ఎక్కడి నుంచి ఊడిపడిందబ్బా ఈ ‘నెమ్మినీలం’
x

ఎక్కడి నుంచి ఊడిపడిందబ్బా ఈ ‘నెమ్మినీలం’

కథల గురించి నేను వివరం చెప్పటం కాదు చదవండి. చదివిన మీరు మీరు గా ఉండలేరు. ఇంతగా గుండెలను హత్తుకునే, తాకే వాక్యాలను ఈ మధ్యన నేను చదవలేదు.


బ్రహ్మ పుస్తక సాహిత్య ఉత్సవంలో ప్రధాన ఆకర్షక (ఆకర్షణ కాదు ఆకర్షక సరైందని నా విద్యార్థి దశలో రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు ఒక సభలో అనగా విన్నాను) వ్యక్తి. అంత వరకు అతని పేరు కూడా వినలేదు. రచనా తెలియదు. ఆ మూడు రోజులు నాలుగు రాష్ట్రాల రచయితలు, కళాకారులతో అద్భుతంగా సాగిన కాలం ఈ జయమోహన్ పేరుతో ఆగింది. ఛాయా పబ్లికేషన్స్ వారు ‘నెమ్మి నీలం’ పేరుతో వేసిన పుస్తక ఆవిష్కరణ కిక్కిరిసిన శ్రోతల మధ్య జరగటం ఒక అపూర్వం.

అక్కడ జయమోహన్, మృణాలిని, వసుదేంద్ర, అవినేని భాస్కర్ మాటలు బాగా ఆలోచింపజేసినాయి. అనువాదకుడు అవినేని భాస్కర్ అర సున్నా వాడటం అవసరమని ప్రస్తావించినప్పుడు కొంచెం ఆశ్చర్యపోయినాను. అన్నమయ్య వాడినాడు కదాని సమర్థించుకోవడం ఇదేందిరా సామీ అనుకున్నా. జయమోహన్ పుస్తక ఆవిష్కరణప్పుడూ, మంటపంలో ముఖాముఖీ మాట్లాడినప్పుడూ ఇతనెవరో గొప్ప వ్యక్తిగా ఉన్నాడే ననుకున్నాను.

నెమ్మి నీలం పేరే చాలా ఆకర్షకంగా ఉంది. చదవటం మొదలు పెడుదును గదా ఆపబుద్ధి కాదే. ప్రతి కథా ఇది పెద్దదే ననిపించేది. ప్రతి కథలో జయమోహన్ ఆదర్శలు, విలువలే. ప్రతి కథలో పాత్రలకంటే జయమోహన్ గురించే ఎక్కువగా అర్థమవుతుంది. చాలా కాలానికి బలమైన తీరును విలువలు, ఆదర్శల సమాజాన్ని ఆపేక్షించిన రచయిత దర్శనమిస్తాడు. ప్రతి కథా చదువరుల్ని వెంటాడుతుంది. ఆలోచింప జేస్తుంది అనే మాట చిన్నది. ఇంత అద్భుతమయిన రచయిత మన మధ్యన జీవించి ఉన్నాడన్న సంగతి కూడా తెలియని తెలుగు చదువరులకు ఛాయా ప్రచురణల వారు ఒక మహత్తర మయిన కానుకగా అందించటం అపూర్వం, అపురూపం.

కథల గురించి నేను వివరం చెప్పటం కాదు చదవండి. చదివిన మీరు మీరు గా ఉండలేరు. ఇంతగా గుండెలను హత్తుకునే, తాకే వాక్యాలను ఈ మధ్యన నేను చదవలేదు.కథల గురించి నేను వివరం చెప్పటం కాదు చదవండి. చదివిన మీరు మీరు గా ఉండలేరు. ఇంతగా గుండెలను హత్తుకునే, తాకే వాక్యాలను ఈ మధ్యన నేను చదవలేదు.

జయమోహన్ ప్రతి వాక్యం చదువరికి ఒక జీవితానుభవం. అక్షరాల్లో తెలియాడే అనుభూతి. వాక్యాల సరసన ప్రయాణించే ఒక మరపుకు రాని యాత్ర.

నెమ్మి నీలం అవినేని భాస్కర్ రాసినాడా, జయమోహనా అన్నంతగా ఉందీ రచన. మనకు జయమోహన్ తెలీదు. మన తెలుగులో అవినేని భాస్కర్ అందించిన అనువాదం వారి జోనల్ గానే ఉన్నట్టుంది. ఇతనెవడో అద్భుతమయిన అనువాదకుడు.

జయమోహన్ ను తప్పక చదవాలి. ఈ నెమ్మి నీలం చదివితే వారి మిగతా పుస్తకాలు అందుకోకుండా ఉండలేం. ఇంతటి అపూర్వమయిన పుస్తకాన్ని తెలుగు పాటకులకు ఛాయా మోహన్, అరుణాంక్ లతలకు శతకోటి అభినందనలు.

Read More
Next Story