రాలుతున్న ఆకు ఆందోళన
x

రాలుతున్న ఆకు ఆందోళన

ఆదివారం కవిత


-జూకంటి జగన్నాథం

చెట్టు కొమ్మ రెమ్మ నుంచి

పండి సరసరా పరపరా

ఆకు రాలుతున్న చప్పుడు

ఎండిన ఆకు పచ్చని ఆకుతో

"నేను రాలిపోతున్నాను

జాలిపడకు కళ్ళ నీళ్లు పెట్టుకోకు దుఃఖించకు" అంది

హరిత ఆకు చెట్టుతో

"అమ్మా అన్న రాలిపోతున్నాడు

వలవల ఏడుస్తూ" అడిగింది

చెట్టు తల్లి బిడ్డ ఆకును ఒడిలోకి తీసుకొని

'పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు

పండిన ఆకు రాలి మట్టిలో ఐక్యమై

మళ్లీ వసంతం లో మరింత శక్తివంతంగా

నన్ను అమ్మా అంటూ

లేలేత ముద్దుముద్దు మాటలతో

పలకరిస్తుంది ఏమీ పర్వాలేదు" ఓదార్చింది.

Read More
Next Story