
ఏపీలో కదిలిన 'దివ్యాంగ శక్తి' రథం- చిత్రమాలిక
సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేష్ నాయకత్వంలో ఇవాళ దివ్యాంగ శక్తి రథం కదిలింది. ఆ చిత్రాలు ఇలా..
ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగ శక్తి రథం కదిలింది.
దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే పథకం ఇది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ నుంచి ఈ రథం కదిలింది.
ప్రారంభించిన అనంతరం దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు.
డాన్‌బాస్కో స్కూల్ మీదుగా డోలాస్ నగర్, ప్రకాశ్‌నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక వెళ్లారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.
పవన్ కల్యాణ్ బస్సులో సందడి చేశారు.
పలువురి పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
బస్సులోని వారితో సెల్ఫీలు దిగారు.
అనంతరం అందరూ కలిసి భోజనం చేశారు.
ఇవాళ ప్రారంభించిన ఈ దివ్యాంగ శక్తి పథకం తనకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తోందని సీఎం అన్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ తో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో ప్రయాణించటం సంతృప్తిని ఇచ్చిందన్నారు.
దివ్యాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులు, సమస్యను అధిగమించి విజయాలు సాధించే శక్తి ఉన్న వాళ్లు అని చెప్పారు.

