
కాఫీ కిక్కు పెంచే ట్రిక్కు..
మనం కాఫీ లేదా టీ తాగే మగ్(కప్) కలర్ కూడా మన మెదడుపై ప్రభావం చూపుతుంది.
వేడి వేడి కాఫీ(Coffee)ని ఆస్వాదిస్తూనే చాలా మంది రోజు ప్రారంభం అవుతుంది. ఏం చేసినా చేయకపోయినా.. బ్రహ్మాండం బద్దలవుతున్నా నిద్ర మేల్కొన్న తర్వాత కాఫీ తాగనిదే రోజును ప్రారంభించని వారు చాలా మందే ఉన్నారు. అప్‌కోర్స్ నేను కూడా వారిలో ఒకడినే. ఈ కాఫీ మిస్ అయినా, ఆలస్యం అయినా ఆ రోజు మన చేతిలో ఉండదు. ఏదీ అనుకున్నట్లు జరగదు. ఒక్కమాటలో చెప్పాలంటే పొద్దున్న మిస్సయిన కాఫీ మన రోజు మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే మీకో విషయం తెలుసా.. ఆ కాఫీ కన్నా.. ఆ కాఫీని మనం తాగే కప్పు రంగు మనల్ని ఇంకా ఎక్కువ ప్రభావితం చేయగలదని. ఆఖరికి మనకు ఎంతో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, పీస్ ఫుల్ మైండ్‌ను అందించే కాఫీ రుచిని, వాసనను కూడా మర్చేయగలదని. అది ఆ రంగు పవర్. అంటే కాఫీ తాగడంతో కాదు.. ఏ కప్పులో తాగం అన్నది కూడా మన డైలీ రొటీన్‌పై ప్రభావం చూపుతుంది.
కాఫీ అదొక ఉత్సవం..
ఉదయాన్నే కాఫీ తాగడం అనేది ఒక ఉత్సవం అనే చెప్పాలి. ఈ ఉత్సవం ఒక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరు ఉదయించే సూర్యుడిని చూస్తూ వేడి వేడి కాఫీని సిప్ చేయడాన్ని ఇష్టపడతారు. మరికొందరికి ఒక చేతిలో గుమగుమలాడుతూ పొగలుగక్కుతున్న కాఫీని పట్టుకుని, మరో చేతిలో ఇష్టమైన రచయిత, పబ్లికేషన్స్, న్యూస్ పేపర్స్ వంటివి చదువుతూ చిన్నగా కాఫీని తాగడం నచ్చుతుంది. ఇంకొందరు తమకు నచ్చిన మ్యూజిక్(Music) వింటూ ఆ కాఫీని ఆస్వాదిస్తారు. ఇలా ఎవరి అభిరుచులకు తగ్గట్టు వారు కాఫీ తాగడాన్ని కూడా ఒక ఉత్సవంలా చేసుకుంటారు.
ఇలా రోజూ చేసే ఈ రిచువల్ మన ఉదయాన్ని ఎంతో ఆహ్లాదకరంగా, మన రోజును సంతోషకరంగా మారుస్తుంది. ఎప్పుడయినా వీటిలో ఏది మారినా అది మీ కాఫీపై కానీ, మూడ్‌పై కానీ పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. కానీ ఆ కాఫీ మగ్ కలర్ మారితే అంతా మారిపోతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. పలు అధ్యయనాలు చెప్తున్న వాస్తవం. 2015లో వచ్చిన ‘జర్నల్ ఫ్లేవర్ హింటెడ్’ అనే అధ్యయనం కూడా ఇదే చెప్పింది. మన కాఫీ కప్పు రంగు చాలా ప్రాధాన్యమని, అది మన మూడ్‌ను పూర్తిగా మార్చగలదని వివరించింది. మన కాఫీని కూడా మరింత చేదుగా చేయడం, తీపిని పెంచడం, అసలు రుచే లేకుండా చేయగల సత్తా కూడా ఆ కలర్‌కి ఉందంటుందీ జర్నల్.
ఏ రంగు.. ఏ రుచి..
2019లో ‘జర్నల్ ఎక్స్‌పెరిమెంటల్ సైకాలజీ: జనరల్’ (Journal of Experimental Psychology: General)లో ప్రచురితమైన ఒక అధ్యయనం.. ఒక్కో రంగు ఒక్కో రుచిని ప్రభావితం చేస్తుందని వివరించింది. ఉదాహరణకు పింక్, రెడ్ రంగులు చాలా తియ్యదనాన్ని ప్రభావితం చేస్తాయి. మామూలు స్థాయికన్నా మరింత తీపిగా అయ్యేలా చేస్తాయి. ఇదంతా కూడా మన మెదడు చేస్తుంది. ఒక రంగును చూసిన మరుక్షణం మన మెదడు ఒకలా రెస్పాండ్ అవుతుంది. ఆ మార్పులే ఈ మార్పులన్నిటికీ కారణం. ఆ మార్పులే మన కాఫీ రుచినీ మార్చేస్తాయి. మన మూడ్‌ని, మన రోజును, మన తీసుకునే ఆలోచనను కూడా మార్చేస్తాయి. మానసిక నిపుణుడు చార్ల్‌స్ స్పెన్స్(Charles Spence) సహా ఇతర నిపుణులు, పరిశోధకులు చేసిన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి.
