తిరుమల కొండ అంచున ఉన్న ఈ ఒంటరి గంట మండపం చెప్పే కథ ఏంటంటే..
x

తిరుమల కొండ అంచున ఉన్న ఈ ఒంటరి గంట మండపం చెప్పే కథ ఏంటంటే..

ఈ మండపం తిరుపతికి 23 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. అలిపిరి కాలిబాట నుంచి యోగ నరసింహాలయం నుంచి ఎడమకు ట్రెక్ చేసుకుంటూ వెళ్తే కొండల అంచున నిలబడి కనిపిస్తుంది.


(భూమన్ )


అయిదు శ‌తాబ్దాల నాటి గంటమండ‌పం ఇది. ఇక్క‌డ‌ గంట లేదు కానీ, రాతి మండ‌పం మాత్రం మిగిలి ఉంది. ఇప్పుడీ గంట ఎక్క‌డున్న‌ద‌నేది ప్ర‌శ్న‌. తిరుమల ఆల‌యంలోనే ఉందరి కొందరు చెబుతారు. విజ‌య‌గ‌న‌ర చ‌క్ర‌వ‌ర్తుల కాలంలో నిర్మించిన మండ‌పం ఇది.




ఈ మండపం తిరుపతికి 23 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. అలిపిరి కాలిబాట నుంచి యోగ నరసింహాలయం దాకా వెళ్లాలి. అక్కడి నుంచి ఎడమ వైపునకు ట్రెక్ చేసుకుంటూ వెళ్తే తిరుమల కొండల అంచున నిలబడి మండపం కనిపిస్తుంది. ఇక్కడి చేరుకోవడం చాలా కష్టం. అదొక చిన్నసాహస యాత్ర. ఒక గొప్ప అనుభవం.


పూర్వం ఈ మండపలో ఒక పెద్ద గంట వేళాడుతూ ఉండిందట. బహుశా ఈ గంట కోసం ఈ మండపం కట్టారేమో. తిరుపతి సమీపంలో చంద్రగిరి కోట ఉంది. విజయనగర రాజు రామదేవరాయ ఈ ప్రాంతాన్ని చంద్రగిరి రాజధానిగా పరిపాలించేవాడు.

మండపంలోపల నేల నంతా తవ్వేశారు



తిరుమలేశుడికి ప్రసాదం సమర్పించిన తర్వాత భోజనానికి ఉపక్రకమించడం ఆయనకు అలవాటు. తిరుమల వెంకటేశ్వరుడికి ప్రసాదం సమర్పించగానే ఆ కబురు రామదేవరాయుడికి చేరవేయాలి. అపుడే భోజనానికి కూర్చుంటారు. ఈ కబురు ఏక్కడో దూరాన ఉన్నరాజుకుఎలా చేరవేయాలి. ఒక సైనికుడు గుర్రం మీద వెళ్లి మెసేజ్ అందించడం సాధ్యంకాదు. అందువల్ల గంటనాదం సిగ్నల్ ఎంచుకున్నారు.


గంట మోగించడం ఒక అనుకూలమయిన పద్ధతి. ప్రసాదం శ్రీవారికి సమర్పించగానే ఈ గంట మోగేది. అపుడు రాజుగారు గంటానాదం విని భోజనానికి ఉపక్రమించే వారు. అయితే, ఈ గంట ఎలా మోగేది? శ్రీవారికి నైవేద్యం పెట్టగానే, అక్కడి నుంచి ఒక మనిషి వచ్చి ఈ గంట మోగించాలి.అంతేనా?




ఆలయం దగ్గిర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి గంట మోగించాలి. ఇది కూడా ఆచరణ సాధ్యం కాదు. మరి ఈ కొండ చివరన ఉన్న ఈ గంటను మోగించడమెలా?

దీని కొక గాధ ప్రచారంలో ఉంది. శ్రీవారికి నైవేద్యం పెట్టగానే తిరుమల ఆలయం గంటని పెద్దగా మోగిస్తారు. అపుడు ఆ గంట నుంచి వెలువడే శబ్ద తరంగాలు ఇక్కడికి చేరుకునేవి. ఆ ప్రకపంనలతో ఈ గంట మోగేదని చెబుతారు. ఇది సైంటిఫిక్ గా నిరూపించడం కష్టం. అయితే, ఇదొక గాధ మాత్రమే.

మొత్తానికి కొండ చివరన, చంద్రగిరి ముఖంగా ఈ మండపం ఉండటం వల్ల ఈ గాథ ప్రచారమయ్యేందుకు కారణం కావచ్చు. ఈ మండపం దగ్గిర నుంచి చూస్తే చంద్రగిరి కోట, స్వర్ణముఖి నది కనబడతాయి. గంటని 1614-1630లో రఘనాధ యాచమనాయకుడనే వ్యక్తి చంద్రగిరి రాజుకు బహూకరించారని చెబుతారు. అదీ సంగతి.




ఈ రాతి స్తంభాల‌నుకు పునాది లేదు. నిటారుగా నిలబెట్టారు. స్తంభాల మీద రాతి బండ‌ల‌తో క‌ప్పు వేశారు. ఏమాత్రం పునాదిలేకుండా, కేవ‌లం రాళ్ళ పైన నిల‌బెట్టిన ఈ మండ‌పం శతాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఎలా నిల‌బ‌డింద‌నేది ప్ర‌శ్న! మండ‌పం మ‌ధ్య‌లో కూడా రాళ్ళ‌ను ప‌రిచారు.


గంటమండపం దగ్గిర ఉన్న బండరాయి మీది నుంచి తిరుపతి పట్టణం ఇలా కనిపిస్తుంది.



కానీ, గుప్త నిధుల కోసం ఎవ‌రో మండ‌పం మ‌ధ్య‌లో త‌వ్వేశారు. ఈ మండపం ఎన్ని తుపానుల‌ను త‌ట్టుకుందో! ఎన్ని ప్ర‌కృతి భీభత్సాల‌కు ఎదురొడ్డి నిల‌బ‌డిందో! ప‌ద‌హార‌వ శ‌తాబ్దంలో నిర్మించిన ఈ మండ‌పం ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌కుండా ఉంది.

ఈ గంట మండ‌పంలో విశ్ర‌మించడం ఒక గొప్ప అనుభూతి.


Read More
Next Story