నూరేళ్ళ కమ్యూనిస్టుల ఉద్యమ ప్రస్థానం
ఈ దేశంలో నూరేళ్లలో కమ్యూనిస్టులు ఏమిసాధించారు? అని అడుగుతున్నారు చాలామంది.
ఈ దేశంలో నూరేళ్లలో కమ్యూనిస్టులు ఏమిసాధించారు? అని అడుగుతున్నారు చాలామంది. అందులో పాలకవర్గ పార్టీలు కాంగ్రెఎస్, బిజెపి, ప్రాంతీయ పార్టీలు నాయకులు. వారే కాదు, నిరాశ నిస్పృహలకు గురైన మాజీ కమ్యూనిస్టులు.
"ఏమి సాధించలేదు?"
ఇదే నా ప్రధానమైన ఎదురు ప్రశ్న.
1. భారత స్వాతంత్ర్యోద్యమంలో కమ్యూనిస్టుల ప్రాత్ర
ఏమైంది?
2. స్వాతంత్ర్య భారతంలో విలీనానికి తిరస్కరించిన
సంస్థానాలు, జమీందారీలపై
ప్రత్యక్ష పోరాటాలు నడిపింది ఎవరు? ఆ
పోరాటాలలో అసమాన ప్రాణ త్యాగాలు
చేసింది ఎవరు? ఆ చరిత్ర ఏమైంది?
3. కార్మిక వర్గ హక్కుల పోరాటాలకు బాటలు వేసిన
చరిత్ర ఏమైంది?
4. "దున్నేవాడిదే భూమి" నినాదంతో సాగిన
భూపోరాటాలు లేకుండానే "భూసంస్కరరణలు"
చట్టం వచ్చిందా? అమలు జరిగిందా? వేలాది
ఎకరాల భూపంపిణీ కారకులు కమ్యూనిస్టులు
కాక ఇంకెవరు?
5. ప్రభుత్వరంగంలో పారిశ్రామల స్థాపన విధానం
అమలుకు అంతర్గతంగా కమ్యూనిస్టుపార్టీ
పోరాటం, అంత ర్జాతీయంగా కమ్యూనిస్టు
ప్రభుత్వాలు ఉన్న దేశాల సహారం కారణం కాదా?
6. బాంకుల జాతీయకరణ ఎవరి ఉద్యమాలు,
పోరాటాలు, వత్తిడి వల్ల సాధ్యమైంది?
7. చివరిగా UPA ప్రభుత్వాల హయాంలో 'జాతీయ
పనికి ఆహార పధకం' సాధనలో క్రియాశీలక పాత్ర
ఎవరిది?
8. రాజారామమోహనరాయ్, కందుకూరి వీరేశలింగం
సంఘసంస్కరణ ఉద్యమ వారసత్వాన్ని త్రికరణ
శుద్ధిగా కొనసాగించిందెవరు? అప్పుడేగా వీరేశ
లింగంను కమ్యూనిస్టులు కామ్రేడ్ చేశారని,
గురజాడను కామ్రేడ్ చేశారని పిచ్చికూతలు
కూసింది గుర్తులేదా?
9. సాహిత్య సాంస్కృతిక రంగాలు ప్రజా పక్షం వహించి
ఉద్యమించడంలో కమ్యూనిస్టులు ఇప్పటికీ
పోషిస్తున ప్రధాన భూమిక ఏమయింది?
10. ప్రజలు కమ్యూనిస్టులను బలపరిచినంతకాలం
అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా
ప్రజా ప్రయోజనాలకు, జాతీయ ప్రయోజనాలకు,
లౌకిక జీవన విధానానికి భంగం కలిగించే
ఒక్కచట్టానైనా తేగలిగిందా?
11. కమ్యూనిస్టులు బలహీనంగా ఉన్న వర్తమానంలో
నైనా ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాద
విధానాలపై తెగించి పోరాడుతున్నది ఎవరు?
కమ్యూనిస్టులు కాదా? జైళ్ళలో
మగ్గింది, మగ్గుతున్నది ప్రాణాలను ఫణమొడ్డు
తున్నదీ కమ్యూనిస్టులే కదా!
12. దళిత, మహిళ, మైనారిటీ అస్తిత్వవాద
ఉద్యమాలకు వెన్నుదనైనిలిచించింది కమ్యూనిస్టులు కాదా?
ఇవన్నీ దాచేస్తే దాగని కమ్యూనిస్టుల, వారి త్యాగమయ ఉద్యమాల ఫలితాలు.
మరైతే కమ్యూనిస్టులు ఎందుకు బలహీనపడ్డారు? ఇది అసలు ప్రశ్న.
కమ్యూనిస్టుల సైద్ధాంతిక విభేదాల చీలిక మౌలిక కారణం. ఇతరపార్టీలకు అధికార కైవశమే ప్రధాన లక్ష్యం.
కమ్యూనిస్టులు రాజకీయంగా చేసిన తప్పులూ ఉన్నాయి. వాటి దారుణ ఫలితాలను ఆపార్టీలు అనుభవిస్తునాయి. అయితే అవి అధికారాన్ని హస్తగతంకోసం చేసిన వ్యక్తిగత తప్పులు కావు. నిజానికి వాటి ఫలితాలు అన్యులకు ప్రయోజనం చేకూర్చాయి.
అందులో ముఖ్యమైనవి అత్యవసర పరిస్థిని సమర్థించడం. కాంగ్రెస్ కులాభం చేకూరింది. జనసంఘ్ రూపంలో ఉన్న ఆర్. ఎస్.ఎస్. తోకలిసి ఏర్పడిన జనతాపార్టీని బలపరచడం. అది విచ్చిన్నం అయిన అనంతరం జనసంఘ్ భారతీయ జనతాపార్టీగా ఆవిర్భవించి ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళింది. అందుకు అవసరమైన గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించింది. ఒక ప్రమాదకర రాజకీయశక్తిగా బలపడింది.
