భావోద్వేగాలు ఎంత ప్రమాదం అంటే...
భావోద్వేగాలు ఎలా అపార్థాలకు ఆగ్రహానికి అనవసరమైన సంఘర్షణలకు దారితీస్తాయంటే
-మానస తిరుమల
జీవితం లో అన్నింటికన్నా మానవ సంబంధాలు ఎంతో విలువైనాయి.ఆ బంధాలలో వైవాహిక బంధం చాల ప్రాధాన్యత కలిగి ఉంటుంది మరియు సామరస్యంగ ఉంటుంది. గీతలో శ్రీకృష్ణుడు బోధించినట్టుగా ఆలు మగల బంధం అహంభావాలకు అతీతంగా ఉన్న, నిబంధనలు లేని, నిస్వార్థమైన ప్రేమను పెంపొందించుకోవాలని ప్రబోధిస్తుంది. అలాంటి ప్రేమ అవగాహన, మరియు ఐక్యత యొక్క లోతైన అనుభూతిని పెంపొందించడం ద్వారా సంబంధాన్నిమరింత అందంగా అన్యోన్యంగా మార్చుకోవచ్చు. కానీ ప్రస్తుత తరంలో భార్య భర్తలు వివాహ బాధ్యతే బరువైన వైఖరితో నిత్యం వారి వ్యక్తిగత స్వేచ్ఛకి ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ వారి మధ్యన ఉన్న సామీప్యతను (స్పేస్) మరింత దూరం చేసుకుంటున్నారు. ప్రతి వ్యక్తి ఎదగడానికి వ్యక్తిగత స్పేస్ చాల అవసరం. కానీ ఆ స్పేస్ ఎంతవరకు అనే ఒక అవగాహన ఇద్దరికీ స్పష్టంగా ఉండాలి .
అరవింద సమేత సినిమా లో హీరోయిన్ స్పేస్ కావాలి అని ఎపుడు అంటూ ఉంటుంది.. అల అనడం అవతలి వారిని దూరం పెట్టడం కాదు వారి వ్యక్తిగత అభిరుచులను పెంపొందించుకోవడం తో పాటు వారి సహచరికి తగినట్టుగా మలచుకోవడం లో కూడా ఉపయోగపడుతుంది.కుదిరిన సమయం లోనే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటు వారి యొక్క వ్యక్తిగత సమయాన్ని కూడా కేటాయించాలి.
ఎక్కడైతే అధికంగా మనం ప్రేమను పంచుతామో వారే మన అభిప్రాయాలతో విభేదించవచ్చు ఆ విభేదాలు సున్నితంగా తగ్గించుకోకపోతే కాలక్రమేణా పెరిగి మానసిక ఆందోళనకి ఒక కారణభూతం ల అవుతుంది .
వ్యక్తిగత గుర్తింపు అవసరం
వివాహం బంధం ఇద్దరు వ్యక్తుల శరీరాలు, మనస్సులు మరియు ఆత్మల కలయికగా వర్ణించబడింది. వివాహ బంధం లో స్త్రీ లేదా పురుషుడు అయినా, ఒక సంబంధంలో మరియు మీ కుటుంబంలో మిమ్మల్ని మీరు గుర్తింపు కోల్పోతే అది ఎవరికి ప్రయోజనం కలిగించదు.
"YOU + ME = WE" అనే నడవడికను అవలంబిస్తే చక్కటి కుటుంబాన్ని పెంపొందించవచ్చు. ప్రతి జంటలో ఇద్దరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది , ఆ యొక్క ప్రత్యేకతలని,అభిరుచుల్ని,అలవాట్లను నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు upgrade చేసుకుంటూ ఒకరినొకరు సమర్థించుకున్నపుడే ఆ బంధం కలకాలం ఒకరికి ఒకరు ప్రత్యేకంగానే ఉండిపోతారు. ప్రత్యేకంగా మహిళలు సాధారణంగా పెళ్లయ్యాక, వారు అనేక రంగాలలో పురోగతి ఉన్నప్పటికీ, స్త్రీలు తమ జీవిత భాగస్వామితో తమ జీవితాలను సర్దుబాటు చేయడానికి వారి ఆసక్తులు, అభిరుచులు మరియు స్నేహాలను విడిచిపెట్టాలని ఆశించడం ఇప్పటికీ చాలా చూస్తున్నాం . ఒక స్త్రీ తన కుటుంబాన్ని మరియు తన చుట్టూ ఉన్నవారిని వారి అత్యున్నత సామర్థ్యాన్ని వ్యక్తీకరించే శక్తిని కలిగి ఉంటుంది,
జీవితకాల సాంగత్యం, తమ జీవితాన్ని ప్రేమ మరియు ఆనందంతో నింపాలని కోరుకుంటారు . అయితే, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి, మీ జీవిత భాగస్వామిని వారు ఎలా ఉన్నారో అంగీకరించడం చాలా అవసరం. ప్రతి ఒక్కరికి భిన్నమైన నమ్మకాలు, ఆలోచనా విధానాలు, అభిప్రాయాలు మరియు దృక్కోణాలు ఉంటాయి. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించకపోవడం సహజం. అందువల్ల, వివాహం అనేది రెండు వేర్వేరు నమ్మకాలు మరియు మనస్తత్వాల కలయిక అని మనం చెప్పగలం. మనస్తత్వాల మాదిరిగా కాకుండా, ఒక జంట జీవితంలోని విభిన్న విషయాలతో వ్యవహరించే విధానంలో విభేదిస్తారు. ఈ వ్యత్యాసాలు వైవాహిక జీవితంలో సంఘర్షణను సృష్టిస్తాయి, తద్వారా సంతోషకరమైన వైవాహిక జీవితానికి విఘాతం కల్గిస్తాయి .
