రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటన దృశ్యమాలిక
x
తిరుమల శ్రీవారి సన్నిధిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (టీటీడీ సౌజన్యంతో)

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటన దృశ్యమాలిక

తిరుపతి, తిరుమల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.


తిరుపతి, తిరుమల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలు దేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు.

అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. టిటిడి ఛైర్మ‌న్ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సాదరంగా ఆహ్వానించారు.

అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంటరాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు. ఛైర్మ‌న్‌, ఈవో శ్రీవారి చిత్ర పటాన్ని తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను అందజేశారు.

నిన్న మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి ఏపీ రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ ఉన్నతాధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు ఘనస్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుచానూరుకు రాష్ట్రపతి చేరుకున్నారు. తిరుచానూరులో కొలువు తీరిన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలను రాష్ట్రపతికి వేద పండితులు అందజేశారు.

తిరుచానూరు పర్యటన ముగించుకుని సాయంత్రం రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రపతి తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేశారు.

తిరుపతి పర్యటన ముగిసిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

శనివారం పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాలలో రాష్ట్రపతి పాల్గొంటారు.
(ఫోటోలు-టీటీడీ సౌజన్యంతో)
Read More
Next Story