వైరల్ పెంగ్విన్ స్టోరీ: ప్రాణం పోయినా తోడు వీడని 15 మూగజీవాలు!
x

వైరల్ పెంగ్విన్ స్టోరీ: ప్రాణం పోయినా తోడు వీడని 15 మూగజీవాలు!


సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన ఓ పెంగ్విన్ జంట వీడియో అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తించింది. ప్రేమ, నిబద్ధత, నిస్వార్థత వంటి విలువలకు జంతువులు కూడా పరిపూర్ణ ఉదాహరణలని ఈ వీడియో చాటిచెప్పింది. "పెంగ్విన్ భాగస్వామి చనిపోయాక, మిగిలినవాడు తన సమూహాన్ని వదిలి ఒంటరిగా మరణాన్ని ఆలింగనం చేసుకున్నాడు" అనే ఈ క్లిప్ నెటిజన్లను కదిలించింది. దీంతో “జీవితాంతం ఒకే భాగస్వామితో ఉండే జంతువులు” అనే అంశం చర్చనీయాంశమైంది.

పెంగ్విన్

పెంగ్విన్లు సాధారణంగా పెద్ద సమూహాల్లో జీవిస్తాయి. అక్కడే అవి తమ భాగస్వామిని ఎంచుకుంటాయి. గుడ్డును పెట్టి ఆడ పెంగ్వవిన్ వెళ్లిపోతే ఆ గుడ్డును పొదిగి, పిల్లగా మార్చే బాధ్యత మగ పెంగ్విన్‌దే. మేటింగ్ తర్వాత.. తల్లి వేటకు వెళ్లిపోతుంది. మళ్ళీ సీజన్ మారి తల్లి పెంగ్విన్ వచ్చే వరకు.. గుడ్డును మగ పెంగ్వినే కంటికి రెప్పలా నిద్రాహారాలు మానుకుని కాపాడుతుంది. గజగజలాడే చలిలో అతి జాగ్రత్తగా గుడ్డుకు కావాల్సిన వేడి ఉండేలా చూసుకుంటుంది. ఆడ పెంగ్విన్ తిరిగి వచ్చే సమయానికి మగ పెంగ్విన్ ఆహారం లేక.. సన్నబడి, బక్కపల్చగా మారుతుంది.

అప్పటి నుంచి పిల్లను ఆడ, మగ పెంగ్విన్‌లు విడతల వారీగా చూసుకుంటూ పోషించుకుంటాయి. అంతేకాదండోయ్.. ప్రతి సీజన్‌లో ఆడ పెంగ్విన్ తన పార్ట్‌నర్‌ను కేవలం గొంతు ఆధారంగానే గుర్తిస్తుంది. ఒకవేళ భాగస్వామి చనిపోతే మిగిలిన పెంగ్విన్.. తన గ్రూప్‌ నుంచి తప్పుకుని.. దూరంగా వెళ్లిపోయి.. నిరాహార దీక్ష తీసుకుని మరణిస్తుంది. దానికి సంబంధించిన వీడియోనే ఇటీవల వైరల్ అయింది.

2. తోడేళ్లు

ఇవి జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటాయన్నది వినడానికి విచిత్రంగా అనిపించినా.. అదే నిజం. యానిమల్ కింగ్‌డమ్‌లో ది బెస్ట్ లీడర్‌గా కూడా తోడేళ్లే నిలుస్తాయి. ఇవి గుంపులుగా జీవిస్తాయి. ఆ గుంపులో నాయకత్వం వహించే ఆడ, మగ తోడేళ్లు జీవితాంతం కలిసే ఉంటాయి. భాగస్వామిని ఎన్నుకున్న తర్వాత పిల్లల సంరక్షణ మొత్తం సమూహ సహకారంతో సాగుతుంది. ఇది వ్యక్తిగత ప్రేమ కథ కంటే కుటుంబ వ్యవస్థగా మారుతుంది. వేటాడటం, ప్రాంతాన్ని రక్షించడం, పిల్లలకు ఆహారం అందించే బాధ్యతలను సమూహంలోని అన్నీ కలిసి స్వీకరిస్తాయి. ఇవి కూడా తమ భాగస్వామి చనిపోతే.. జీవితాంతం ఒంటరిగా ఉంటూ తమ గుంపు కోసమే పనిచేస్తాయి తప్ప మరే భాగ్వామిని అంగీకరియవు.