వీటన్నిటి కారణాలవల్ల కమ్యూనిస్టులు బలహీనపడ్డారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు రామారావును తొలగించి తాను ముఖ్యమంత్రి అయారు. నాటినుండి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ప్రత్యక్షంగా రాజకీయాలలోకి ప్రవేసించారు. ప్రజాసమస్యలపై అవగాహన, సామాజిక రాజకీయ ఉద్యమాలతో సంబంధంలేని వారు ఎన్నికల్లో గెలుపునకు డబ్బును రంగంలోకి తెచ్చారు. కులం, మతం, ప్రాంతీయ వాదాలను, ఇతర ప్రలోభాలను ప్రోత్సహించారు. అవి తమ విశ్వరూపాన్ని ప్రద్రర్శిస్తున్నాయి. ఫలితంగా
నిరంతరం ప్రజలలో మమేకమైన కమ్యూనిస్టులు ఓటమి పాలయ్యారు. ఇప్పుడు చట్టసభలు చూస్తున్నాం. ప్రజకోసం అక్కడ చట్టలు చెయ్యబడవు. జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే చర్చలు జరగవు. భారత రాజ్యాంగం చట్ట సభలో ఆత్మ గౌరవాన్ని కోల్పోతూ ద్రౌపది మాదిరి రక్షకులకోసం ఎదురుచూస్తోంది. అధికార పార్టీ నేతలే రాజ్యాంగ రచనా బృందంలో కీలక పాత్ర పోషించిన డా. భీమ్ రావ్ అంబేద్కరను అవమానపరిచేలా మట్లాడుతున్నారు. వీరా దేశాన్ని, స్వాతంత్ర్యోద్యమ సాంప్రదాయాలను,రాజ్యాంగాన్ని వాటి ఉన్నత సంప్రదాయాల్ని కొనసాగించేది? పరిరక్షించేది? కాపాడేది?
కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉన్నకాలంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?
ఇక - మార్క్సిజం విఫలమయ్యింది. కమ్యూనిస్టులు ఇంకెక్కడున్నారు? తప్పులు చెయ్యడం, చేసిన తప్పుల్ని ఒప్పుకోవ డమే కమ్యూనిస్టుల పని. అనేది మరో ప్రచారం. ప్రపంచంలో గెలుపు ఓటములు చవిచూడని రాజకీయ, ఆర్థిక, పరిపాలనా సిద్ధాంతాలు, సంస్థలు వ్యవస్థలు లేవు. అన్నీ కూలిపోగా నిలిచిఉన్నవి రెండే రెండు. అవే పెట్టుబడిదారీ సిద్ధాంతం, దాన్ని సవాలు చేస్తున్న కమ్యూనిస్టు సిద్ధాంతం. అత్యధిక సంఖ్యాకులు శ్రమించి సృష్టించిన సంపదను అతికొద్దిమందికి దోచిపెట్టేది కాపిటలిజం. సామాజిక శ్రమఫలితం అందరిదీ కావాలని, సామాజిక అంతరాలకు తావుండరాదనేది కమ్యూనిజం. వరుస సంక్షోభాలతో పెట్టుబడిదారీ విధానం కొట్టుమిట్టాడుతోది. తాత్కాలిక ఉపశమనాలతో నెట్టుకొస్తోది. వాటి పరిష్కారం కోసం కమ్యూనిజం అనే శాస్త్రీయ సిద్ధాంతానికి పునాది అయిన అర్థశాస్త్రాన్ని మళ్ళీమళ్ళీ తిరగేస్తోంది.
ప్రథమ సోషలిస్టు దేశం సోవియట్ యూనియన్ కూలిపోయింది. ఇక కమ్యూనిస్టులు ఎక్కడున్నారు? అనడం బుకాయింపు మాత్రమే. ప్రంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనాలో కమ్యూనిస్టు పార్టీయే అధికారంలో ఉంది. దాని పరిపాలనా విధానాలపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అవి వేరు. అమెరికాకు ఆనుకొని ఉన్న అతిచిన్న దేశం క్యూబా, కమ్యూనిస్టు పాలనలోనే ఉంది. అనేక లాటిన్ అమెరికాదేశాల్లో కమ్యూనిస్టుల ఉద్యమాలు ఆయా ప్రభుత్వాలను సవాలు చేస్తున్నాయి.
మనదేశంలోనూ పాలక వర్గ సంక్షోభం మేకపోతు గాభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. మళ్ళీ కమ్యూనిస్టులు ఎక్కడ పుంజుకుంటారో అని దాని భయం. అందుకే ప్రభుత్వం, దాని ప్రచారవ్యస్థ, దాని అనుబంధ సంస్థలు ప్రజల్ని మభ్యపెట్టే ప్రచారాలు చేస్తున్నారు.
అందుకే అంటున్నా...
"వేనవేల వత్సరాల
మానవ మహాప్రస్థానంలో
విజయాలేనా అపజయాలెన్నెన్నో
అయినా ఆగిందా మహాప్రయాణం!
ఆధునిక యుగపు దోపిడి నుండి
మానవాళి విముక్తికి తిరుగులేని శక్తి
మార్క్సిజం మార్క్సిజం మార్క్సిజం
ముమ్మాటికి అదే మాట అదే బాట
పదకామ్రేడ్ పదకామ్రేడ్ పదకామ్రేడ్
పదపద పదకామ్రేడ్
వర్తమాన కత్తులవంతెనపై
ఉద్యమాల కవాతు."