
బిల్ గేట్స్ విజయవాడ గడ్డపై అడుగిడిన వేళ.. చిత్రమాలిక
ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కొద్దిసేపటి కిందట విజయవాడ గడ్డపై అడుగుపెట్టారు. చంద్రబాబు పూర్వమిత్రుడు ఆయన. ఆవేళ హైదరాబాద్ లో ఇవాళ ఏపీ రాజధాని అమరావతిలో..
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ మొదలు సత్యకుమార్ వరకు పలువురు బిల్ గేట్స్ కు స్వాగతం పలికారు. ఆ దృశ్యాలు ఇలా ఉన్నాయి..
గన్నవరం విమానాశ్రయంలో అడుగిడిన బిల్ గేట్స్
బిల్ గేట్స్ కు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేశ్
బిల్ గేట్స్ కు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు
బిల్ గేట్స్ కు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి అనిత
బిల్ గేట్స్ కు గతంలో స్వాగతం పలికిన చంద్రబాబు (పాత చిత్రం)
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu)తో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్ (Bill Gates) భేటీ అయ్యారు. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన అనంతరం ఆయన నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు.
బిల్‌గేట్స్‌కు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారితో బిల్‌గేట్స్ బృందం సమావేశమైంది.