3. బార్న్ ఔల్స్

బార్న్ ఔల్స్(గుడ్లగూబలు) రాత్రి వేటాడే పక్షులుగా ప్రసిద్ధి. ఇవి పల్లెల్లో, వ్యవసాయ భూముల్లో నివసిస్తాయి. భాగస్వామిని ఎన్నుకున్న తర్వాత ఇవి జంటగా ఒకే ప్రాంతంలో స్థిరపడతాయి. పిల్లలు పుట్టినప్పుడు బాధ్యతలు స్పష్టంగా పంచుకుంటాయి. మగ ఔల్ ఆహారం తెస్తుంది. ఆడ ఔల్ పిల్లలను గూడు వద్ద కాపాడుతుంది. ఈ సహకారం వల్లే పిల్లలు బతికే అవకాశం పెరుగుతుంది. అందుకే వీటిలో దీర్ఘకాల బంధాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

4. కొంగలు

కొంగలు సాధారణంగానే ఒక్క పార్ట్‌నర్‌ను మాత్రమే కలిగి ఉండే జాతిగా గుర్తింపు పొందాయి. ఇవి ఒకసారి భాగస్వామిని ఎంచుకున్న తర్వాత జీవితాంతం జతగా కలిసి ఉంటాయి. భాగస్వామిని ఎంపిక చేసుకునే సమయంలో ప్రత్యేకమైన నృత్యాల ద్వారా తమ బంధాన్ని బలపరుస్తాయి. గుడ్లు పెట్టిన తర్వాత తల్లిదండ్రులిద్దరూ కలిసి గూడు కాపాడటం, గుడ్లను వేచ్చగా ఉంచటం, పిల్లలను పెంచటం వంటి బాధ్యతలను పంచుకుంటాయి. అయితే ఒక భాగస్వావి మరణిస్తే పిల్లల సంరక్షణ వంటి కారణాలతో కొత్త జత ఏర్పడే అవకాశాలు ఉన్నా అవి చాలా అరుదుగా జరుగుతాయని పక్షి శాస్త్రజ్ఞుడు జాన్‌-డీ-లీవర్ వివరించాడు.

5. బ్లాక్ వల్చర్స్

ఇవి భాగస్వామిని ఎంచుకున్న తర్వాత చాలా కాలం ఒకే జతగా ఉంటాయి. ఇవి గుంపులుగా జీవించినా జతను మాత్రం మర్చిపోవు. పిల్లల విషయంలో ఇద్దరూ కలిసి కాపాడుతాయి. ఆహారం తెచ్చి పిల్లలను పెంచడంలో భాగస్వామ్యం కీలకం. భాగస్వామి చనిపోతే కొత్త జత ఏర్పడటం చాలా అరుదుగా కనిపిస్తుందని పరిశీలనలు చెబుతున్నాయి. కొన్ని వల్చర్స్ ఒంటరిగా ఉండిపోతాయి.

ఇంకా ఎన్నో జీవులు..

అద్భుతమైన విజ్ఞానం కలిగిన జంతు ప్రపంచం మనకు ప్రేమ, నిబద్ధత, బాధ్యతల గురించి ఎన్నో మార్గాల్లో బోధిస్తుంది. అల్బాట్రాస్, బాల్డ్ ఈగిల్స్, హంసలు వంటి పక్షులు మాత్రమే కాదు, బీవర్లు, గిబ్బన్స్, సీహార్స్, ఫ్రెంచ్ ఏంజెల్ ఫిష్‌లు, మాకోస్ వంటి జంతువులు కూడా జీవితాంతం ఒకే భాగస్వామిని కలిగి ఉంటాయి.

Read More
Next Story