బెంగాల్ రాయల్ టైగర్స్ చూడాలన్న కోరిక నేరవేరనే లేదు
పశ్చిమబెంగాల్ సుందర్ బన్స్, శాంతినికేతన్ లకు ఒక యాత్ర
ఒంగోలు నుండి సింహపురి లో హైదరాబాద్కు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 1:45 కి కలకత్తా ఎయిర్ పోర్ట్ లో దిగాము. బయటికి వచ్చి టాక్సీ చూడగానే వాంతి వచ్చినంత పని అయింది. (ఎల్లో కలర్) పసుపు పచ్చ టాక్సీలు చాలా చౌక. డ్రైవర్ నోరు తెరిస్తే పాన్ పరాగా కంపు.చాల మురికిగా ఉన్నాడు. (వారిని తక్కువ చేయటం కాదు.ఉన్న పరిస్థితిని చెపుతున్న.) యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (yAHI) అడ్రస్సు సులభంగానే కనుక్కున్నాం. సాయంత్రం ఐదు గంటలకు కసోరీ, సమోసా, టి పూర్తిచేసుకుని నడుచుకుంటూ మదర్ తెరిసా చర్చ్ కి వెళ్ళాం. ఆమెకు, చర్చిలో ప్రార్థనలు జరిగినట్లు ప్రార్థనలు చేస్తున్నారు. చర్చి మ్యూజియంలో ఆమె చేసిన సేవల ఫోటోలు చూసాం. చర్చి లోపల బయట అంతా నీట్ గా ఉంది. ప్రశాంతంగా ప్రార్థనలు జరుగుతున్నాయి.
మేమున్నది ఓల్డ్ సిటీ ఆట. రోడ్లు, మనుషులు, హోటలు, యువజన హాస్టల్ భవనం, బస్సులు అంతా మురికి మురికి, పేదరికం ప్రతిక్షణం, ప్రతిచోట, ప్రతి విషయం లో కనిపిస్తుంది. టిఫిన్ తిని ఉ: 10 గంటలకు ఏసీ బస్సులో కలకత్తా నుండి సోనాకలి వచ్చాము. కలకత్తా నుండి సోనాకలి (బిభూతి భూషణ్ ఇచ్చామతి నవలలో కనిపించే ఊరు) దాదాపు 50 కి.మీ. దూరం. రోడ్డుకు ఎడమ పక్కన ఓ పెద్ద కాలువ ప్రవహిస్తూ ఉంది. కాలువ పక్కన చాలా దూరం పచ్చగానే ఉంది. సోనాకలి వచ్చే ముందు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం అంతా ఇటుక బట్టీలు ఉన్నాయి. ఈ ఇటుకలు చాలా గట్టిగా ఉన్నాయి. సోనాకలి నుండి ఓగల్ నదిలో గోసభ ఐల్యాండ్ వరకు లాంచిలో వచ్చాం. లాంచ్ ఓనరు గులాబీ పువ్వులు, ఫ్రూటీ ఇచ్చి స్వాగతం చెప్పడం బాగుంది.
