించి ఎంతో గొప్పగానే వర్ణించింది. ఆంధ్రుల గొప్పతనం రూమ్ వరకు వ్యాపించిందంటే అతిశయోక్తి కాదు. కళింగ దేశము దక్షిణంగా అంటే సర్కారు జిల్లాలు, కోస్తా ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ అనేవారు. ఇప్పుడు నైజాం ఆంధ్ర అంటే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర అనేవారన్న మాట లేకపోలేదు. బర్మా దేశ చరిత్రను పరిశీలిస్తే కోస్తా నుంచి అక్కడికి వెళ్లి నివసించిన వేలాది మందిని తిలింగలు అనేవారు. ఇప్పటి నైజామాంధ్ర, రాయలసీమలను కలిపి ఆంధ్ర అనేవారు. తెలుగు భాష మొదటగా ఆంధ్ర భాష. నాలుగవ శతాబ్దం నాటికి బుద్ధుడి బౌద్ధ గ్రంథంలోని త్రిపీటకాలకి ప్రకారం ఆంధ్ర, తమిళ అనేవారున్నట్టు ప్రస్తావన ఉంది. ఆంధ్ర భాషలో శాసనాలు ఆరో శతాబ్దం నుంచి దొరుకుతున్నాయి. తెలుగు ఆంధ్ర అనేవి పర్యాయపదాలుగా మారాయి. ఇప్పుడు ఆంధ్ర అనేది రాష్ట్రం పేరులో తప్ప మిగలలేదు. కొంతమంది వేర్పాటు వాదులు అదేదో తప్పుడు పదం అనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. 'పలుకు నుడికారము ఆంధ్ర భాష ఎందరు' అని నన్నయ్య రాస్తే ఆంధ్రా వాలి మొదరయ్య అని తిక్కన రాశాడు. శాతవాహనుల తర్వాత ఆంధ్రాని పల్లవులు, చాళుక్యులు, ఇక్ష్వాకులు, సేలం కాయనులు, దుర్జేయులు, చోళులు, యాదవులు, హైహైలు, తెలుగు చోళులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, దేవరకొండ రాచకొండ నాయకులు, రెడ్డి రాజులు, కళింగ గజపతులు, బహమనీలు, కుతుబ్షాహీలు, మొగలులు, అసఫ్జాహీలు, విజయనగర రాజులు, మైసూరు దండ నాయకులు, యూరోపియన్లు ఎందరో పరిపాలించారు. 1724లో ఢిల్లీ సింహాసనం మీద తిరుగుబాటు చేసిన నిజాములు డక్కన్ సామ్రాజ్యానికి బీజం వేశారు. షికాకోల్ అంటే శ్రీకాకుళం నుంచి మధురై దాకా పరిపాలించారు. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి శాతవాహనులు, కాకతీయులు, బహమనీయులు, కుతుబ్షాహీలు మొగలు అసఫ్జాహీ నిజాంల వరకు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రులందరూ కష్టజీవులు. అసఫ్జాహీల ఆఖరి పరిపాలనా కాలంలో దుష్ట పాలన వల్ల అతి దారుణమైన భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ వల్ల సాంస్కృతికంగా సామాజికంగా కూడా హైదరాబాదుకు కోస్తా రాయలసీమకి తేడాలు వచ్చాయి. అసఫ్జాహీలు ఆక్రమించిన కోస్తా.. మరల ఫ్రెంచ్ ఇంగ్లీష్ అసఫ్జాహీల మధ్య యుద్ధాలతో నలిగిపోయింది. అక్కడి ప్రజల కష్టాలు అనుభవించారు. అదే సమయానికి నైజాం ఆంధ్ర ప్రాంతం మాత్రం గొడవలతో సంబంధం లేకుండా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా ఉత్తర సర్కారు జిల్లాలు, కామ ముర్తజనగర్ అంటే కొండపల్లి విజయవాడ ముస్తఫా నగర్ అంటే గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం సర్కార్లు దత్త మండలాలు అంటే రాయలసీమ బళ్ళారి కడప కర్నూలు అనంతపురం ప్రాంతాలు యూరోపియన్ల ఆధీనంలోకి వచ్చాయి. నిజాం ప్రాంతం మాత్రం ఫ్యూడల్ పరిపాలనలో ఉండిపోయింది. నిజాం పరిపాలనలో కొంతమంది భూస్వాములు పెత్తందారి పోకడలు పోయారు. మన భాష సంస్కృతి అభివృద్ధి ఢిల్లీలో అయినా గల్లీలో అయినా ఒకటే. కోస్తా ఆంధ్ర రాయలసీమ నైజాం ఆంధ్ర ప్రజలు స్వతహాగా కష్టజీవులు. వ్యవసాయం చేసేవారు. మన భాష సంస్కృతి అభివృద్ధిలో అంతా ఒకటే.
ఇంతటి సాంస్కృతిక వారసత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ గత 60,70 ఏళ్లలో అనేక రూపాలు సంతరించుకుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి 1953లో ఆంధ్ర రాష్ట్రంగా అవతరించింది.ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ గా మారింది. 2014లో విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా మారాయి.
Read More
Next Story