వైట్, బ్రౌన్ (White, Brown) : ఈ రంగు మగ్స్ మన కాఫీని మరింత చేదుగా, ఇంటెన్స్‌గా మారుస్తాయి. ఈ రంగుల కప్పును చూడగానే మన మెదడు కాంట్రాస్ట్‌ను ఎక్కువగా ఫీల్ అవుతుంది. అప్పుడు అది కాఫీ రంగును మరింత స్ట్రాంగ్‌గా మారుస్తుంది. అలా కనిపించగానే మన మెదడు ఆటోమేటిక్‌గా ఆ కాఫీ మరింత చేదుగా, స్ట్రాంగ్‌గా ఉంటుందని భావించి.. అదే రుచిని అందిస్తుంది.
లైట్ కలర్స్ (Light Colors) : లైట్ కలర్స్‌లో ఉండే మగ్స్ మన కాఫీ స్వీట్‌నెస్ ప్రభావితం చేస్తాయి. కొన్ని అధ్యయనాల్లో అభ్యర్థులు ఈ లైట్ కలర్ మగ్స్‌లో ఉన్న కాఫీ ఎక్కువ తియ్యగా ఉందని చెప్పారు. అంతేకాకుండా ఇలాంటి మగ్స్‌లో కాఫీ తాగిన సమాయాల్లో వాళ్లు ఎసిడిగ్ ప్రభావం కూడా చాలా తక్కువ ఉందని చెప్పారు. అదే కాఫీని వైట్ కప్‌లో తాగితే మాత్రం.. అంత తీపి లేదని, ఎసిడిక్ ప్రభావం ఎక్కువ ఉందని అన్నారు.
బ్లూ (Blue) : ఇవి కాఫీ ఉన్న దానికన్నా కొద్దిగా ఎక్కువ తియ్యగా అనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా కాఫీ స్ట్రాంగ్‌నెస్‌ను కూడా తగ్గిస్తుంది.
ఆకుపచ్చ (Green): ఈ రంగులో ఉండే మగ్స్‌లో కాఫీ తాగేటప్పుడు ఎసిడిక్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆకుపచ్చను చూడగానే మన మెదకు ఎక్కువగా పులుపును లేదా ఎసిడిక్ ప్రభావాన్ని కలించే ఫలాలను గుర్తు చేసుకుంటుంది. అదే ప్రభావాన్ని మన కాఫీపై కూడా చూపుతుంది.
పసుపు రంగు (Yellow): ఈ కప్స్‌లో తాగితే కాఫీ వీక్ బ్లెండ్ అన్న ఫీల్ కలుగుతుంది. తాగినా తాగిన అనుభూతి ఉండదని అధ్యయనాలు చెప్తున్నాయి.
ఏ రంగులు.. ఎలాంటి ప్రభావం..
ఎరుపు, పసుపు, ఆరెంజ్ (Red, Yellow, Orange): ఇవి వార్మ్ కలర్స్ కేటగిరీలోకి వస్తాయి. ఇవి మన ఎనర్జీ, ఎక్సయిట్‌మెంట్‌ను ప్రభావితం చేస్తాయి. ఈ రంగు మగ్స్‌లో కాఫీ లేదా టీ తాగడం ద్వారా అవి మనకు సబ్‌కాన్షియస్‌గా ఎనర్జీ బూస్ట్ ఇస్తాయి. రోజువారీ మోటివేషన్‌కు ఈ కలర్స్ బెస్ట్.
బ్లూ, గ్రీన్ (Blue, Green) : ఇవి ప్రశాంతతు, సమతుల్యత, ఫోకస్‌కు సహాయడతాయి. వీటిలో మన ఫేవరెట్ డ్రింక్‌ను తీసుకుంటే అది మ ప్రశాంతత, ఏకాగ్రతను పెంచుతాయి. ఒత్తిడి నిండిన రోజులో ఇవి ఉపయోగపడతాయి.
గ్రే, వైట్ (Grey, White): ఇవి పరిశుభ్రత, ప్యూర్, సింపుల్ ఫీల్‌ను కలిగిస్తాయి. ఇవి రోజులో మన అన్‌బయాస్‌డ్, న్యూట్రల్ మైండ్‌తో ఉండటానికి ఉపయోగపడతాయిన అధ్యయనాలు చెప్తున్నాయి.
పది నిమిషాల కాఫీకి ఇంత సీనా..!
ఇదంతా చదివిన తర్వాత చాలా మంది ఇదే అనుకోవచ్చు. అవును మనం కాఫీని పదినిమిషాల్లో తాగేయొచ్చు. కానీ ఆ పది నిమిషాల్లో ఆ కప్పు రంగు మన మెదడుపై అంతకన్నా ఎక్కువ ప్రభావాన్ని చూపగలవు. మన తీసుకునే ప్రతి సిప్‌కు మన కప్ వైపు చూస్తాం. అది మనల్ని మానసికంగా ప్రభావితం చేస్తుంది. అది మన కాఫీ రంగు, కప్పు రంగు మధ్య ఉండే కాంట్రాస్ట్‌ను మన మెదడుకు చూపుతుంది. అదే మన కాఫీ రుచి, వాసనను మార్చడమే కాకుండా రోజంతా మన తీసుకునే ఆలోచనలను కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అందుకే కాఫీ, కాఫీ కప్పు రంగు మధ్య ఉన్న సైన్స్‌ను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి మీ కాఫీకి ఏ కప్ సూట్ అవుతుందో చూసుకుని ప్లాన్ చేస్కోండి.