గోసభ లో హామిల్టన్, రవీంద్రనాథ్ బంగ్లాలు, వారి విగ్రహాలు, బుద్ధిని విగ్రహాలు, అక్కడున్న గార్డెన్ చూసాము. బికాన్ (BEACON రవీంద్రనాథ్ బంగ్లాకు పేరు) మూసివేసి ఉంది. గోసభ అక్కడున్న ఐలాండ్స్ లో చాలా పెద్దది. రవీంద్రనాథ్ హామీల్టన్ (బ్రిటిష్ అధికారి) ను తీసుకొచ్చి ఈ ఐలాండ్స్ అన్ని తిప్పి ఐలాండ్స్కు చుట్టూ బెంగాల్ పులుల నుండి రక్షణ కొరకు కంచెలు వేయించాడట. అక్కడి గిరిజనల అభివృద్ధికి చాలా కృషి చేశారట. వీరి కృషి వలన ఐలాండ్స్ అన్ని కొద్దిగా అభివృద్ధి చెంది బెంగాల్ టైగర్స్ నుండి రక్షణ పొందుతున్నారు. లాంచీలో pakchirlay అనే ఐలాండ్ కు వచ్చి, అప్నజన్ APANJAN హోటల్లో ఆగాము. నిన్నటి కలకత్తా టిఫిన్, లంచ్ అస్సలు నచ్చలేదు. ఈరోజు లాంచీలో బ్రహ్మాండమైన ఫుడ్డు, స్నాక్స్. ఒంటిగంట నుండి 6 గంటల వరకు సుదీర్ఘమైన లాంచి ప్రయాణం బాగా ఎంజాయ్ చేసాం. లాంచి స్టాపు జెల్లీ ఫిష్ లను కర్రకు కట్టిన చిన్న వలతో పట్టి ఇవ్వగా అందరూ చేతుల్లో పెట్టుకుని ఎంజాయ్ చేసాం. ఓగల్ నదిపై లాంచ్ ప్రయాణ ఆనందాలు, నదిపై సూర్య విన్యాసాలు, జెల్లీ ఫిష్ లు (వినటమే గాని చూడటం మొదటిసారి) టచ్ చేసిన ఆనుభూతులు, స్థానిక గిరిజన నృత్యాలు సంతోషాన్ని ఇచ్చాయి. స్థానిక గిరిజననృత్యాలు మన భరతనాట్యాన్ని, కోలాటాన్ని పోలి ఉన్నాయి. కానీ ఈ గిరిజన నృత్యాలు మన భరతనాట్యం కన్నా ముందే పుట్టి ఉంటాయి.
ఉదయం 9 గంటలకు లాంచీలో ఐలాండ్ నుండి బయలుదేరి (మనుషులు ఉన్న ఐలాండ్ నుండి) మనుషులు లేని బ్రహ్మాండమైన బెంగాలీ రాయల్ టైగర్స్, జింకలు పక్షులు ఉన్నాయని చెబుతున్న ఓ దివి చుట్టూ (ఆ దివి చుట్టూ 5, 6 అడుగుల ఎత్తున కంచ వేసి ఉంది). ఆ కంచెనుండి (ప్లాస్టిక్ వల) పులులు దూకవా అని అడిగితే బెంగాల్ టైగర్ లాంగ్ జంప్ మాత్రమే చేయగలదు, హై జంపు చేయలేదు, నెట్, లైటు, సౌండ్స్, టైగర్ల బలహీనత అని, ఆకలిగా ఉన్నప్పుడు ఒకలా, కడుపు నిండినప్పుడు మరొకలా ఉంటాయని, రాయల్ పులులలో ఒక రాజసం ఉంటుందని గైడు చెప్పేడు. సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఐదు గంటలకు హోటల్కు చేరాము. బంగాళాఖతం వెనక్కి తన్నుతున్ననీళ్ళుట.సముద్రపు అలలు స్పష్టం గా తెలుస్తున్నాయి. ఒడ్డు కనిపిస్తుందనుకున్నాము. కనిపించలేదు. దివిచుట్టూ తిప్పేరు.చుట్టూ కంచె ఉంది.
మూడవరోజు పెరకలి 1, 2 ఓపెన్ జoగిల్ కు వెళ్ళాము. సుదనికలి ఐలాండ్ చూసాము. నాలుగవరోజు SAJNEKHALI, BALI దీవులు చూసాం. బాలిలో కొంచెం వ్యవసాయం కనిపించింది. పసుపు కొమ్ములు, పెద్ద బాదం కాయలు, (ఈ బాదం కాయలో 20 వరకు బాదం గింజలు ఉన్నాయి) కూరగాయలు చాలా చౌకగా ఉన్నాయి.స్వచ్ఛమైన(చాలరుచిగాఉంది.కారిపోతదని తీసుకోనందుకు ఇప్పటికీ బాధగా ఉంది) లీటరుతేనె బాటిల్ 450రూపాయలే. ఎక్కడ చూసినా పేదరికమే కనిపిస్తుంది. బాలీలో ఠాగూర్ గుడి ఒకటి ఉంది చాలా చిన్నది. అందరూ డాక్టర్లతో సహా పడి పడి దండాలు పెట్టారు (మేము తప్ప).
