నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్: రివీల్ చేసేసిన నాగార్జున
x

నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్: రివీల్ చేసేసిన నాగార్జున

టాలీవుడ్ లో గత కొంతకాలంగాచక్కర్లు కొడుతున్నరూమర్లకు ఎట్టకేలకు బ్రేక్ పడింది.


టాలీవుడ్ లో గత కొంతకాలంగాచక్కర్లు కొడుతున్నరూమర్లకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అసలు విషయాన్ని అక్కినేని నాగార్జున రివీల్ చేసేశారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల రిలేషన్ అఫీషియల్ అయిపోయింది. గురువారం ఉదయం వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యింది. నిశ్చితార్ధ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి పుకార్లకు చెక్ పెట్టేశారు నాగార్జున. ఈ సందర్భంగా ఆయన ఒకఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా పెట్టారు.


“ఈ రోజు ఉదయం 9:42 గంటలకు జరిగిన మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. సంతోషకరమైన జంటకు అభినందనలు. వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. ఈ జంటకి దేవుడు ఆశీస్సులు ఉండాలి. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది." అంటూ ట్వీట్ చేశారు.

Read More
Next Story