పట్టాభిషిక్తుడైన ఆఖరి మహారాజు.. కలియుగ దానకర్ణుడిగా పేరు..
విజయనగరం గజపతుల రాజకుటుంబంలో పట్టాభిషేకం జరుపుకున్న చివరి మహారాజు రాజా సాహెబ్.. డాక్టర్ పివిజి రాజు.. దేశంలో ఎందరో ప్రధాన మంత్రుల నుంచి రాష్ట్రపతుల వరకు.. ప్రజలు కూడా ఆయనను కలియుగ దాన కర్ణుడిగా పిలుస్తారు. అలాంటి మహనీయుని శత జయంతి ఉత్సవాలను నేడు జరుపుకుంటున్నాం. ప్రజలు మెచ్చిన ఆ మహారాజు ఆత్మకు మోక్షం కల్పించాలని భగవంతుడిని అందరం ప్రార్థిద్దాం. తన కోటను, తన రాజ దర్బారును తన యావత్ భవనాలను విద్యాలయాల కోసం దానధర్మాలు చేసిన మహా విద్యావేత్త పివిజి రాజు.. చిన్నపిల్లలకు ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్ నుంచి హై స్కూల్, డిగ్రీ, ఇంటర్, ఇంజనీరింగ్, పీజీ, లా(న్యాయశాస్త్రం) కళాశాల, ఐటిఐ, పాలిటెక్నిక్ ఇలా అనేక విద్యాసంస్థలను ఏర్పాటు చేసిన మహనీయుడు.
దేశంలోనే మొదటిసారిగా విజయనగర సమీపంలో ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలకు 300 ఎకరాల భూములు, తోటలు దానం చేసిన మహనీయుడు పివిజి రాజు. మొట్టమొదటి సారిగా గిరిజన విశ్వవిద్యాలయం కోసం దరఖాస్తు చేసిన విద్యావేత్త కూడా ఆయనే. ఆ కళాశాల కోసం ఆయన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు లేఖ రాశారు. ఆ విశ్వవిద్యాలయంకు అవసరమైన వేల సంఖ్యలో ఎకరాల భూములు తాను ఉచితంగా ఇస్తానని ఆ లేఖలో పివిజి రాజు పేర్కొన్నారు. అందుకు సమాధానంగా భారత ప్రధానిగా ఆ విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్టుగా జవాబు రాశారు. ఆ విశ్వవిద్యాలయం విజయనగరం సమీపంలోని సాలూరు దగ్గరలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు.
ఈ విషయాన్ని అప్పట్లో స్థానిక విలేకరులకు కూడా చెప్పడం జరిగింది. అప్పట్లో భారత ప్రధాని పంపిన లేఖను కూడా చూపడం జరిగింది. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో మంచి పనులు చేసిన మహా మనిషి పివిజి రాజు.. 1952 సంవత్సరంలో జరిగిన మొదటి ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం మొదటి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. అప్పట్లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. పలుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మహారాజుగా అన్ని సౌకర్యాలను పక్కనపెట్టి సామాన్య వ్యక్తిగా సైకిల్‌పై గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల్లో ప్రచారం చేసేవారు. స్వయంగా ఆయనే ఓ సందర్భంలో సీనియర్ జర్నలిస్ట్ జై ఆదినారాయణకు చెప్పడం జరిగింది.
విజయనగరం కోటలో ఉన్న మాన్షన్ అతిథి గృహంలో పివిజి రాజుని పలుసార్లు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలపై ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సినిమానోత్సవాన్ని ఉత్సవాన్ని భక్తులు చూడడం కోసమే కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే బొంగులతో స్థలాన్ని అలా ఖాళీగా ఉంచడం జరిగిందని ఓ సందర్భంగా పివిజి రాజు చెప్పడం జరిగింది... భారతదేశంలో ఉన్న నిజాయితీపరుల్లో మొదటి వ్యక్తిగా పివిజి రాజు అని చెప్పవచ్చు. భారతదేశంలో కలియుగ దాన కర్ణుడిగా పేరుగాంచిన మహా వ్యక్తి పి వి జి రాజు. భారతదేశంలో ఎవరు ఏర్పాటు చేయని విధంగా సైనిక స్కూలు తో సహా ఎన్నో విద్య సంస్థలను ఏర్పాటు చేసిన మహా విద్యావేత్త .. పివిజి రాజు.. భారతదేశంలో 108 దేవాలయాలకు ధర్మకర్తగా ఉన్న ఏకైక వ్యక్తి పివిజి రాజు.. ఆ మహానీయుడు 1924. మే.. ఒకటో తేదీన జన్మించారు. 1993 సంవత్సరం నవంబర్ 14వ తేదీన ఆయన మరణించారు.
(జే ఆదినారాయణ యూఎన్ఎస్ ఉత్తరాంధ్ర న్యూస్ ప్రతినిధి)