మూడు రోజుల లాంచి ప్రయాణం బోర్ కొట్టింది. పైగా వై. హెచ్ .ఏ.ఐవాళ్లుచెబుతున్నట్లుగా ఎక్కడ బెంగాలీ రాయల్ టైగర్స్, జింకలు, పక్షులు కనిపించలేదు. అక్కడక్కడ ముసళ్ళు,తాబేళ్లు కనిపించాయి. రెండు జంతు ప్రదర్శనశాలల్లో బక్క చిక్కిన నాలుగు పులులను, నిద్రపోతున్న నాలుగు ముసళ్ళను, నాలుగు కొంగలను చూసాం. ఇవి ఏ జూకి వెళ్లినా కనబడతాయి. 20 ఏళ్లు ఖర్చుపెట్టి ఇంత దూరం రావడం దండగ అనిపించింది.
సుందర్బన్ అడవుల గురించి కొద్దిగా చెప్పాలి.ఈసందర్భన్అడవులుపదివేలరెండువందల సదరపు మైళ్ళలో దాదాపు 40 శాతం, బెంగాల్లోని, 24 పరగ ణాల జిల్లాలో ఉన్నాయి. 102 దీవులు.సగం దీవులలో మనుషులు లేరట. గంగా బ్రహ్మపుత్ర నదుల మధ్య ఏర్పడిన అందమైన అతిపెద్ద డెల్టా. మడ అడవులు (మాoగ్రోవు అనే పదము నుండి) చెట్లు పెరిగే ప్రదేశం.) ఉష్ణ మండలం ప్రాంతం. (బెంగాలి బాషలో సుందర్= అందమైన, బన్= అడవి లేదా అరణ్యం). సుందరి చెట్లు ఎక్కువగా ఉండటం వలన సుందర్బన్ అని కూడా. మడ అడవులు సముద్ర అలల తాకిడిని, తుఫాన్ సమయంలో గాలుల దాటిని అడ్డుకుంటాయి. పులులున్న అడివి ఇది ఒక్కటే. 274 రకాల బెంగాల్ రాయల్ పులులున్నాయట. వేల సంఖ్యలో జింకలు, 55 రకాల జంతువులు, 54 రకాలసరీసృపాలు, 248 రకాల పక్షులు ఉన్నాయట సెప్టెంబర్ నుండి మార్చి వరకు ప్రపంచం నలుమూలల నుండి పక్షులు వస్తాయట, ఆరునెలల పాటు ఉండి సంతానాన్ని వృద్ధి చేసుకొని పోతాయట. సుందర్భన్ ఎటుచూచిన పచ్చదనమే. 1997లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తింపు ఇచ్చింది.
అయితే ఈ మడ అడవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ సమీపంలోని కోరంగి, ఐ.పోలవరం, సకినేటిపల్లి మండలాలలో కోరమండల్ తీర ప్రాంతాలలో ఉన్నాయి.
నాలుగో రోజు సోనాకలి నుండి బస్సులో కలకత్తాకు తీసుకురావడంతో వై.హెచ్.ఏ.ఐ వారి బాధ్యత అయిపోయింది. ఇక్కడి నుండి మా సొంత యాత్ర. కలకత్తా నుండి 152 కి.మీ దూరంలో బీర్బూమ్ జిల్లాలో ఉన్న శాంతినికేతనకు రైలులో వెళ్ళాం. శాంతినికేతన్కు వెళ్లాలనేది ఆనాటినుండి ఈనాటివరకు, గాంధీగారి నుండి మన విప్లవకవి చెరబండరాజు వరకు కలలు కన్నవారే. ఇప్పటికీ మనం కూడా. రవీంద్రనాథ్ భార్య మిలన్ దేవి పేరుతో ఎల్.కె.జి స్కూలు ఉదయం 10 గంటల వరకు నడుస్తుంది. వేరు వేరు పేర్లతో వేరువేరు తరగతులు నడుస్తున్నాయి ప్రతి విద్యార్థి చాపమీద కూర్చొని చదువుకోవాలట.
