
నీట మునిగిన టమాటా తోట
మొంథా తుపాను మిగిల్చిన విషాదమెంతో.. చిత్రమాలిక
చేతికొచ్చిన పంట ఏటి పాలై రైతులు విలవిలా..
మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి, బాపట్ల, కృష్ణా, అన్నమయ్య జిల్లాల్లో వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
పంటను కాపాడుకునే ప్రయత్నంలో సామార్లకోట వద్ద ఓ రైతు పడుతున్న యాతన
ముఖ్యంగా వరి, అరటి, కొబ్బరి తోటలు నేలమట్టం అయ్యాయి.
మొంథా తుపానుకు నేలవాలిన వరి (తాడేపల్లిగూడెం వద్ద)
భారీ వర్షాలు, పెనుగాలులకు నీట మునిగిన పంటల్ని చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు వద్ద మాగాణి పరిస్థితి ఇలా
‘ది ఫెడరల్’ ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్ పి. రవి కాకినాడ నుంచి తాడేపల్లి వరకు పర్యటించి తీసిన చిత్రాలు ఈ తుపాను రైతులపై మిగిల్చిన ముద్రను స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఏలూరు సమీపంలో నీట మునిగిన వరి పంట
వరద నీటిలో మునిగిపోయిన పొలాలు, వంగి విరిగిపోయిన అరటి చెట్లు, నీటిలో తేలియాడుతున్న పంట — ఇవన్నీ కేవలం దృశ్యాలే కావు, రైతుల ఏడాది శ్రమకు చిహ్నాలు.
తాడేపల్లిగూడెం వద్ద అరటి తోటలు
పలు ప్రాంతాల్లో రైతులు పొలాల్లో నీరు తగ్గకపోవడంతో మరింత ఆందోళనలో ఉన్నారు. ఏటా అప్పులు చేసి సాగు చేసే చిన్న, మధ్యతరగతి రైతులు ఇప్పుడు పంట పాడైపోవడంతో పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడ్డారు.
చేతికొచ్చిన వరి పంటను దేవేస్తున్న రైతు
కొంతమంది రైతులు మిగిలిన పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తీరప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నీటి మోటర్లు, డ్రైనేజీ పంపులు పనిచేయడం లేదు. నష్టపరిహారం అంచనా కోసం అధికారులు గ్రామాల వారీగా పర్యటిస్తున్నారు.
నీట మునిగిన వరి పంటను అధికారులకు చూపుతున్న రైతు
అయితే, వర్షం తగ్గినా రైతుల మదిలో భయం ఇంకా తీరలేదు — వచ్చే పంటే జీవనాధారమని వారి నమ్మకం.
ప్రకృతి విపత్తు ప్రతిసారి రైతుల శ్రమను ముంచెత్తినా, వారు మళ్లీ నేలను పట్టుకొని జీవించాలనే ధైర్యాన్ని చూపుతారు. ఇప్పుడు ఆ ధైర్యానికి అండగా ప్రభుత్వం నిలబడాల్సిన సమయం ఇది.
రైతుల కష్టాన్ని గమనించి, తక్షణ సహాయం, పంట నష్టం పరిహారం, విత్తన సాయం, రుణ మాఫీ వంటి చర్యలు తీసుకుంటేనే ఆర్థికంగా, మానసికంగా ఈ విపత్తు నుంచి వారు బయటపడగలరు.
అవనిగడ్డ ప్రాంతంలో వరి పొలాన్ని పవన్ కల్యాణ్ కి చూపుతున్న రైతులు
ఫోటోలు: పి. రవి | ది ఫెడరల్
రిపోర్టింగ్: ది ఫెడరల్, ఆంధ్రప్రదేశ్ బ్యూరో
Next Story