భావన భారమా…….?
భావోద్వేగ వ్యక్తీకరణ లో మీరు ఎలా ఎంతవరకు ప్రభావితం చేస్తారో అన్నధో ముఖ్యమైన భాగం, కానీ అవి గజిబిజిగా, సంక్లిష్టంగా మరియు కొన్నిసార్లు గందరగోళంగా ఉంటాయి. వ్యక్తుల వ్యక్తిగత సంబంధాలలో వారు సంతృప్తి, చికాకు మరియు ఆందోళన యొక్క తేలికపాటి భావాల నుండి ప్రేమ, కోపం మరియు నిరాశ యొక్క అత్యంత లోతైన అనుభవం వరకు విస్తృతమైన భావోద్వేగాలను అనుభవిస్తారు.
ఎడతెగక వదిలేస్తే, భావోద్వేగాలు అపార్థాలు, ఆగ్రహం మరియు అనవసరమైన సంఘర్షణకు దారితీస్తాయి. అయినప్పటికీ, మీ భావోద్వేగాలను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో నేర్చుకోవడం మీ సంబంధానికి మరింత సామరస్యాన్ని మరియు అవగాహనను తెస్తుంది.
సానుకూల భావోద్వేగాలు, ఆహ్లాదకరమైన ప్రతిస్పందనలు కుటుంబ సామీప్యతకు దోహదపడతాయి. ప్రతికూల భావోద్వేగాలు , మనసుకి కష్టతరం అయిన ఒక సంఘటన లేదా వ్యక్తిపై ప్రతికూల ప్రభావాన్ని వ్యక్తీకరించడానికి ప్రేరేపించబడతాయి. భాగస్వామికి మన భావాలూ,భావన అర్థం చేసుకోవడం, లేదా అర్థం అయేట్లు చెప్పటం , ఆ సమయంలోని భావోద్వేగాన్ని సమర్థవంతంగా అవతలి వారికి వారికీ వివరించడం నేర్చుకోవాలి.కొంత సమయాన్ని తీసుకొని మీరిద్దరూ బాగా కమ్యూనికేట్ చేయగలరని మరియు సమస్యను పరిష్కరించుకోగలరని భావనని అలవర్చుకోవాలి.
నిర్ణయం నిలబడుతుందా
ఇప్పటి యువత లో ఎక్కువగా భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం తగ్గిపోయింది. ఇన్స్టంట్ నూడుల్స్ లాగా మనం కూడా ఎదుటి వారి యొక్క నిర్ణయాలని త్వరగా జడ్జ్ చేస్తుంటాము. అపార్థాలు ఎక్కువై విచారకరమైన బాధలు , వాదనలు పెరిగి ఐక్యత కరువైంది. ఒక చిన్న తొందరపాటు అపార్థం వల్ల ప్రారంభమైన ఆరోపణల ప్రయాణం ఇద్దరి మనసుల గాయాలకు ,వారి హృదయ వేదనకు ప్రధాన మూలంగా వారి ఇరువురి జీవిత నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది.
ఇతరుల నిర్ణయాలపై వెంటనే ఒక అభిప్రాయం రావడం సులభం, కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారి యొక్క అభిప్రాయం ధోరణి కొన్ని సార్లు మనకు విముఖంగా ఉన్న వాటిని విశ్వసించే సుముఖత ఇద్దరికీ చాల ముఖ్యమైంది , ఇది ఇద్దరి ఎదుగుదలకి,కుటుంబ ఆహ్లాదానికి ప్రధాన భూమిక పోషిస్తుంది.
