హారప్పాలో కొత్త యుగోదయం
x

Source: Krishna Culture

హారప్పాలో కొత్త యుగోదయం

ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 25 మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి


-బేతి పాణిగ్రాహి

ప్రజల్లో కృష్ణుడి పట్ల భక్తిప్రపత్తులు అధికమైనాయి. మరోవైపు భక్తిఉద్యమం పేరున ఒక కొత్త తాత్వికశాఖ వేళ్ళూనుకోసాగింది. వ్యక్తిగత భక్తి యొక్క శక్తిని, దైవం పట్ల ప్రేమని ఉద్ఘాటించిన ఈ తాత్వికధోరణి కఠినమైన సాంఘిక అంతస్తులను, వర్ణవ్యవస్థను తిరస్కరించింది.

“దైవత్వం మనలోనే వున్నది.. దానితో మనల్ని అనుసంధానించే వారధియే ప్రేమ..” అని ప్రవచించింది ప్రగాఢ కృష్ణభక్తురాలు మీరాబాయి.

“ హిందూ, బౌద్ధమతాల బోధనలు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక విమోచన విషయంలో మనకు మార్గం చూపాయి,” అన్నాడు సాధుపుంగవుడు రామకృష్ణ పరమహంస. “ ప్రేమ, కరుణలే అత్యున్నత గుణాలని, సమస్త ప్రాణుల్లో దైవత్వాన్ని చూడాలని మనం వీటి ద్వారా నేర్చుకున్నాం.”

ఈ బోధనలు సమ్మిళితత్వం, కారుణ్యం, ఆధ్యాత్మికవిముక్తి పట్ల గురి కుదిరిన ప్రజల్ని బాగా ఆకర్షించాయి. సమ్మోహన శక్తి గల సాధువులు, కవి గాయకులు అన్ని ప్రాంతాలు పర్యటించారు, ప్రేమాస్పదుడైన, కరుణామయుడైన దేవుడి గురించిన తమ జ్ఞానాన్ని అందరితో పంచుకున్నారు.

“భగవంతుడు ఎక్కడో ఉన్నాడన్న భావన సరికాదు.. ఆయన మన హృదయాల్లో సజీవంగా వున్నాడు “, అన్నాడు కవి కబీర్. “ దేవుడి అస్తిత్వాన్ని ప్రతి శ్వాసలో ప్రతి క్షణం అనుభవిస్తాము. ఈ అస్తిత్వమే, మన బాహ్య విభేదాలకు అతీతంగా, మనల్ని ఐక్యం చేస్తున్నది.”

ఈ కొత్త భక్తితత్వం బాగా ప్రచారమైంది; హిందువులు, బౌద్ధులు, జైనులు సహా అన్ని రంగాల ప్రజల్ని ఆకర్షించింది. దీని సమ్మిళితత్వ స్వభావం, ప్రేమ, కరుణల పట్ల తదేక దృష్టి...ఐక్యతా భావనని పెంపొందించింది, అనుయాయుల్లో ఉమ్మడి ప్రయోజనస్ఫూర్తిని రగిలించింది.

“ హిందూమతం మనకు ఆధ్యాత్మిక చింతన, ఆత్మశోధనల ప్రాముఖ్యత బోధించింది..” నొక్కి చెప్పాడు రామకృష్ణ. “బౌద్ధం మానసిక ప్రశాంతతకి, జ్ఞానోదయానికి మార్గం చూపింది. ఈ రెండు సంప్రదాయాల నుంచి మనం చాలా నేర్చుకున్నాం, వాటి విజ్ఞానసారాన్ని మన విశ్వాసాలలో విలీనం చేసుకున్నాం.”

“ చివరగా తేలేదేమిటంటే – సిద్ధాంతాలు, పిడివాదాలు ముఖ్యం కాదు, హృదయం నుంచి ఉప్పొంగే ప్రేమ గుణం ముఖ్యం..” అన్నది మీరాబాయి. “ఎందుకంటే ఆ ప్రేమ లోతుల్లోనే దైవత్వానికి చెందిన నిజమైన సారం, మనందరినీ ఏకం చేసే శక్తి వుంది.”

“ఒకరి సంప్రదాయ, విజ్ఞానాల నుంచి మరొకరం నేర్చుకుంటూ వుందుము గాక.” అన్నాడు రామకృష్ణ. “భగవంతుని పట్ల మన ప్రేమ దారిదీపంగా వుండి మన మార్గాన్నిప్రకాశవంతం చేయు గాక..మానవాళిని కలిపివుంచే ఐక్యత స్ఫూర్తిని నిత్యం జ్ఞాపకముంచుకుందుము గాక..”

“ ఈ ప్రపంచం ఒక ఉద్యానవనం, అందులో వికసించే పుష్పమే ప్రేమ..” అన్నాడు రామకృష్ణ. “ఆ పుష్పాన్ని పోషించుదాం..దాని అందం, సుగంధం మన హృదయాలను, మన లోకాన్ని నిండి పోనిద్దాం.”

“అలా..ఈ ప్రేమను ఆలింగనం చేసుకుందాం. ప్రేమమయ ప్రపంచం, ఐక్యత, ఆధ్యాత్మిక స్వేచ్చ దిశగా అది మనకు మార్గదర్శనం చేయనిద్దాం. ఎందుకంటే.. ఈ ప్రేమలోనే మన అస్తిత్వపు అసలు అర్థం, సమస్త మానవాళి ఉజ్వల భవిష్యత్తుకి తాళం చెవిని కనుక్కోగలం.”

Read More
Next Story