అమరావతిలో  స్మృతివనాలు
x
అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం

అమరావతిలో స్మృతివనాలు

గోబల్ సిటీ మీద కుల సంతకాలా?


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్మృతివనాలు (మెమోరియల్ పార్కులు) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్టీఆర్, పొట్టి శ్రీరాములు, మహాత్మా జ్యోతిరావు పూలే, డా. అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణం పూర్తయింది. అలాగే కాపు, రెడ్డి, క్షత్రియ సమాజాల నుంచి తమ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు డిమాండ్లు వచ్చాయి. కులలాల వారీగా కూడా డిమాండ్స్ వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి గ్లోబల్ సిటీగా మార్చాలనుకుంటున్నా కులం మచ్చల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాలేదు. ఎన్టీరామారావు విగ్రహం కూడా కులం చర్చల్లోకి ప్రవేశించింది. ఆయన మహానటుడు, ఒక నాాటి ముఖ్యమంత్రి అయినా, ఆయనను చాలా మంది కమ్మకుల తేజంగా చూస్తారు. తెలుగురాజకీయాల్లో కులాల రంగు లేకుండా రాణించడం కష్టం. అందుకే ఎన్టీఆర్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ (Statue of Telugu Pride)అని మునిసిపల్ మంత్రి నారాయణ పి నారాయణ చెప్పినా, ఆ విగ్రహం ఏర్పాటు తర్వాతే పలుకుల సంస్థలు తమ కుల తేజాల విగ్ర హాలను పెట్టాలని కోరుతున్నారు. దానికితోడు ప్రతికులంలో ఒక స్వాతంత్య్ర సమర యోధుడో, ప్రముఖ నాయకుడో మాజీ మంత్రో ఉన్నాడు. ఇలా అమరావతి కులం సిగ్నేచర్ కూడా పడుతూఉంది. రేపు గౌతు లచ్చన్న, ఆచార్య రంగా, ప్రగ్గడ కోటయ్య వంటి వారి విగ్రహాలు పెట్టాలని కోరడంలో ఆశ్చర్యం లేదని పేరు రాసేందుకు ఇష్టపడిన బిసి నాయకుడొకరు ‘ఫెడరల్-ఆంధ్రప్రదేశ్’ తో అన్నారు.

పొట్టి శ్రీరాములు స్మృతివనం (Potti Sriramulu)

స్థలం: శాఖమూరు ప్రాంతంలో 6.8 ఎకరాలు.

విగ్రహం: 58 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహం (అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు ప్రతీకగా).

ప్రగతి: నిర్మాణం పూర్తయింది. మార్చి 16, 2026న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది.

మెమోరియల్ గార్డెన్, ఆడిటోరియం, విద్యా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. భూమి కేటాయింపు, ఫౌండేషన్ స్టోన్ పనులు 2025లో పూర్తయ్యాయి.

అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటులో ప్రభుత్వం కొంత ఖర్చును భరిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6.8 ఎకరాల భూమిని కేటాయించింది. విగ్రహం, మ్యూజియం, థియేటర్, టూరిజం సెంటర్‌తో కూడిన సమగ్ర సాంస్కృతిక కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేస్తోంది. అయితే, విగ్రహం నిర్మాణ ఖర్చులు ప్రధానంగా అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల నుంచి సేకరించిన దానాల ద్వారా భరిస్తున్నారు. ఈ దానాలకు 80(G) సెక్షన్ కింద ఐటీ మినహాయింపు ఉంది.

YSRCP నాయకులు ఈ ఫండ్ సేకరణను విమర్శిస్తూ ప్రభుత్వం స్వయంగా ఖర్చు భరించాలని, ఇతర స్మారకాలకు (ఉదా: NTR విగ్రహం కోసం రూ. 11 కోట్లు) నిధులు కేటాయించినట్లు పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎందుకు లేదని ప్రశ్నించారు.

మొత్తంగా విగ్రహం నిర్మాణం దానాలపై ఆధారపడినప్పటికీ, ప్రభుత్వం భూమి, కాంప్లెక్స్ అభివృద్ధికి ఖర్చు చేస్తోంది. పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్య సమాజానికి చెందిన వారు కావడంతో ఆ సమాజం వారు ట్రస్ట్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఎన్టీఆర్ స్మృతివనం (Former CM NT Rama Rao)

స్థలం: నీరుకొండ గ్రామంలో కొండపై.

విగ్రహం: భారీ కాంస్య విగ్రహం (సుమారు 3,500 టన్నులు, ఖర్చు రూ.1,750 కోట్లు అంచనా).