శాంతినికేతన్లో భాష, మానవీయ శాస్త్రాలు, సంస్కృతి, కళలు, నాట్యం, శిల్పం, చిత్ర లేఖనం, సాహిత్యం, సంగీతం మొదలైన అన్ని రకాల చదువులున్నాయి. సత్యజిత్ రే లాంటి ఉద్దండులు ఈ సంస్థ నుండే వచ్చారు. శాంతినికేతన్ దగ్గరనే అమర్త్యసేన్ (ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నారట) ఇల్లు చూసాం.
శాంతినికేతన్ లో విగ్రహాలు, చెట్లు గొప్ప అనుభూతితోచూస్తూ,ఫోటోలుతీశాం.ఓపెద్దచెట్టుచూపించి(గైడ్) రవీంద్రనాథ్ ఈ చెట్టు కింద కూర్చొనే మన జాతీయ గీతం, బాంగ్లాదేశ్ జాతీయగీతం (అప్పటికి బాంగ్లాదేశ్ విడిపోలేదంట) రాసాడట. రవీంద్రనాథ్, తల్లిదండ్రులు నివసించిన ఇళ్ళు, తరగతి గదులు అన్ని రోడ్డు మీద నుంచే చూడాలి. విద్యార్థులకు డిస్టర్బెన్స్ అని. స్పెషల్ పర్మిషన్తో లోపలకి వెళ్ళవచ్చట. శాంతినికేతన్ దారి అంతా పచ్చని కొబ్బరి చెట్లు,పంటపొలాలు,వరి, పసుపు పంటచేలు రాజస్థాన్ తో పోల్చితే పచ్చదనం బాగానే ఉంది. ఆవులు మేకలు కనిపిస్తున్నాయి. గేదలు, గొర్లు కనిపించడం లేదు. సోనాకలి వరకు పెద్ద కాలువ ఉందన్నానుకదా!ఆకాలవకుఆపక్కపచ్చనితోటలుoటే, కాలువకు ఈ వైపున దారంతా, ఊర్లన్నీ మురికి, కంపు, పేదరికం కనిపిస్తుంది. ఈ కాలవ పేరు, మంచినీళ్ళా, మురికి నీళ్ళా, ఉప్పునీళ్ళ అనేది ఎవరు సరిగ్గా చెప్పలేదు. సమృద్ధిగా నదులు, నీరున్నా ఈ పేదరికం ఏమిటో అనుకున్నాము.
విక్టోరియా మహల్ (ఇప్పుడు ఇది మ్యూజియం) లో మన చరిత్ర రవీంద్రనాథ్ కు సంబంధించిన చిత్రాలు దాదాపు చాలావరకు, కొన్ని విగ్రహాలు చూడవచ్చు. డాబర్ట్ క్లైవ్ విగ్రహం (బ్రిటిష్ రాజ్యస్థాపకుడు. అతను అక్కడకు వచ్చాడని తెలియగానే సిరాజుఉద్దేలాఅన్నంతింటున్నవాడల్లా పారిపోయాడట. రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ రాజ్యాన్ని స్థాపించానని ఆనందంగా కేకలు వేశాడట) చూడగానే ఓహో క్లైవ్ అంటే ఇతనేనా అనుకున్నాను గార్డెన్ బాగుంది.రకరకాల మొక్కలు,చెట్లు ఎంత ఎండాకాలమైనచల్లగా ఉండే తోటలు. ఇక్కడ మాత్రం సిటీ ఆఫ్ జాయ్ సిటీ ఆఫ్ బ్యూటీఅనొచ్చు.బిర్లా ప్లానెటోరియంను అనుకోకుండానే చూసాం. ఇందిరాగాంధీ పార్కు చిన్నదైనా నీట్ గా, అందంగా ఉంది. హుగ్లీ నదిపై బ్రిడ్జి, తీగల వంతెన బాగున్నాయి. రామకృష్ణ మిషన్ 5గం.కె క్లోజ్ చేశారు. మార్వాడీల పండుగయాత్ర జరుగుతూ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయాం.
