
వేట్లపాలెం ఫైర్ వర్క్స్ లో పేలుడు దృశ్యం
సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో పెను విషాదం- చిత్రాలు..
కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం: బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 20 మంది దుర్మరణం!
కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో శనివారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది.
వేట్లపాలెం గ్రామ పరిధిలోని గోదావరి కెనాల్ సమీపంలో ఉన్న 'సూర్యశ్రీ ఫైర్ వర్క్స్' బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో సుమారు 20 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.
మృతుల్లో అత్యధికులు మహిళా కూలీలే ఉండటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మరో 30 మంది తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
పేలుడు శబ్దం సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించిందంటే ప్రమాద తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పేలుడు ధాటికి పక్క గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాల స్లాబ్‌కు కూడా పగుళ్లు వచ్చాయి.
ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపించాయి.
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇప్పటికి ఆరుగుర్ని గుర్తించారు. మిగతా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితుల్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుటాహుటిన విజయనగరం నుంచి సామర్లకోట వస్తున్నారు.
Next Story