ప్రగతి: మంత్రివర్గ ఉపసంఘం డిజైన్లను సమీక్షిస్తోంది. 'తెలుగు వైభవం - తెలుగు తేజం' పేరిట స్మృతివనం ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా నిర్మాణం ప్రారంభం కాలేదు. డిజైన్లు ఫైనలైజ్ అవుతున్నాయి.

లిఫ్ట్ సౌకర్యం, భారీ బరువు (65,000 టన్నులు అంచనా) ఉంటుంది.

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు (NTR) విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుత ప్రణాళికల ప్రకారం మొత్తం అంచనా ఖర్చు రూ. 1,750 కోట్లు (కొన్ని నివేదికల్లో రూ. 1,800 కోట్లు)గా ఉంది. ఈ విగ్రహం 182 అడుగుల ఎత్తు, 3,500 మెట్రిక్ టన్నుల బ్రాంజ్‌తో నిర్మాణం, నీరుకొండ హిల్ పైన ఏర్పాటు చేయాలని ప్రణాళిక.

ప్రభుత్వం భరించే ఖర్చు: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ మంత్రి ఎస్ సవిత అధికారికంగా ప్రకటించినట్లు ప్రభుత్వం (పబ్లిక్ ఫండ్స్) నుంచి ఎలాంటి ఖర్చు భరించదు. మొత్తం నిధులు ప్రజల నుంచి స్వచ్ఛంద దానాల ద్వారా, ఒక ప్రత్యేక ట్రస్ట్ ద్వారా సేకరిస్తారు. అయితే ఈ ప్రాజెక్టును ప్రభుత్వ సంస్థ అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (AGICL) పర్యవేక్షిస్తుంది. క్యాబినెట్ సబ్-కమిటీ ప్రణాళికలను సమీక్షిస్తోంది. కొన్ని విమర్శల్లో (విపక్షాల నుంచి), ఇది పబ్లిక్ మనీని వృథా చేస్తుందని, ప్రాధాన్యతలు తప్పు అని ఆరోపణలు ఉన్నాయి.

దాతలు ఇస్తున్నది: ప్రస్తుతం ఇది ప్రపోజల్ స్టేజ్‌లో ఉంది కాబట్టి, దాతల నుంచి సేకరించిన నిధుల వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. మొత్తం ఖర్చు దానాలపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో (2018లో) సమానమైన ప్రాజెక్టుకు దానాల ద్వారా నిధులు సేకరించాలని ప్రణాళిక ఉండేది. కానీ ప్రస్తుత అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.


నీరు కొండ కొండపై నిర్మించే ఎన్టీ రామారావు విగ్రహం నమూనా

మహాత్మా జ్యోతిరావు పూలే (Mahatma Jyotirao Phule)

అమరావతిలో మహాత్మా జ్యోతిరావు ఫూలే స్మృతివనం ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం ఖర్చును భరిస్తుంది. దానాలు లేదా దాతల నుంచి నిధుల సేకరణ విషయంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ స్మృతివనం 5 ఎకరాల్లో నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 11న మహాత్మా ఫూలే 200వ జయంతి సందర్భంగా శంకుస్థాపన చేయనున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా స్టేట్-లెవల్ BC స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తారు. ఇందులో BC యువతకు పోటీ పరీక్షలకు కోచింగ్, సపోర్ట్ అందిస్తారు. అలాగే లైబ్రరీ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇతర జిల్లాల్లో కూడా కొత్త BC స్టడీ సర్కిల్స్, 28 జిల్లాల్లో BC భవనాలు నిర్మాణం చేయాలని ప్రణాళికలు ఉన్నాయి. ఇవన్నీ BC సంక్షేమ శాఖ కింద వెల్ఫేర్ ఇనిషియేటివ్స్‌లో భాగం. మంత్రి సవిత ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు.

డా. బీఆర్ అంబేద్కర్ (Dr. B. R. Ambedkar)

విజయవాడలో 'సామాజిక న్యాయ మహాశిల్పం' (Statue of Social Justice) పేరిట 206 అడుగుల ఎత్తు విగ్రహం (పీఠంతో కలిపి) ఉంది. ఇది వైఎస్ జగన్ హయాంలో నిర్మించారు. అమరావతిలో చిన్న స్థాయి విగ్రహం లేదా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారిక సమాచారం లేదు. 2018లో అమరావతిలో 125 అడుగుల విగ్రహం ప్రతిపాదన వచ్చింది. తర్వాత విజయవాడకు మార్చారు.