మానసిక బలం -కుటుంబ బలం
మానసిక ఆరోగ్యం సామాజిక, వృత్తిపరమైన మరియు భావోద్వేగాలతో సహా మన పనితీరులోని దాదాపు ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది.వైవాహిక జీవితంలో మానసిక ఆరోగ్యం ముఖ్యమైన భాగం, మూలం , కుటుంబాల యొక్క సానుకూల మరియు ప్రతికూలతలను ప్రభావితం చేస్తుంది. నమ్మకం మరియు భాగస్వామి పట్ల ప్రశంసలు వంటి లక్షణాలను పెంపొందించడం ద్వారా మీ సంబంధాలను బలపర్చుకోవడంలో దోహదపడుతుంది. ప్రయత్నంపైన మాత్రమే దృష్టి పెట్టకుండా, చేసిన ప్రయత్నాన్ని గుర్తించడం మరియు ప్రశంసించడం ద్వారా కుటుంబ వృద్ధిని అనుభవించగలరు. ఈ మార్పు మీ సారూప్యతను మరింతగా పెంచుకోవడానికి కష్టతరమైన సవాళ్లను కూడా అవకాశాలుగా మార్చగలదు. ప్రతి అడ్డంకితో, మీ సంబంధాలు బలంగా మరియు మరింత స్థితిస్థాపకంగా కొనసాగించబడుతుంది.
మౌనం మంచిదే
ఆలుమగల మధ్య గిల్లికజ్జాలు సహజం. ప్రతి సంబంధంలో వాదనలు సహజమైన భాగం. మీరు దానిని అంగీకరించకూడదనుకుంటున్నప్పటికీ, మీ ప్రియమైన వ్యక్తితో కొన్ని వాదనలు సాధారణం కంటే ఎక్కువగ కొన్ని సమయాలలో ఉద్వేగభరితంగా ఉంటాయి . ఒక సమస్య వచ్చినప్పుడు ,ఒక భాగస్వామి దానిని పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పుడు మరొకరు నిరాకరించ వచ్చు ,అప్పుడు ఆ కొంత అలంకారిక అడ్డుగోడను తొలగిచడం కష్టం అయినా ఒకరిని ఒకరు అర్థవంతమైన , సందర్భోచితంగా మాట్లాడుకోవడం లో తెర తొలిగి ప్రేమను ,నమ్మకాన్ని పొందగలరు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకరంటే ఒకరికి అపారమైన ప్రేమ ఉన్న కేవలం చిన్న చిన్న అపార్థాలు,అపోహలు , ఆందోళనలు ,అపనమ్మకం , అభద్రతాభావం ఇలా ఎన్నో అవాంఛిత ఆలోచనల ఊబిలో వర్ణశోభితమైన కుటుంబ సంతోషాన్ని వారి మధ్యన ఉన్న దాంపత్య బంధంలో దూరాన్ని పంచుకుంటున్నారు.
ఆనందాన్ని జంటగా ఆస్వాదించండి
ఏది ఏమైనప్పటికీ, సంతృప్త జీవితంలో సంబంధాలు ఒక ముఖ్యమైన భాగం అయితే, మీరు మీ ఆనందం కోసం ఇతరులపై ఆధారపడకూడదు.
ఇతర వ్యక్తులు మనతో పూర్తిగా ఏకీభవించడం, మనల్ని ఇష్టపడడం, మనల్ని విలువైనదిగా పరిగణించడం, మనల్ని అర్థం చేసుకోవడం, మనతో ఎల్లవేళలా ఉండాలని కోరుకోవడం అదే పూర్తి ఆనందం అని అనుకోకూడదు . మన మార్గంలో జరిగే విషయాలపై ,ప్రేమించే వ్యక్తులపై ,మనం ప్రేమించబడాలని కోరుకునే మార్గంలో తిరిగి మనల్ని అదే స్థాయిలో ప్రేమించాలి అనే భావన నుండి బయటపడాలి. మరొక వ్యక్తిని సంతోషపెట్టడానికి లేదా వారి ఊహించిన అంచనాలను అందుకోవడానికి మాత్రమే మీ జీవితాన్ని మార్చే క్రమంలో మీ లో మీరు కోల్పోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. అది మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది మరియు అనవసర ఆగ్రహానికి దారితీస్తుంది.
మీ భాగస్వామి తమ లక్ష్యాలను సాధించినప్పుడు మరియు వారి విజయాలను జరుపుకున్నప్పుడు వారు నిజంగా సంతోషంగా ఉంచడం చాలా ముఖ్యం. వారి ఆనందాన్ని పంచుకోవడం మీ మద్దతును తెలియజేయడం మీ వంతు ప్రధాన భూమిక వ్యక్తపరచడం ఎంతో అవసరం.
భార్య భర్తలు ఇద్దరు మీ కలలను గౌరవించండి మరియు అంతర్నిర్మిత ఆనందానికి మీరు మీకే మూలంగా మారండి, ఎందుకంటే మీరు సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం మీకు మాత్రమే తెలుసు.