కలకత్తా కాళీమాత విగ్రహాన్ని చూసి (మెడ నుండి తల వరకు మోకాలు ఎత్తున ఉంది. కలకత్తా కాళీమాతలా రౌద్రంగా అంటారుగా) నీరసపడ్డాం. 500 ఇచ్చి లోపలికి వెళ్ళాం మన తిరుపతి కన్నా ఎక్కువ ఒత్తిడిగా ఉండటంతో. లాగి పడేస్తున్నారనీ, నన్ను చేయి పట్టుకొని లాక్కెళ్ళి మరీ చూపించాడు మమ్మల్ని తీసుకెళ్లిన పంతులుగారు. గుడి గుడే పిడకలు పిడకలే అన్నట్లు ఇక్కడ మోసంగానే ఉందనిపిఅన్నట్లు ఇక్కడ మోసంగానే ఉందనిపించింది. కలకత్తాలో 24 గంటలు పంపుల్లో నీరు రావడం, కలకత్తాలో ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్ళినా పది రూపాయల టికెట్ ఇస్తూ ఉండటం, ఎక్కడా (ఎక్కడన్నా చినిగిపోయిన, పాతపడిపోయిన మమతా బెనర్జీ ఫ్లెక్సీలు కనిపించినవి) రాజకీయ నాయకుల ఫోటోలు బ్యానర్లు లేకపోవడం భలే నచ్చింది.
కాని కలకత్తా గురించి ఎవరు ఎన్ని చెప్పినా, నాకుమాత్రంఅక్కడపేదరికమేకనిపిస్తుంది. ఇప్పటికీ దుకాణాల షట్టర్లు మూసిన తర్వాత వాటిముందునిద్రిస్తున్నమనుషులు,వంటలుచేస్తున్న స్త్రీలు,రోడ్డుపక్కనేపంపులదగ్గరపళ్ళురుద్దుతున్నస్నానాలుచేస్తున్న,బట్టలుతుకుతున్నవాళ్లు, సైడ్ కాలవలమీదేతింటున్నవాళ్లు,కొత్తగాపెళ్ళైన నవదంపతులుకూడాఆమురికికూపంలోనేఆఇరుకుషాపుల మూసిన తలుపుల ముందు పాల్తిన్ పేపర్లను ఏటవాలుగా దించుకున్న సంసారాలే కనిపిస్తున్నాయి. ఓ చిన్న బంకులో సరుకుల అమ్మకం, బొంకు కింద వంటలు, కబుర్లు చెప్తున్నా కొత్తజంటను చూడగానే కన్నీటి చలమలూరేయి. స్నానాలు, టాయిలెట్స్ ఎక్కడ చేస్తారని మహిళలను అడిగితే దూరంగా ఉన్న టాయిలెట్స్ చూపించి, డబ్బులు చెల్లించి అన్నారు. ఇదంతా ఫేమస్ జె.సి.బోస్ రోడ్డులోకూడా. 50 సంవత్సరాల ఎర్రజెండాల పాలన, బెనర్జీల పాలన ఏమైందో? ఠాగూర్ల సంస్కరణలు, మదర్ థెరీసా, రామకృష్ణమఠం సేవలు ఏమి మార్చినవో? ఏమిటో? ఇప్పుడే ఇట్లా ఉంది అంటే అప్పుడు ఇంకెట్లా ఉందో అనుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లో లాగా ఎలాంటి పెన్షన్లు, ఉచిత పథకాలు ఇళ్ల నిర్మాణాలు లేవు అన్నారు.
కలకత్తాకు సిటీ ఆఫ్ జాయ్ (city of joy) సిటీ ఆఫ్ బ్యూటి (city of beauty)అని పేరు. కానీ నాకుమాత్రం సిటీ ఆఫ్ సారో (city of sorrow) సిటీ ఆఫ్ డర్టీ (city of durty)అనిపిస్తుంది. కళ్ళు మూస్తే కలకత్తా కన్నీటి చిత్రాలు, గాథాలే కనిపిస్తున్నాయి.