అయితే అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరు కావడం వల్ల ప్రయారిటీ ఇవ్వకపోతే వివక్ష చూపించినట్లు అవుతుందని ప్రభుత్వ పెద్దల్లో కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందువల్ల గతంలో తయారు చేసిన ప్రతిపాదనల్లో మార్పులు చేసి స్టడీ సర్కిల్ ను నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అమరావతి తాడికొండ నియోజకవర్గంలో ఉంది. ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గాల వారికి రిజర్వు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఆయన ఆలోచన కూడా అమరావతిలో తప్పకుండా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనేది స్పష్టం చేశారు. భారీ విగ్రహం కాకుండా స్టడీ సర్కిల్ లోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. అయితే ఇంక స్థల కేటాయింపు జరగలేదు.

కాపు సమాజం నుంచి డిమాండ్

కాపు నాయకులు తమ పెద్దల విగ్రహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చర్చలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనేక సార్లు కాపులు తమ సామాజిక వర్గం వారి స్మృతి వనం అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరారు. కాపు నాయకుడు, యాక్టివిస్ట్ స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేసి ఆయన పేరుతో స్మృతి వనం నిర్మించాలని కాపు సంఘాల నాయకులు కోరుతున్నారు. కాపు జేఏసీ కార్యదర్శి చందు జనార్థన్ మాట్లాడుతూ రంగా విగ్రహం, శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. కన్నెగంటి హనుమంతు వంటి మహాను భావుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. జర్నలిస్ట్ గా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న మానికొండ చలపతి రావు విగ్రహం కూడా ఏర్పాటు చేసేందుకు అర్హమైందని, ఈ విషయాలు ప్రస్తుతం ప్రభుత్వం దృష్టిలో ఉన్నందున సానుకూలమైన ఆలోచన చేయాలని కోరారు. కాపునాడు రాయలసీమ అధ్యక్షుడు అర్జా రామకృష్ణ కూడా కాపు సమాజానికి విగ్రహాల ఏర్పాటు ద్వారా తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు.

ప్రస్తుతం కాపు కార్పొరేషన్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉంది. బీసీ భవనాలు ఏర్పాటు చేస్తున్నందున అందులోనే కాపులకు కూడా చోటు ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ చెబుతోంది. అయితే దీనిని బీసీలు వ్యతిరేకిస్తున్నారు. కాపులు బీసీలు కాదనే సత్యాన్ని గుర్తించాలంటున్నారు.

రెడ్డి, క్షత్రియ, బ్రాహ్మణ సమాజాల డిమాండ్లు

అమరావతిలో స్మృతివనాలు ప్రధానంగా పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాల చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. ఇతర నాయకుల విగ్రహాలు (ఫూలే, అంబేద్కర్) ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఈ కుల సంఘాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెడ్డి, క్షత్రియ, బ్రాహ్మణ సామాజిక వర్గాల నుంచి అనేక మంది ప్రముఖులు స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. వీరు దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర అభివృద్ధికి, సమాజ సంక్షేమానికి తమ సేవలను అందించారు. ఉదాహరణకు స్వాతంత్య్ర సాధించడం, సామాజిక సంస్కరణలు, రాజకీయ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి. అమరావతిలో విగ్రహాలు ఏర్పాటు చేయడం గురించి చర్చ జరుగుతున్నదున ప్రభుత్వ నిర్ణయాలు, సామాజిక సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కొన్ని కమ్యూనిటీలకు చెందిన నాయకుల విగ్రహాలు ప్లాన్ చేస్తున్నారు. కానీ వీరికి కూడా అర్హత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వారి ఆదర్శాలు, సేవలు రాష్ట్రానికి శాశ్వతంగా ప్రేరణగా నిలుస్తాయి.

రెడ్డి సామాజిక వర్గం ప్రముఖులు

రెడ్డి కమ్యూనిటీ నుంచి అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు ఉన్నారు. వీరు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి (Uyyalawada Narasimha Reddy)

19వ శతాబ్దంలో బ్రిటిష్‌లకు వ్యతిరేకంగా మొదటి ప్రముఖ తిరుగుబాటు (1846-47) నడిపిన స్వాతంత్ర్య సమరయోధుడు. కర్నూలు జిల్లాలో పాలెగారు గా ఉండి, భూమి హక్కులు, రైతుల సమస్యల కోసం పోరాడాడు. భారత స్వాతంత్ర్య పోరాటానికి మొదటి రెబెల్‌గా ప్రేరణ ఇచ్చాడు. రైతుల హక్కులను పరిరక్షించాడు. సమాజంలో అసమానతలపై పోరాడాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రైతు ఉద్యమాలకు మూలం అయింది.

నీలం సంజీవ రెడ్డి (Neelam Sanjiva Reddy)

మాజీ రాష్ట్రపతి (1977-82) ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి (1956-60, 1962-64). స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర, విద్య, భూసంస్కరణల ద్వారా సమాజాన్ని బలోపేతం చేశాడు. ఇది రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి దోహదపడింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కేవలం ఒక నగరంగానే గతం చరిత్రకుయ కూడా అద్దం పట్టాలి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, నీజాయితీ పరుడయిన నీలం సంజీవరెడ్డి విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేయడం సబబు అని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రముఖడొకరు వ్యాఖ్యానించారు.

డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి (Y.S. Rajasekhara Reddy)

మాజీ ముఖ్యమంత్రి (2004-09). స్వాతంత్య్ర సమరంలో పాల్గొనకపోయినా రాజకీయ నాయకుడిగా రైతులు, పేదల కోసం ఆరోగ్యం (ఆరోగ్యశ్రీ), సాగునీటి పథకాలు ప్రవేశపెట్టాడు. గ్రామీణ అభివృద్ధి, సామాజిక సంక్షేమం ద్వారా మిలియన్ల మంది ప్రజల జీవితాలను మెరుగు పరిచాడు. వీరి సేవలు పరిగణనలోకి తీసుకుంటే అర్హమే. ఎందుకంటే అమరావతి రాజధాని కాబట్టి రాష్ట్ర చరిత్రకు సంబంధించి వివిధ ఘట్టాలలో ప్రముఖపాత్రవహించిన వారి విగ్రహాలు సమాజానికి ప్రేరణగా ఉంటాయని మరొక నాాయకుడు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కొందరి విగ్రహాలు ఏర్పాటు చేసి మరికొందరి విస్మరిస్తే చెెడ్డపేరు వస్తుందని ఆయన హెచ్చరించారు.

క్షత్రియ సామాజిక వర్గం నుంచి ప్రముఖులు

అల్లూరి సీతారామ రాజు (Alluri Sitarama Raju)

1922-24లో రాంపా తిరుగుబాటు నడిపిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆదివాసీల హక్కుల కోసం బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశాడు. ఆదివాసీ సమాజాన్ని బ్రిటిష్ దోపిడీ నుంచి రక్షించాడు. స్వాతంత్ర్య పోరాటం గిరిజన ఉద్యమాలకు మూలం అయింది. ఇది ఆంధ్రప్రదేశ్ గిరిజన హక్కుల ఉద్యమాలకు ప్రేరణ.

బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ప్రముఖులు

బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్, నాయకులు ఉన్నారు.

టంగుటూరి ప్రకాశం పంతులు (Tanguturi Prakasam Pantulu)

ఆంధ్ర కేసరి గా ప్రసిద్ధి. ఆంధ్ర స్టేట్ మొదటి ముఖ్యమంత్రి (1953-54). స్వాతంత్ర్య పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. సామాజిక సంస్కరణలు, విద్య, మహిళల హక్కుల కోసం పోరాడాడు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డాడు. ఇది రాష్ట్ర ఐక్యతకు మూలం.

సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan)

మాజీ రాష్ట్రపతి (1962-67), ఫిలాసఫర్. స్వాతంత్య్ర పోరాటంలో మేధావి గా పాల్గొన్నాడు. విద్యా రంగంలో సంస్కరణలు, భారతీయ తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇది భారత విద్యా వ్యవస్థను బలోపేతం చేసింది.

బూర్గుల రామకృష్టా రావు (Burgula Ramakrishna Rao)

హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి (1952-56), స్వాతంత్య్ర సమరయోధుడు. భూసంస్కరణలు, తెలంగాణ విముక్తికి దోహదపడ్డాడు.

వీరి విగ్రహాలు అమరావతిలో ఏర్పాటుకు ప్రస్తుతం స్పెసిఫిక్ ప్లాన్స్ లేవు. కానీ వీరి చారిత్రక ప్రాముఖ్యతను బట్టి అర్హమే. అమరావతి రాజధానిగా ఉన్నందున, ఇటువంటి విగ్రహాలు సమాజ సమతుల్యతను ప్రోత్సహిస్తాయి.

ప్రధానంగా రెడ్డి, క్షత్రియ, బ్రాహ్మణ సమాజాల నుంచి కూడా ప్రభుత్వానికి వినతులు అందాయి. ప్రభుత్వం వీరి విగ్రహాల ఏర్పాటు విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆలోచనలు జరుగుతున్నట్లు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చెప్పారు. ఇది ప్రభుత్వ పాలసీలపై ఆధారపడి ఉంటుంది. సమానత్వం కోణంలో అన్ని కమ్యూనిటీలను పరిగణనలోకి తీసుకోవాలి.

Read More
Next Story